E-Paper
Advertisement

టీవీఎస్ నుంచి మరో బైక్ అవుట్.. 12 ఏళ్ల తర్వాత స్టార్ సిటీ ప్లస్‌కు గుడ్‌బై!

టీవీఎస్ నుంచి మరో బైక్ అవుట్.. 12 ఏళ్ల తర్వాత స్టార్ సిటీ ప్లస్‌కు గుడ్‌బై!
Advertisement

TVS Star City Plus Discontinued: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ (TVS Motor) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన పాపులర్ 110cc కమ్యూటర్ బైక్ స్టార్ సిటీ ప్లస్ (Star City Plus)ను మార్కెట్ నుంచి తొలగించింది. 2014లో తొలిసారిగా భారత మార్కెట్లోకి వచ్చిన ఈ బైక్ దాదాపు 12 ఏళ్ల పాటు వినియోగదారులకు అందుబాటులో ఉంది. అయితే, తాజాగా ఈ మోడల్ విక్రయాలను కంపెనీ నిలిపివేసినట్లు సమాచారం. దీంతో టీవీఎస్ 110cc విభాగంలో ఇకపై రేడియాన్ (Radeon), స్పోర్ట్ (Sport) మోడళ్లు మాత్రమే కొనసాగనున్నాయి.

12 ఏళ్ల ప్రయాణానికి ముగింపు!

టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్‌ను 2014లో అందుబాటు ధరలో మంచి మైలేజీ ఇచ్చే కమ్యూటర్ బైక్‌గా తీసుకొచ్చింది. రోతజువారీ ప్రయాణాలు చేసే మధ్యతరగతి వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ మోడల్‌ను రూపొందించింది. ప్రారంభంలో మంచి ఆదరణ పొందిన ఈ బైక్ నెమ్మదిగా మార్కెట్లో పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇదే 110cc విభాగంలో టీవీఎస్ అందిస్తున్న రేడియాన్ మోడల్‌కు ఎక్కువ ఆదరణ లభించడంతో స్టార్ సిటీ ప్లస్‌కు డిమాండ్ తగ్గినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీ దీని అమ్మకాలు నిలిపివేసి ఉండవచ్చని ఆటో వర్గాలు భావిస్తున్నాయి.

109.7cc ఇంజిన్.. 8.2hp పవర్

Advertisement

స్టార్ సిటీ ప్లస్‌లో 109.7cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉండేది. ఇది 7,350rpm వద్ద 8.2hp పవర్, 4,500rpm వద్ద 8.7Nm టార్క్ ఉత్పత్తి చేసేది. ఈ ఇంజిన్‌కు నాలుగు స్పీడ్ గేర్‌బాక్స్‌ ను కలిగి ఉంటుంది. సాధారణ ప్రయాణాలకు అనువుగా ఉండేలా దీని ఇంజిన్ పనితీరును రూపొందించారు. డ్రమ్, డిస్క్ అనే రెండు వేరియంట్లలో ఈ బైక్ అందుబాటులో ఉండేది.

తక్కువ ధరలోనూ మంచి ఫీచర్లు

ఎంట్రీ లెవల్ కమ్యూటర్ బైక్ అయినప్పటికీ స్టార్ సిటీ ప్లస్‌లో కొన్ని ఆకట్టుకునే ఫీచర్లు ఉండేవి. LED హెడ్‌ల్యాంప్, మొబైల్ ఛార్జింగ్ కోసం USB పోర్ట్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లాంటి సదుపాయాలను అందించారు. అంతేకాకుండా, వెనుక వైపు 5 లెవెల్స్ లో అడ్జెస్ట్ చేసుకునే ప్రీలోడ్‌తో కూడిన షాక్ అబ్జార్బర్‌ను కూడా అమర్చారు. ఇవి రోజువారీ ప్రయాణాల్లో రైడర్లకు ఉపయోగపడేవి.

ఐదేళ్లుగా నో అప్ డేట్.. 

Advertisement

స్టార్ సిటీ ప్లస్‌కు చివరిసారిగా ఐదేళ్ల క్రితం అప్‌డేట్ వచ్చింది. ఆ సమయంలో BS6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్‌ ను మార్చారు. ఆ తర్వాత పెద్దగా డిజైన్ మార్పులు, కొత్త ఫీచర్లు, ఇతర అప్‌డేట్లు అందించలేదు. మరోవైపు ఇదే ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన రేడియాన్ బైక్‌కు మార్కెట్లో మంచి ఆదరణ లభించింది. దీంతో స్టార్ సిటీ ప్లస్‌ను కొనసాగించడం కంటే రేడియాన్‌పై దృష్టి పెట్టాలని టీవీఎస్ భావించి ఉండవచ్చని తెలుస్తోంది. ఒకప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉన్న ప్రముఖ కమ్యూటర్ బైక్‌లలో ఒకటైన స్టార్ సిటీ ప్లస్ ప్రయాణం ముగిసినట్లయింది. అయితే, ఈ నిలిపివేతపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read Also: ధర ఎక్కువైనా సూపర్ క్రేజ్.. 5 నెలల్లో 15 వేల హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులు సేల్!

Tags

Related News

టాటాతో చేతులు కలపనున్న హోండా, హ్యుందాయ్.. త్వరలో కొత్త కార్ల ఎంట్రీ!

ధర ఎక్కువైనా సూపర్ క్రేజ్.. 5 నెలల్లో 15 వేల హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులు సేల్!

లంబోర్ఘిని కార్ల యాడ్స్ టీవీలో ఎందుకు రావో తెలుసా? ఇదీ అసలు కథ!

క్రాష్ టెస్ట్ లో దుమ్మురేపిన హ్యుందాయ్ వెర్నా.. టాప్ రేటింగ్ తో సత్తా!

టాటా సియెర్రా EVకి 5 స్టార్ రేటింగ్.. క్రాష్ టెస్టుల్లో అదరగొట్టిందిగా!

ఈ బైక్‌ ప్రమాదాన్ని ముందే గుర్తిస్తుంది.. హోండా టెక్నాలజీ చూస్తే మతిపోవాల్సిందే!

ఎలక్ట్రిక్ MPV To 7 సీటర్ SUV.. మారుతి నుంచి రాబోతున్న 5 కొత్త మోడల్స్ ఇవే!

Big Stories

Advertisement
×