E-Paper
Advertisement

పాకిస్తాన్ ప్లేయ‌ర్లు ఇలాగే ఆడితే, PSL దుకాణం మూసుకోవాల్సిందే

పాకిస్తాన్ ప్లేయ‌ర్లు ఇలాగే ఆడితే, PSL దుకాణం మూసుకోవాల్సిందే
Advertisement

Fawad Sarwar Warns to PCB:  పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కు (Pakistan Super League tournament) కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో పెట్టిన పెట్టుబడులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ( Pakistan Cricket Board) హైదరాబాద్ కింగ్స్ మెన్ యజమాని ఫవాద్ సర్వార్ ( Hyderabad Kingsmen owner Fawad Sarwar) స్ట్రాంగ్ వార్నింగ్ పంపారు. పాకిస్తాన్ జట్టు పేలవమైన ప్రదర్శన కనబరిస్తే… పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటు దెబ్బ తినే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ జట్టులో ఉన్న ప్లేయర్లు సరిగ్గా ఆడక పోతే, PSL ప్రతిష్ట అలాగే వ్యాపార విలువ దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడుతూ… హెచ్చరించారు. ఇప్పటికైనా పాకిస్తాన్ క్రికెట్ జట్టు మెరుగైన ప్రదర్శన చేయకపోతే… పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ దుకాణం మూసుకోవాల్సిందేనని హెచ్చరించారు.

Also Read: Asia Cup 2025 trophy – Mohsin Naqvi: ఒరేయ్ న‌ఖ్వీ నీకు అస‌లు సిగ్గుందా ? ఇంకా ఎన్ని రోజులు ఆసియా క‌ప్ దాస్తావురా ?

పాకిస్తాన్ ప్లేయ‌ర్లు ఇలాగే ఆడితే, PSL దుకాణం మూసుకోవాల్సిందే

Advertisement

పాకిస్తాన్ క్రికెట్ జట్టు (Pakistan Cricket Board) గత కొన్ని రోజులుగా చెత్త ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్టు చేతులకు కూడా ఓడిపోయింది. సొంత మైదానాల్లో కూడా పేలవమైన ప్రదర్శన కనబరుస్తోంది పాకిస్తాన్ క్రికెట్ జట్టు. ఈ క్రమంలో అనేక మార్పులు జట్టులో చేసినప్పటికీ… ప్రయోజనం ఉండడం లేదు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్ కింగ్స్ మెన్ యజమాని ఫవాద్ సర్వార్ ( Hyderabad Kingsmen owner Fawad Sarwar). పాకిస్తాన్ జట్టు పేలవమైన ప్రదర్శన ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రతిష్ట దిగజారుతుందని హెచ్చరించారు.

పాకిస్తాన్ వరుసగా విజయాలు సాధిస్తేనే.. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ పైన ( PSL) అందరి దృష్టి పడుతుందని వెల్లడించారు. ఆ టోర్నమెంటుకు ప్రజాదారణ దక్కాలంటే.. కచ్చితంగా పాకిస్తాన్ క్రికెటర్లు తమ జట్టును గెలిపించుకోవాలని సూచనలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుసగా విఫలమైతే..PSL టోర్నమెంట్ లో పెట్టుబడులు తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పరిస్థితి ఇలాగే దిగజారుకుంటూ పోతే… టోర్నమెంట్ రద్దు చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా పాకిస్తాన్ క్రికెట్ జట్టును గాడిలో పెట్టాలని PCBకి దిశా నిర్దేశం చేశారు ఫవాద్ సర్వార్. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( PSL 2026) నేపథ్యంలో కొత్త ఫ్రాంచైజీ కింద హైదరాబాద్ కింగ్స్ మెన్ జట్టు బరిలోకి దిగింది. మొదటి సీజన్ లోనే ఈ జట్టు అద్భుతంగా రాణించింది. ఫైనల్ దాకా వెళ్లి… పెషవర్ జల్మీ ( Peshawar Zalmi Team) చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

Advertisement

 

 

Also Read: Tamim Iqbal Urged Bangladesh Government: టీమిండియా కోసం వాళ్ల కాళ్లు ప‌ట్టుకుంటాను..తమీమ్ ఇక్బాల్ సంచ‌ల‌నం !

Related News

పాకిస్తాన్ జ‌ట్టును సంక‌నాకిస్తున్నాడు..న‌ఖ్వీ త‌ప్పుకుంటేనే, నేను ఛార్జ్ తీసుకుంటా

దున్న‌పోతుల్లా తిన‌డం కాదు, పాకిస్తాన్ జెండా ఎగుర‌వేయ‌డం నేర్చుకో ?

దారిన పోయే ప్ర‌తి అడ్డ‌మైన వాడికి టీమిండియాలో ఛాన్స్ ఇస్తున్నారు

ప్రియురాలితో తిరుమ‌ల‌లో మెరిసిన‌ హ‌ర్ధిక్ పాండ్యా…న‌యా లుక్ అదుర్స్‌

కామన్‌వెల్త్‌లో భార‌త్ దూకుడు..మ‌రో రెండు గోల్డ్ మెడ‌ల్స్‌

పాకిస్తాన్ ను ఓడించేందుకు వెస్టిండీస్ కుట్రలు.. వైట్ వాష్ చేసేందుకు మాస్ట‌ర్ ప్లాన్‌

వాడికి బౌలింగ్ చేయ‌డం కంటే, రిటైర్మెంట్ ఇవ్వ‌డం బెట‌ర్‌

Big Stories

Advertisement
×