E-Paper
Advertisement

పల్సర్ NS125లో అదిరిపోయే అప్‌డేట్.. ఇక బైక్ స్క్రీన్‌పైనే గూగుల్ మ్యాప్స్!

పల్సర్ NS125లో అదిరిపోయే అప్‌డేట్.. ఇక బైక్ స్క్రీన్‌పైనే గూగుల్ మ్యాప్స్!
Advertisement

Bajaj Pulsar NS125 Update: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) తన పల్సర్ బైక్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తోంది. ఇప్పటికే పలు మోడళ్లలో కొత్త ఫీచర్లు, టెక్నాలజీని అందిస్తున్న కంపెనీ.. ఇప్పుడు పల్సర్ NS125పై దృష్టి పెట్టింది. ఈ బైక్‌కు సంబంధించిన అప్‌డేటెడ్ వెర్షన్ తాజాగా టెస్టింగ్ టైమ్ లో కనిపించింది. ముఖ్యంగా ఇందులో కొత్త TFT డిస్‌ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది. గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ సదుపాయం కూడా ఉండటంతో ఈ కొత్త మోడల్‌పై ఆసక్తి పెరుగుతోంది.

గూగుల్ మ్యాప్స్‌ తో కొత్త TFT డిస్‌ప్లే

అప్‌డేటెడ్ పల్సర్ NS125లో ప్రధాన ఆకర్షణ TFT డిస్‌ప్లే. బజాజ్ తొలుత ఈ కొత్త డిస్‌ప్లేను పల్సర్ N160 SSలో పరిచయం చేసింది. ఆ తర్వాత పల్సర్ 125, 150, NS400Z, N250 SS, NS200 లాంటి మోడళ్లలోనూ అందించింది. ఈ డిస్‌ప్లే ద్వారా స్మార్ట్‌ ఫోన్‌లోని గూగుల్ మ్యాప్స్ నావిగేషన్‌ను బైక్ స్క్రీన్‌పై చూసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ప్రయాణ సమయంలో పదేపదే ఫోన్ చూడాల్సిన అవసరం తగ్గుతుంది. అంతేకాకుండా కొత్త స్విచ్‌ గేర్‌ ను కూడా ఈ అప్‌డేటెడ్ మోడల్‌లో అందించే అవకాశం ఉంది. ఇటీవల NS125 బైక్ పెద్ద నెగటివ్ LCD డిస్‌ప్లే, కొత్త రంగులతో కూడా కనిపించింది. ఇప్పుడు TFT స్క్రీన్‌తో కూడిన మరో టాప్ వేరియంట్‌ను పరీక్షిస్తుంది.

ఇంజిన్‌లో నో ఛేంజెస్..

Advertisement

కొత్త ఫీచర్లు వచ్చినప్పటికీ ఇంజిన్ విషయంలో మాత్రం పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 124.45cc సింగిల్ సిలిండర్ ఇంజిన్‌నే కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ 8,500rpm వద్ద 12hp పవర్, 7,000rpm వద్ద 11Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి ఐదు స్పీడ్ గేర్‌ బాక్స్‌ ను యాడ్ చేశారు. పోటీ మోడల్ అయిన టీవీఎస్ రైడర్ (TVS Raider)లో 124.8cc ఇంజిన్ ఉంటుంది. ఇది 11.38hp పవర్, 11.2Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ నేపథ్యంలో NS125 తన పవర్ విషయంలో పోటీదారులకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.

హార్డ్‌ వేర్‌ లోనూ అవే సెటప్‌లు..

బైక్‌ లోని ఇతర మెకానికల్ భాగాల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక వైపు డ్రమ్ బ్రేక్‌ను కొనసాగించనున్నారు. అలాగే, పెరిమీటర్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక మోనోషాక్ సెటప్ యథాతథంగా ఉండే అవకాశం ఉంది.

ధర పెరుగుతుందా?

Advertisement

ప్రస్తుతం బజాజ్ పల్సర్ NS125 ప్రారంభ ధర రూ.99,622గా ఉంది. ABS వేరియంట్ ధర సుమారు రూ.1.06 లక్షలు. కొత్త TFT డిస్‌ప్లేతో వచ్చే మోడల్ టాప్-ఎండ్ వేరియంట్‌గా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న వేరియంట్లలోనూ డిస్‌ప్లే అప్‌డేట్లు చేసే అవకాశం ఉండగా, TFT స్క్రీన్, అదనపు ఫీచర్ల కారణంగా కొత్త టాప్ వేరియంట్ ధర మరింత పెరగవచ్చని తెలుస్తోంది. బజాజ్ నుంచి అధికారిక విడుదల తేదీ, ధర వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

Read Also: టీవీఎస్ నుంచి మరో బైక్ అవుట్.. 12 ఏళ్ల తర్వాత స్టార్ సిటీ ప్లస్‌కు గుడ్‌బై!

Tags

Related News

టీవీఎస్ నుంచి మరో బైక్ అవుట్.. 12 ఏళ్ల తర్వాత స్టార్ సిటీ ప్లస్‌కు గుడ్‌బై!

టాటాతో చేతులు కలపనున్న హోండా, హ్యుందాయ్.. త్వరలో కొత్త కార్ల ఎంట్రీ!

ధర ఎక్కువైనా సూపర్ క్రేజ్.. 5 నెలల్లో 15 వేల హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులు సేల్!

లంబోర్ఘిని కార్ల యాడ్స్ టీవీలో ఎందుకు రావో తెలుసా? ఇదీ అసలు కథ!

క్రాష్ టెస్ట్ లో దుమ్మురేపిన హ్యుందాయ్ వెర్నా.. టాప్ రేటింగ్ తో సత్తా!

టాటా సియెర్రా EVకి 5 స్టార్ రేటింగ్.. క్రాష్ టెస్టుల్లో అదరగొట్టిందిగా!

ఈ బైక్‌ ప్రమాదాన్ని ముందే గుర్తిస్తుంది.. హోండా టెక్నాలజీ చూస్తే మతిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×