హరీశ్‌రావు ఆ గుళ్లకు వెళ్లడమే పాపమైంది. ఆ ఆధారాలే ఇప్పుడు ఏకంగా క్షుద్రపూజలు చేసేశారని డిసైడ్ అయ్యేలా మాట్లాడే అవకాశం ఇచ్చినట్టైంది అధికార పార్టీకి. మొన్నటి దాకా చిన్నా చితక లీడర్లు మాట్లాడిన మాటలు పెద్దగా ఫోకస్ కాలేదు. కానీ.. ఇప్పుడు ఏకంగా పీపీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగడం.. ఆయన తమిళనాడు, కర్ణాటకల్లోని తిరుచ్చి, శివమొగ్గ లోని ఆలయాలను మహేశ్ టార్గెట్ చేసి మాట్లాడినట్టుగా పోయింది మెసేజ్.
క్షుద్రపూజలు చేస్తున్నారని బీఆరెస్‌ను ఇరుకునపెట్టేందుకు లేవనెత్తిన స్ట్రాటజీ కాస్త తిరగబడినట్టయ్యింది. ఎందుకంటే దేవాలయాల ప్రస్తావన తీసుకురావడమంటే సున్నిమైన భక్తి భావాన్ని కూడా బయటకు లాగడమే. ఎంతో మంది భక్తులుంటారు ఆ ప్రాంతంలో. నిత్యం ఆ దేవాలయాలను సందర్శిస్తారు. ఆ దేవాలయాలపై నమ్మకం ఉంటుంది. కానీ ఇక్కడ తెలంగాణ రాజకీయాల కోసం ఆ దేవాలయాల పవిత్రను దెబ్బతీసే విధంగా.. అక్కడి భక్తల మనోభావాలను కించపరిచే విధంగా పరోక్షంగా మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలున్నాయనే భావన ప్రజల్లోకి వెళ్లింది.
ఇక్కడి ఈ లొల్లి అక్కడికి కూడా చేరడానికి ఎక్కువ సమయం పట్టదు. క్షుద్ర పూజలంటూ తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్న లొల్లి దేశ వ్యాప్తంగా ఎలా వైరల్ అవుతున్నదో.. ఆ వార్తల్లోనే ఆ రెండు రాష్ట్రాల దేవాలయాల ఇష్యూ కూడా లింకయి ఉండటంతో .. వాటిపైనా జనాలు ఫోకస్ పెట్టారు. నిజంగా ఆ రాష్ట్రాల్లోని ఆ దేవాలయల్లో క్షుద్ర పూజలు చేస్తున్నారా? అని తెలియని వారికి తెలియజేసినట్టుగా కాంగ్రెస్సే ఇక్కడి నుంచి ప్రచారం చేసినట్టయ్యింది.
తమిళనాడులోని ప్రధాన ఆధ్యాత్మిక నగరాల్లో తిరుచిరాపల్లి ఒకటి. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ రంగనాథస్వామి దేవాలయంతో పాటు రాక్‌ఫోర్ట్ ఉచ్చి పిల్లయ్యార్ ఆలయాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా వైష్ణవ, శైవ, గణపతి ఆరాధనకు ప్రసిద్ధి చెందాయి. తిరుచ్చి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇలా తాంత్రిక పూజలు చేస్తారనే ప్రచారం ఉంది. కానీ దేవాలయాల్లో పూజలు చేస్తారని అనడం అబద్దం.
గతంలో కొన్ని కేసులు కూడా నమోదైన ఉదంతాలున్నాయి. కానీ హరీశ్ రావు వెళ్లింది దేవాలయాలకని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. అక్కడే క్షుద్ర పూజలు చేశారని ఆరోపిస్తున్నారు. దేవాలయలకు వెళ్లకుండా అక్కడే బయట ప్రదేశాలకు వెళ్లాడా? వెళ్తే ఎక్కడికి వెళ్లాడు…? అని నిరూపించాలి ఇప్పుడు కాంగ్రెస్. కానీ ఆ ప్రాంతంలో అడుగు పెట్టడమే క్షుద్ర పూజల కోసమని.. ఆ ఆలయాలను కూడా ఈ పూజల్లోకి లాక్కు రావడమే వివాదమైంది.
శివమొగ్గ కర్ణాటకలోని మల్నాడు ప్రాంతానికి ప్రధాన కేంద్రం. ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న కొల్లూరు మూకాంబిక దేవాలయం శక్తి ఆరాధనకు అత్యంత ప్రసిద్ధి చెందినది. శక్తి ఉపాసనలో కొన్ని తాంత్రిక సంప్రదాయాలు భారతదేశంలోని అనేక శక్తి పీఠాల్లో ఉన్నట్లే ఇక్కడ కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయని పండితులు చెబుతారు. అయితే మూకాంబిక ఆలయం “క్షుద్ర పూజల ఆలయం” కాదు.
అక్కడ జరిగే పూజలు ఆలయ ఆగమ సంప్రదాయాల ప్రకారమే నిర్వహించబడతాయని అధికారిక సమాచారం ఉంది. అయితే దీన్ని బీఆరెస్ తిప్పి కొట్టేందుకు.. సమ్మక్క సారాలమ్మ జాతరను కూడా ప్రస్తావిస్తుంది. అక్కడ శివసత్తులు, తాంత్రికంగా పూజలు నిర్వహిస్తారని మరి వాటిని కూడా క్షుద్రపూజలంటారా? అని కొత్త వాదాన్ని తెరపైకి తెచ్చింది.
బర్త్‌డే కు వెళ్లాడని బీఆరెస్ నుంచి ఆన్సర్ వచ్చినా.. పదే పదే ఎందుకు వెళ్తున్నాడని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. 11 రోజులు, 21 రోజులు, 40 రోజులు పూజలు చేస్తారని మహేశ్ అంటున్నాడు. మరి ఎన్ని సార్లు వెళ్లాడో కాంగ్రెస్ దగ్గర ఆధారాలున్నాయా? ఇవి బయటపెట్టాలి. అంతే కాదు.. హరీశ్ ఆ ప్రాంతాలకు వెళ్లాడని నిరూపిస్తూనే .. గుడిలోకి వెళ్లలేదు.. అక్కడి బయట ప్రదేశాలకు వెళ్లాడనే ఆధారాలు చూపాలి. అలా పదే పదే వెళ్లినట్టు కూడా రూడీ చేయాలి? అప్పుడు కొంత అనుమానం వచ్చే అవకాశం ఉంది.
అంతే కాదు.. ఆ దేవాలయాల పవిత్రతపై మచ్చ పడేలా మాట్లాడిన విషయాన్ని తప్పుగా భావించి సరిదిద్దుకోవాలి. అక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తమ మాటల ఉద్దేశ్యం ఇదీ అని వివరించగలగాలి. లేదంటే డిఫెన్స్‌లో పడేయాలనుకుని.. సున్నితమైన ఆథ్యాత్మికత అంశంలో బొక్కబోర్లా పడాల్సి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.