E-Paper
Advertisement

2030 నాటికి కియా నుంచి 8 ఎలక్ట్రిఫైడ్ కార్లు.. EV, హైబ్రిడ్, CNGపై భారీ ప్లాన్!

2030 నాటికి కియా నుంచి 8 ఎలక్ట్రిఫైడ్ కార్లు.. EV, హైబ్రిడ్, CNGపై భారీ ప్లాన్!
Advertisement

Kia 2030 Strategy: భారత మార్కెట్లో మరింత సత్తా చాటేందుకు కియా ఇండియా కొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. రాబోయే మూడు, నాలుగు సంవత్సరాల్లో పెట్రోల్, డీజిల్‌ తో పాటు ఎలక్ట్రిక్, హైబ్రిడ్, సీఎన్‌జీ వెహికల్స్ పైనా దృష్టి పెట్టాలని కంపెనీ నిర్ణయించింది. 2030 నాటికి దేశంలో విక్రయించే 10 మోడళ్లలో 8 మోడళ్లను ఎలక్ట్రిఫైడ్ వాహనాలుగా మార్చాలనే లక్ష్యంతో కియా పని చేస్తోంది.

కియా ఇండియా క్రేజీ ప్లాన్

వినియోగదారులకు ఒకే రకమైన ఇంజిన్ కాకుండా, పలు రకాల పవర్‌ ట్రెయిన్ ఆప్షన్స్ అందించాలని భావిస్తున్నట్లు కియా ఇండియా ఎగ్జిక్యూటివ్ అతుల్ సూద్ వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్లు, అలాగే ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్‌జీ వేరియంట్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వినియోగదారుల అవసరాలు, బడ్జెట్‌ను బట్టి వారికి ఎక్కువ ఆప్షన్ ను ఉండేలా చూడాలనుకుంటున్నామని చెప్పారు.

ఇండియన్ మార్కెట్ లో 4 ఈవీ కార్లు

Advertisement

ప్రస్తుతం కియా భారత మార్కెట్లో EV6, EV9, Carens Clavis EV, Syros EV అనే నాలుగు ఎలక్ట్రిక్ కార్లను అమ్ముతోంది.  వీటికి తోడు సెల్టోస్‌కు స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌ ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ హైబ్రిడ్ టెక్నాలజీని భారత్‌ లోనే రూపొందించింది. తక్కువ ధరలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడంపై కంపెనీ దృష్టి పెట్టింది. అయితే, ఈ మోడల్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

ఇక భారత మార్కెట్లోకి త్వరలోనే మూడు వరుసల సీట్లతో కూడిన కియా సోరెంటో SUVని కూడా తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఈ మోడల్‌ ను భారత్‌లోనే అసెంబుల్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఇది కియా నుంచి భారత్ లో విడుదలయ్యే తొలి స్ట్రాంగ్ హైబ్రిడ్ SUVగా నిలవనుంది. అలాగే కియా కార్నివాల్ కు కూడా స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్ అందించే అవకాశాలు ఉన్నాయి.

కొత్త లైనప్ లో క్రేజీ ఈవీలు

Advertisement

ప్రస్తుతం ఉన్న నాలుగు ఎలక్ట్రిక్ కార్లతో పాటు సెల్టోస్, సోరెంటో, కార్నివాల్ హైబ్రిడ్ మోడళ్లు కలిపి మొత్తం ఏడు ఎలక్ట్రిఫైడ్ వాహనాలు కియా లైనప్‌ లో ఉంటాయి. దీంతో 2030 నాటికి ఎనిమిది ఎలక్ట్రిఫైడ్ మోడళ్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి సోనెట్, సైరోస్ లాంటి మరో కాంపాక్ట్ SUVకి కూడా హైబ్రిడ్ టెక్నాలజీని తీసుకురావచ్చని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.

సీఎన్‌జీ కార్ల పైనా ఫోకస్

మరోవైపు, ఫ్యాక్టరీలోనే అమర్చే సీఎన్‌జీ కార్లను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం కేరెన్స్ మోడల్‌కు మాత్రమే డీలర్ స్థాయిలో సీఎన్‌జీ కిట్ అందుబాటులో ఉంది. కానీ, భవిష్యత్తులో నేరుగా ఫ్యాక్టరీ నుంచి సీఎన్‌జీ వేరియంట్లను విడుదల చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, అవి ఎప్పుడు మార్కెట్లోకి వస్తాయనే విషయంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read Also: ఔనా.. నిజమా? EV కారుగా అంబాసిడర్ రీఎంట్రీ?

Related News

మహీంద్రా BE 6 vs టాటా కర్వ్ EV.. రెండింటిలో ఏది తోప్ అంటే?

సీటు కింద ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్.. ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే వీటిని కొనండి!

ఎర్టిగా To ఇన్నోవా.. ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఈవీ స్కూటర్లు ఇవే!

దీపావళి సీజన్‌లో కొత్త కార్ల జాతర.. మారుతి, హ్యుందాయ్ నుంచి వస్తున్న కొత్త మోడళ్లు ఇవే!

హీరో నుంచి కొత్త బైక్.. క్యూరియాసిటీ పెంచుతున్న లేటెస్ట్ స్పై షాట్స్!

క్రాష్ టెస్ట్‌ లో దుమ్మురేపిన మహీంద్రా XUV 7XO.. అన్ని వేరియంట్లకు 5 స్టార్ రేటింగ్!

స్పోర్టీ లుక్.. అదిరిపోయే స్పీడ్.. భారత్‌లో టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Big Stories

Advertisement
×