Touching Feet: కొందరి పాదాలకు మొక్కితే అష్టదరిద్రాలు అంటుకుంటాయట. లేనిపోని కష్టాలు వెన్నంటి వస్తాయట. నెగెటివ్ ఎనర్జీ భయంకరంగా పీడిస్తుందట. ఇంకా కొన్ని సందర్బాలలో కొందరి పాదాలకు మొక్కడం కూడా శాస్త్ర రీత్యా మంచిది కాదని పండితులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఎవరి పాదాలు.. ఏ సందర్భాలలో మొక్కకూడదో..? మొక్కితే ఎలాంటి అరిష్టాలు అంటుకుంటాయో లాంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
హిందూ సాంప్రదాయంలో పెద్దల పాదాలు మొక్కడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. పెద్దల కాళ్లు మొక్కి వారి నుంచి ఆశీర్వాదం తీసుకోవడం అనేది అన్న మతాలలో ఉన్న సంప్రదాయం. అయితే కొన్ని సందర్భాలలో కొందరి పాదాలు అసలు మొక్కకూడదట. మొక్కడం మాట అటుంచితే ఆయా సందర్భాలలో వారి పాదాలను కూడా తాకకూడదట. అలా తాకితే వచ్చే అదృష్టం మాట అటుంచితే లేని పోని దరిద్రాలు చుట్టుకుంటాయట. ఆ సందర్భాలేంటో.. ఆ వ్యక్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
గుడిలో ఉన్నప్పుడు అక్కడ దేవుడికి మొక్కడం తప్పా ఎవరిని మొక్కకూడదట. అలాగే ఆలయంలో ఎవరి పాదాలకు మొక్కకూడదట. పూజారి పాదాలు కూడా తాకకూడదట ఇలా చేయడం వల్ల గుడిలోని దేవుణ్ని తక్కువ చేసిన వారవుతారు. దీంతో దేవుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు.
ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిద్రించే వ్యక్తి పాదాలు తాకడం కానీ పాదాలకు మొక్కడం కానీ చేయకూడదట. ఇది అనైతిక చర్యగా శాస్త్రం చెప్తుందట. నిద్రించే వ్యక్తి శక్తి కన్నా మెలుకువగా ఉన్న వ్యక్తి శక్తి ఎక్కువగా ఉంటుందట. అందుకే నిద్రించే వ్యక్తి పాదాలకు మొక్కితే మెలుకువగా ఉన్న వ్యక్తి శక్తి తగ్గిపోతుందట.
ఎంతటి పెద్దవారైనా స్మశానం నుంచి వచ్చినప్పుడు వారి పాదాలు తాకకూడదు. పాదాలకు మొక్కకూడదట. స్మశానం నుంచి వ్యక్తి పాదాల దగ్గర నెగెటివ్ ఎనర్జీ ఉంటుందట. అలాంటి టైంలో మొక్కడం లేదా తాకడం చేస్తే ఆ నెగెటివ్ ఎనర్జీ మొక్కిన వ్యక్తికి వస్తుందట. అలా వచ్చిందంటే ఆ వ్యక్తి జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్యలు హెచ్చరిస్తున్నారు.
ఇంకా సమాజంలో మతం పాటించని వ్యక్తి పాదాలకు మొక్కినా.. తప్పుడు పనులు చేసే వ్యక్తి పాదాలకు మొక్కినా వారికున్న నెగెటివ్ ఎనర్జీ మొక్కిన వ్యక్తులను బాధిస్తుందట. వారి నుంచి వచ్చే ప్రతికూల ప్రభావాల మొక్కిన వ్యక్తి జీవితాన్ని తారుమారు చేస్తాయట.
ఇక భార్య పాదాలు భర్త ఎప్పటికీ టచ్ చేయకూడదట. ఎందుకంటే భార్యకు భర్త రక్షకుడు కాబట్టి భార్య పాదాలు తాకడం పాపమట. భార్యకు జన్మజన్మల పాప కర్మలు అంటుకుంటాయట.
ఆలయంలో కానీ ఇంటిలో కానీ మరేదైనా స్థలంలో కానీ దేవుడికి పూజ చేస్తున్న వ్యక్తి పాదాలు అసలు తాకకూడదట. ఇలా తాకడం వల్ల ఆ వ్యక్తికి అంతరాయం కలిగించినట్టు అవుతుందని అది పెద్ద పాపకర్మ కిందకే వస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు.
పిల్లనిచ్చిన అత్తమామల కాళ్లను ఇంటి అల్లుడు ఎట్టి పరిస్థితుల్లో మొక్కకూడదట. ఇలా చేయడం వల్ల అత్త మామలకు పాపం అంటుకుంటుందట. కూతురును లక్ష్మీదేవిగా బావిస్తారు కాబట్టి అల్లుడిని శ్రీమన్నారాయణుడిగా బావించాలట. అందుకే అల్లుడు ఎట్టి పరిస్థితుల్లో అత్తమామల కాళ్లు మొక్కకూడదు. మరో సందర్భంలో పరమశివుడు తన మామ అయిన దక్ష ప్రజాపతి తల నరికినప్పటి నుంచి ఈ ఆచారం ఉందంటున్నారు.
ఇక మేనల్లుడు కూడా మేనమామ పాదాలు అసలు తాకకూడదట. సోదరిని లక్ష్మీ స్వరూపంగా బావిస్తారు. అలాంటి సోదరి కొడుకు, లేదా కూతురును కూడా లక్ష్మీ స్వరూపంగానే బావించాలట. అందుకే మేన కోడలు, లేదా మేనల్లుడి చేత కాళ్లు మొక్కించుకోకూడదని శాస్త్రం చెప్తుందట.
పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం – అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు.