E-Paper
Advertisement

ఈ బైక్‌ ప్రమాదాన్ని ముందే గుర్తిస్తుంది.. హోండా టెక్నాలజీ చూస్తే మతిపోవాల్సిందే!

ఈ బైక్‌ ప్రమాదాన్ని ముందే గుర్తిస్తుంది.. హోండా టెక్నాలజీ చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Honda Sensing Ride: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా బైక్ రైడింగ్‌ను మరింత సురక్షితంగా మార్చేందుకు కొత్త టెక్నాలజీని పరిచయం చేసింది. దీనికి హోండా సెన్సింగ్ రైడ్ (Honda Sensing Ride) అని పేరు పెట్టింది. రైడర్‌ కు ఎదురయ్యే ప్రమాదాలను ముందుగానే గుర్తించి హెచ్చరించడం, అవసరమైన సమయంలో రైడింగ్‌లో సాయం అందించడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. ఇందుకోసం బైక్ ముందు, వెనుక భాగాల్లో రాడార్ సెన్సార్లను ఏర్పాటు చేసింది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ నుంచి ఎమర్జెన్సీ బ్రేకింగ్ అసిస్ట్ వరకు ఇందులో ఎన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

రాడార్ సెన్సార్లతో చుట్టుపక్కల వాహనాలపై నిఘా

హోండా సెన్సింగ్ రైడ్‌ లో ముందు, వెనుక భాగాల్లో రెండు మిల్లీమీటర్ వేవ్ రాడార్ యూనిట్లు ఉంటాయి. ఇవి రేడియో తరంగాల ద్వారా చుట్టుపక్కల ఉన్న వాహనాలను గుర్తిస్తాయి. వాటి వేగం, కదలికలను విశ్లేషించి ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు రైడర్‌ ను అప్రమత్తం చేస్తాయి. ముందు రాడార్ రోడ్డుపై ఎదురుగా వెళ్తున్న వాహనాలను పర్యవేక్షిస్తే, వెనుక రాడార్ వెనుక నుంచి, పక్క లేన్లలో వస్తున్న వాహనాలను గుర్తిస్తుంది.

ట్రాఫిక్‌లోనూ సులభంగా ప్రయాణం

Advertisement

ఈ టెక్నాలజీలోని ముఖ్యమైన ఫీచర్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ACC). ఇందులో స్టాప్ అండ్ గో సదుపాయం కూడా ఉంది. ముందున్న వాహనం వేగాన్ని బట్టి బైక్ వేగాన్ని ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. ముఖ్యంగా హోండా డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT)తో కలిసి పనిచేయడం దీని ప్రత్యేకత. ట్రాఫిక్‌లో అవసరమైనప్పుడు బైక్‌ను ఆపడం, పరిస్థితులు అనుకూలించినప్పుడు తిరిగి ముందుకు కదిలించడం లాంటి పనులకు ఇది సాయపడుతుంది. అలాగే గ్రూప్ రైడ్ అసిస్ట్ ఫీచర్ కలిసి ప్రయాణించే బైకర్లు ఒకరికొకరు సరైన దూరం పాటించేలా సహకరిస్తుంది. డిస్టెన్స్ అసిస్ట్ ఫీచర్ ముందున్న వాహనానికి, బైక్‌కు మధ్య తగిన దూరాన్ని మెయింటెయిన్ చేయడంలో సాయపడుతుంది.

ప్రమాదాలను ముందుగానే గుర్తించే ఫీచర్లు

ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ ముందున్న వాహనంతో ఢీకొనే ప్రమాదం ఉందని గుర్తిస్తే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై హెచ్చరిక చూపిస్తుంది. ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్ రైడర్ బ్రేకులు వేసే సమయంలో అవసరమైన అదనపు బ్రేకింగ్ సహాయాన్ని అందిస్తుంది. ఇక వెనుక రాడార్ ఆధారంగా పనిచేసే బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్ ఫీచర్ కూడా ఉంది. బైక్ వెనుక లేదంటే పక్కన మరో వాహనం బ్లైండ్ స్పాట్‌లోకి వస్తే రియర్ వ్యూ మిర్రర్‌ లోని ఇండికేటర్ ద్వారా హెచ్చరిస్తుంది. రియర్ డిస్టెన్స్ ఇన్ఫర్మేషన్ వెనుక నుంచి వేగంగా వస్తున్న వాహనాల గురించి డిస్‌ ప్లేలో సమాచారం అందిస్తుంది. రియర్ కొలిజన్ వార్నింగ్ ఫీచర్ వెనుక నుంచి ఢీకొనే ప్రమాదాన్ని గుర్తిస్తే బైక్ ఇండికేటర్లను మెరిపించి వెనుక వచ్చే వాహనదారులను అప్రమత్తం చేస్తుంది. రాబోయే రోజుల్లో మరిన్ని హోండా బైక్స్ కు ఈ టెక్నాలజీని విస్తరించే అవకాశం ఉంది. మొత్తంగా బైక్ రైడింగ్‌ లో భద్రతను మరో స్థాయికి తీసుకెళ్లడమే హోండా లక్ష్యంగా కనిపిస్తోంది.

Advertisement

Read Also: ఎలక్ట్రిక్ MPV To 7 సీటర్ SUV.. మారుతి నుంచి రాబోతున్న 5 కొత్త మోడల్స్ ఇవే!

Tags

Related News

ఎలక్ట్రిక్ MPV To 7 సీటర్ SUV.. మారుతి నుంచి రాబోతున్న 5 కొత్త మోడల్స్ ఇవే!

బాబోయ్ 70% బై బ్యాక్ ఆఫర్.. కియా సోరెంటో లవర్స్ గుడ్ న్యూస్!

ఒకప్పుడు సామాన్యుల కారు.. ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపు.. మారుతి 800కు అరుదైన గౌరవం!

ఒకటి కాదు, ఒకేసారి మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఓలా, ఏథర్‌కు ఇక చుక్కలే!

విడుదలైన నెలలోనే దుమ్మురేపిన బేయాన్.. వామ్మో.. అన్ని కార్లు అమ్ముడయ్యాయా?

కియా సైరోస్ EV vs టాటా నెక్సాన్ EV.. రేంజ్ టెస్ట్‌లో గెలిచిందెవరో తెలుసా?

క్రాష్ టెస్టులో దుమ్మురేపిన మహీంద్రా XEV 9S.. టాటా సఫారీని కూడా వెనక్కి నెట్టినట్టేనా?

Big Stories

Advertisement
×