Top Budget E-Bikes 2026: పెట్రో ధరలు పెరుగుతున్న ఈ సమయంలో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, అందరికీ ఈ-స్కూటర్లు, ఈ-బైక్‌లు అవసరం లేదు. ముఖ్యంగా తక్కువ దూర ప్రయాణాలు, రోజువారీ ఆఫీస్ రైడ్స్, ఫిట్ నెస్ కోసం సరసమైన ఎలక్ట్రిక్ సైకిళ్లు ఎక్కువ ప్రాధాన్యత దక్కించుకుంటున్నాయి. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, ఈజీ యూసేజ్, లైసెన్స్ అవసరం లేకపోవడంతో చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఇండియాలోని అందుబాటులో ఉన్న రూ. 30 వేల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ సైకిళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుంటుంది.
ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.30 వేల లోపు ఉన్న మంచి ఎలక్ట్రిక్ సైకిళ్లులో హెర్క్యులస్ షుర్వీర్ ఒకటి. రెట్రో డిజైన్ తో వచ్చే ఈ-సైకిల్ ధర సుమారు రూ.22,999. 250W మోటార్, 6Ah బ్యాటరీతో ఇది 25 నుంచి 30 కి.మీ వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. పాతకాలపు సైకిల్ లుక్ ఇష్టపడేవారికి బాగా నచ్చే అవకాశం ఉంది.
వోల్ట్ బైక్ మాక్స్ ప్రో కూడా మంచి ఫీచర్లతో వస్తున్నాయి. దీని ధర రూ.23,990 నుంచి ప్రారంభం అవుతుంది. 70 కి.మీ వరకు రేంజ్ అందుతుందని కంపెనీ నమోదవుతోంది. డ్యూయల్ డిస్క్ బ్రేకులు, స్మార్ట్ డిస్ ప్లే, యాంటీ థెఫ్ట్ సిస్టమ్, హై బీమ్ లైట్లు లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.
ఈ-మోట్రాడ్ X1 కూడా ప్రస్తుతం యువతను ఆకట్టుకుంటోంది. దీని ధర సుమారు రూ.25,999. పెడల్ అసిస్ట్ సిస్టమ్, ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాటరీ ఇండికేటర్ లాంఇ ఫీచర్లు ఉన్నాయి. ఒకసారి చార్జ్ చేస్తే సుమారు 35 కి.మీ వరకు వెళ్లొచ్చు.
అటు హీరో లెక్ట్రో Y3+ కూడా బడ్జెట్ సెగ్మెంట్ లో మంచి గుర్తింపు పొందింది. రూ.29,990 ధరతో లభించే ఈ-సైకిల్ లో 250W మోటార్, 7.4Ah బ్యాటరీ ఉంటాయి. అదనంగా 40 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది. LED డిస్ ప్లే, డిస్క్ బ్రేకులు లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
మరో బెస్ట్ మోడల్ వోల్టెబైక్ ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ ఎడిషన్. ఇది ఫోల్డబుల్ డిజైన్ తో వస్తుంది. చిన్న ఇళ్లలో, ఆఫీసుల్లో సులభంగా పెట్టుకోవచ్చు. 40 నుంచి 55 కి.మీ వరకు రేంజ్ ఇచ్చే రెండు బ్యాటరీ వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం నగరాల్లో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ సైకిళ్లకు డిమాండ్ పెరుగుతోంది. తక్కువ ఖర్చుతో ప్రయాణం, ఫిట్ నెస్, పర్యావరణానికి లాభం కలగడంతో చాలా మంది వీటిని ఎంచుకుంటున్నారు.
Read Also: తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్.. టాప్ కమ్యూటర్ బైక్‌ల జాబితా!