Gambhir On IND VS PAK : టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (Team India vs. Pakistan) మధ్య మ్యాచ్ లు జరిగితే.. ఎగబడి చూస్తారన్న సంగతి తెలిసిందే. ఆదివారం రోజున ఈ రెండు జట్లు తలపడితే జనాలందరూ టీవీలకే అతుక్కుపోతూ ఉంటారు. అయితే అలాంటి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ల గురించి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) హాట్ కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు నిర్వహించకూడదని ఆయన పేర్కొన్నట్లు ఒక పోస్ట్ వైరల్ గా మారింది.
ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో చాలా మంది ఇండియన్స్ మృతి చెందారని… అలాంటి దుర్మార్గులతో క్రికెట్ ఆడటం అనవసరమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాసుల పంట పండుతుందని ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఐసీసీ కావాలనే మ్యాచ్ లు నిర్వహిస్తోందని బాంబు పేల్చారు. అయితే ఇండియన్ గా తనకు ఏ మాత్రం ఈ పద్ధతి ఇష్టం లేదని కుండబద్దలు కొట్టి చెప్పారు గౌతమ్ గంభీర్. దయచేసి భవిష్యత్తులో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఎక్కడ కూడా మ్యాచ్ లు నిర్వహించకూడదని కోరారు. దీంతో గంభీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఎక్కువ మ్యాచ్లు జరిగితే చూడాలని క్రికెట్ అభిమానులు భావిస్తుంటే… టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం చాలా భిన్నంగా స్పందించారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్లు అస్సలు నిర్వహించకూడదని ఆయన కోరారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చాలాసార్లు ఇండియా పై తెగబడి దారుణాలకు పాల్పడ్డారని ఎమోషనల్ అయ్యారు గౌతమ్ గంభీర్. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ లాంటి దుర్మార్గపు దేశంతో మ్యాచ్ లు ఆడడం కంటే ఇంట్లో కూర్చోవడం బెటర్ అంటూ వ్యాఖ్యానించారు.
కానీ ఇండియన్స్ మనోభావాలు పట్టించుకోకుండా… అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( International Cricket Council
) చాలా దారుణంగా వ్యవహరిస్తుందని మండి పడ్డారు. కాసుల కోసం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( IND VS PAK) మధ్య ఖచ్చితంగా ఐసిసి టోర్నమెంట్లలో ( I C C) భాగంగా మ్యాచులు నిర్వహిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇటు ఆసియా కప్ టోర్నమెంట్ లో కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ నిర్వహించి క్యాష్ చేసుకుంటున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనకు పాకిస్తాన్ తో ఆడడం అంటే అస్సలు ఇష్టం ఉండదని కుండబద్దలు కొట్టి చెప్పారు. పాకిస్తాన్ తో మ్యాచ్ లు జరిగితే, ఎప్పుడూ కూడా టీమిండియానే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదని వ్యాఖ్యానించారు.