E-Paper
Advertisement

టాటాతో చేతులు కలపనున్న హోండా, హ్యుందాయ్.. త్వరలో కొత్త కార్ల ఎంట్రీ!

టాటాతో చేతులు కలపనున్న హోండా, హ్యుందాయ్.. త్వరలో కొత్త కార్ల ఎంట్రీ!
Advertisement

Honda-Tata Partnership: భారత ఆటోమొబైల్ రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా గ్రూప్‌తో కలిసి పనిచేయడానికి అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే జపాన్‌కు చెందిన హోండా మోటార్ కంపెనీ, దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్ కంపెనీ టాటా గ్రూప్‌ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వాహనాల తయారీతో పాటు బ్యాటరీలు, ఇంజనీరింగ్, సాఫ్ట్‌ వేర్, టెక్నాలజీ రంగాల్లోనూ భాగస్వామ్యానికి అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపై హోండా బ్రాండ్‌ తో టాటా కార్ల అమ్మకాలు..

హోండా, టాటా గ్రూప్ మధ్య జరిగిన చర్చల్లో ఆసక్తికరమైన ప్రతిపాదన తెరపైకి వచ్చింది. టాటా మోటార్స్ ఇప్పటికే అభివృద్ధి చేసిన కార్లను హోండా బ్రాండ్ పేరుతో భారత మార్కెట్లో అమ్మే అవకాశాన్ని పరిశీలించినట్లు ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ఇందులో ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉండే అవకాశం ఉంది. టాటా మోటార్స్‌ తో చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, టాటా టెక్నాలజీస్, టీసీఎస్ (TCS) సంస్థలతో చర్చలు కీలక దశకు చేరినట్లు తెలుస్తోంది. టాటా ఆటోకాంప్, అగ్రాటాస్, టాటా ఎల్క్సీ సంస్థలతోనూ హోండా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

Advertisement

ఇప్పటికే ఉన్న టాటా వెహికల్ ప్లాట్‌ ఫామ్‌ను ఉపయోగించుకుంటే హోండాకు కొత్త మోడళ్ల అభివృద్ధి ఖర్చు తగ్గడంతో పాటు తక్కువ సమయంలోనే కార్లను మార్కెట్లోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అయితే, ఏ మోడల్‌ను ఎప్పుడు విడుదల చేయాలనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదు.

1985లోనే మొదలైన టాటా-హోండా ప్రయత్నాలు

టాటా, హోండా సంస్థల మధ్య సంబంధాలు ఇప్పటివి కావు. 1985లోనే రెండు సంస్థలు కార్ల తయారీ ఒప్పందం కోసం ప్రయత్నించాయి. అప్పట్లో టాటా గ్రూప్‌కు చెందిన టెల్కో, హోండా మధ్య ఒప్పందం జరిగినప్పటికీ ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మరోసారి ఈ రెండు సంస్థలు భాగస్వామ్య అవకాశాలను పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

టాటాపై హ్యుందాయ్ కూడా ఆసక్తి

Advertisement

మరోవైపు హ్యుందాయ్ మోటార్ గ్రూప్ కూడా టాటా గ్రూప్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. హ్యుందాయ్ ప్రెసిడెంట్, సీఈఓ జోస్ మునోజ్ ముంబైలో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌ను కలిశారు. ఈ సమావేశంలో భవిష్యత్తు వ్యాపార అవకాశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. హ్యుందాయ్ 2026 నుంచి 2032 మధ్య దేశంలో సుమారు 15.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. తయారీ సామర్థ్యం పెంపు, పరిశోధన, అభివృద్ధి, స్థానిక సరఫరాదారులు, భవిష్యత్ మొబిలిటీ రంగాలు ఈ పెట్టుబడుల్లో భాగంగా ఉన్నాయి.

జీప్‌తో ఇప్పటికే టాటా ఒప్పందం

హోండా, హ్యుందాయ్‌లతో చర్చలు జరుగుతుండగా, స్టెల్లాంటిస్ గ్రూప్ ఇప్పటికే టాటా మోటార్స్‌ తో వాహన సాంకేతికత, ఉత్పత్తి అభివృద్ధికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా అంతర్జాతీయ మార్కెట్ల కోసం కొత్త వాహనాలను అభివృద్ధి చేయనుంది. టాటా సియెర్రా ఆర్గాస్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా కొత్త జీప్ ఎస్‌యూవీ రూపొందుతున్నట్లు సమాచారం. ఈ చర్చలు ఒప్పందాలుగా మారితే భారత ఆటోమొబైల్ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

Read Also: ఎలక్ట్రిక్ MPV To 7 సీటర్ SUV.. మారుతి నుంచి రాబోతున్న 5 కొత్త మోడల్స్ ఇవే!

Tags

Related News

టీవీఎస్ నుంచి మరో బైక్ అవుట్.. 12 ఏళ్ల తర్వాత స్టార్ సిటీ ప్లస్‌కు గుడ్‌బై!

ధర ఎక్కువైనా సూపర్ క్రేజ్.. 5 నెలల్లో 15 వేల హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులు సేల్!

లంబోర్ఘిని కార్ల యాడ్స్ టీవీలో ఎందుకు రావో తెలుసా? ఇదీ అసలు కథ!

క్రాష్ టెస్ట్ లో దుమ్మురేపిన హ్యుందాయ్ వెర్నా.. టాప్ రేటింగ్ తో సత్తా!

టాటా సియెర్రా EVకి 5 స్టార్ రేటింగ్.. క్రాష్ టెస్టుల్లో అదరగొట్టిందిగా!

ఈ బైక్‌ ప్రమాదాన్ని ముందే గుర్తిస్తుంది.. హోండా టెక్నాలజీ చూస్తే మతిపోవాల్సిందే!

ఎలక్ట్రిక్ MPV To 7 సీటర్ SUV.. మారుతి నుంచి రాబోతున్న 5 కొత్త మోడల్స్ ఇవే!

Big Stories

Advertisement
×