E-Paper
Advertisement

ఎర్టిగా To ఇన్నోవా.. ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే!

ఎర్టిగా To ఇన్నోవా.. ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే!
Advertisement

August 2026 Car Sales: భారత్‌ లో 7-సీటర్ కార్లకు డిమాండ్ కొనసాగుతోంది. కుటుంబ ప్రయాణాలు, ఎక్కువ మంది ప్రయాణించే అవసరాలు, SUVలపై పెరుగుతున్న ఆసక్తి కారణంగా ఈ సెగ్మెంట్‌లో అమ్మకాలు భారీగా పెరిగాయి. 2026 ఆగస్టులో మొత్తం 86,703 యూనిట్ల 7-సీటర్ ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. 2025 ఆగస్టులో ఇవి 67,875 యూనిట్లుగా ఉండగా, ఈసారి 27.7 శాతం వృద్ధి నమోదైంది.

ఎర్టిగాదే టాప్ ప్లేస్!

మారుతి సుజుకి ఎర్టిగా మరోసారి ఈ సెగ్మెంట్ లో టాప్ ప్లేస్ లో ఉంది. ఆగస్టు 2026లో మొత్తం 18,516 ఎర్టిగా కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 18,445 యూనిట్లు విక్రయించగా, ఈసారి 0.4 శాతం స్వల్ప వృద్ధి నమోదైంది. మొత్తం 7-సీటర్ మార్కెట్‌లో ఎర్టిగా వాటా 21.4 శాతంగా ఉంది. మారుతి సుజుకి నుంచి వచ్చిన XL6 కూడా 3,293 యూనిట్ల అమ్మకాలతో 10.8 శాతం వృద్ధిని సాధించింది.

స్కార్పియో అమ్మకాల్లో దూకుడు

Advertisement

మహీంద్రా స్కార్పియో ఆగస్టులో 15,576 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. 2025 ఆగస్టులో 9,840 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే ఏడాది వ్యవధిలో 58.3 శాతం వృద్ధి నమోదైంది. ఈ మోడల్‌కు 7-సీటర్ సెగ్మెంట్‌లో 18 శాతం వాటా సంపాదించింది.  మహీంద్రా XUV7XO, XUV700 మోడళ్లను కలిపి చూస్తే 8,541 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది 4,956 యూనిట్లతో పోలిస్తే ఇది 72.3 శాతం పెరుగుదల కనిపించింది. కొత్తగా వచ్చిన మహీంద్రా 9S ఆగస్టులో 4,508 యూనిట్ల అమ్మకాలు సాధించింది.

ఇన్నోవా, ఫార్చ్యూనర్‌కు మంచి డిమాండ్

టయోటా ఇన్నోవా, ఇన్నోవా హైక్రాస్ కలిపి 8,963 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది 9,304 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు 3.7 శాతం తగ్గాయి. అయినప్పటికీ ఈ ఫ్యామిలీ మార్కెట్‌లో 10.3 శాతం వాటా ఉంది. టయోటా ఫార్చ్యూనర్ అమ్మకాలు మాత్రం 39.7 శాతం పెరిగాయి. 2025 ఆగస్టులో 2,508 యూనిట్లు అమ్ముడవగా, 2026 ఆగస్టులో 3,504 యూనిట్లకు చేరాయి. రూమియన్ అమ్మకాల్లో మాత్రం భారీ పెరుగుదల కనిపించింది. గత ఏడాది కేవలం 68 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి 2,396 యూనిట్లు సేల్ అయ్యాయి.

కొన్ని మోడళ్ల అమ్మకాలు తగ్గాయి

Advertisement

కియా కేరెన్స్, క్లావిస్ కలిపి 6,093 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 10.7 శాతం తగ్గాయి. టాటా సఫారీ మాత్రం 31.2 శాతం వృద్ధితో 1,953 యూనిట్లకు చేరింది. మరోవైపు రెనాల్ట్ ట్రైబర్ అమ్మకాలు 17.9 శాతం తగ్గి 1,536 యూనిట్లకు పరిమితమయ్యాయి. హ్యుందాయ్ అల్కాజర్ అమ్మకాలు కూడా 27.9 శాతం తగ్గి 856 యూనిట్లుగా నమోదయ్యాయి.

మరింతగా పెరుగుతున్న పోటీ

కొత్త మోడళ్లు మార్కెట్లోకి రావడంతో 7-సీటర్ విభాగంలో పోటీ మరింత పెరుగుతోంది. మహీంద్రా 9S, నిస్సాన్ గ్రావిట్, MG మజెస్టర్, కియా సోరెంటో లాంటి మోడళ్లు ఈ మార్కెట్‌లో కొత్త ఆప్షన్స్ ను తీసుకొస్తున్నాయి.

Read Also: దీపావళి సీజన్‌లో కొత్త కార్ల జాతర.. మారుతి, హ్యుందాయ్ నుంచి వస్తున్న కొత్త మోడళ్లు ఇవే!

Tags

Related News

సీటు కింద ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్.. ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే వీటిని కొనండి!

సింగిల్ ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఈవీ స్కూటర్లు ఇవే!

దీపావళి సీజన్‌లో కొత్త కార్ల జాతర.. మారుతి, హ్యుందాయ్ నుంచి వస్తున్న కొత్త మోడళ్లు ఇవే!

హీరో నుంచి కొత్త బైక్.. క్యూరియాసిటీ పెంచుతున్న లేటెస్ట్ స్పై షాట్స్!

క్రాష్ టెస్ట్‌ లో దుమ్మురేపిన మహీంద్రా XUV 7XO.. అన్ని వేరియంట్లకు 5 స్టార్ రేటింగ్!

స్పోర్టీ లుక్.. అదిరిపోయే స్పీడ్.. భారత్‌లో టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

బ్లాక్ కలర్‌కు గుడ్‌బై.. కొత్త లుక్‌తో 2027 కవాసకి వల్కన్ ఎస్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×