E-Paper
Advertisement

ధర ఎక్కువైనా సూపర్ క్రేజ్.. 5 నెలల్లో 15 వేల హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులు సేల్!

ధర ఎక్కువైనా సూపర్ క్రేజ్.. 5 నెలల్లో 15 వేల హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులు సేల్!
Advertisement

Hero Flex Fuel Bike: పెట్రోల్ ధరలు, భవిష్యత్తులో ఫ్యూయల్ అవైలబులిటీపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలపై ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) తీసుకొచ్చిన ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులకు మంచి స్పందన లభిస్తోంది. కంపెనీ విడుదల చేసిన స్ప్లెండర్+ ఫ్లెక్స్ (Splendor+ Flex), హెచ్‌ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ (HF Deluxe Flex) మోడళ్లు ఇప్పటి వరకు 15,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. జూన్ 2026లో మార్కెట్లోకి వచ్చిన ఈ రెండు బైకులు E20 నుంచి E85 వరకు ఇథనాల్ కలిపిన ఇంధనంతో నడిచేలా రూపొందించారు. స్టార్టింగ్ లో తక్కువ ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ, వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

జూన్‌లో విడుదల.. ధరల్లోనూ తగ్గింపు..

హీరో మోటోకార్ప్ ఈ రెండు ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులను జూన్‌లో విడుదల చేసింది. ప్రారంభించిన రెండు వారాలకే వీటి ధరలను రూ.4,000 మేర తగ్గించింది. అయినప్పటికీ, సాధారణ మోడళ్లతో పోలిస్తే ఫ్లెక్స్-ఫ్యూయల్ వేరియంట్ల ధర కొంత ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం సాధారణ స్ప్లెండర్+తో పోలిస్తే స్ప్లెండర్+ ఫ్లెక్స్ ధర రూ.5,133 ఎక్కువగా ఉంది. ఇక హెచ్‌ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ధర సాధారణ హెచ్‌ఎఫ్ డీలక్స్ కంటే రూ.13,315 ఎక్కువగా ఉంది. ధరల్లో తేడా ఉన్నప్పటికీ వినియోగదారులు కొత్త టెక్నాలజీ వైపు మొగ్గు చూపుతున్నారు.

E85 ఫ్యూయల్ తో మరింత పవర్, టార్క్

Advertisement

ఈ రెండు బైకుల ప్రత్యేకత కేవలం ఇంధన సామర్థ్యానికే పరిమితం కాలేదు. E85 ఇంధనంతో నడిచేటప్పుడు సాధారణ E20 వెర్షన్ల కంటే మంచి పనితీరును కనబరుస్తున్నాయి.

పవర్: 8.6hp (E85) వర్సెస్ 8.02hp (E20)

Advertisement

టార్క్: 8.3Nm (E85) వర్సెస్ 8.05Nm (E20)

అంటే.. E85 ఫ్యూయల్ లో నడిచినప్పుడు సుమారు 7 శాతం ఎక్కువ పవర్, 3 శాతం ఎక్కువ టార్క్ లభిస్తుంది.

కొన్ని ప్రాంతాల్లోనే అమ్మకాలు 

అక్టోబర్ 29, 2026న జరిగిన హీరో మోటోకార్ప్ Q2 FY27 మీట్ లో అమ్మకాలకు సంబందించిన వివరాలు వెల్లడయ్యాయి. జూన్ నుంచి ఇప్పటి వరకు ఈ రెండు మోడళ్లకు కలిపి 15,000 యూనిట్లను డిస్పాచ్ చేసినట్లు కంపెనీ సీఈఓ హర్షవర్ధన్ చితాలే వెల్లడించారు. అయితే, దేశవ్యాప్తంగా E85 ప్యూయల్ అందుబాటులో లేకపోవడంతో, ప్రస్తుతం ఎంపిక చేసిన డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే ఈ బైకులను అమ్ముతున్నారు. E20 ఫ్యూయల్ మాత్రమే అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోనూ వినియోగదారులు వీటిని కొనుగోలు చేస్తున్నారని కంపెనీ వెల్లడించింది.

స్ప్లెండర్+ ఫ్లెక్స్‌ కి మంచి ఆదరణ..

హీరో మోడల్ వారీగా విక్రయాల వివరాలను వెల్లడించలేదు. అయితే, ధరల మార్పులను పరిశీలిస్తే స్ప్లెండర్+ ఫ్లెక్స్‌ కు ఎక్కువ ఆదరణ  లభిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ స్ప్లెండర్+ ధర రూ.82,710 నుంచి రూ.84,042కు పెరిగింది. మరోవైపు హెచ్‌ఎఫ్ డీలక్స్ ధర మాత్రం రూ.72,792గా కొనసాగుతోంది. భవిష్యత్తులో E85 ఇంధనం అందుబాటులోకి వస్తుందని, ఎక్కువ కాలం వినియోగించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్న వినియోగదారులు ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ బైకులపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

Read Also: లంబోర్ఘిని కార్ల యాడ్స్ టీవీలో ఎందుకు రావో తెలుసా? ఇదీ అసలు కథ!

Tags

Related News

లంబోర్ఘిని కార్ల యాడ్స్ టీవీలో ఎందుకు రావో తెలుసా? ఇదీ అసలు కథ!

క్రాష్ టెస్ట్ లో దుమ్మురేపిన హ్యుందాయ్ వెర్నా.. టాప్ రేటింగ్ తో సత్తా!

టాటా సియెర్రా EVకి 5 స్టార్ రేటింగ్.. క్రాష్ టెస్టుల్లో అదరగొట్టిందిగా!

ఈ బైక్‌ ప్రమాదాన్ని ముందే గుర్తిస్తుంది.. హోండా టెక్నాలజీ చూస్తే మతిపోవాల్సిందే!

ఎలక్ట్రిక్ MPV To 7 సీటర్ SUV.. మారుతి నుంచి రాబోతున్న 5 కొత్త మోడల్స్ ఇవే!

బాబోయ్ 70% బై బ్యాక్ ఆఫర్.. కియా సోరెంటో లవర్స్ గుడ్ న్యూస్!

ఒకప్పుడు సామాన్యుల కారు.. ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపు.. మారుతి 800కు అరుదైన గౌరవం!

Big Stories

Advertisement
×