E-Paper
Advertisement

న్యాయం ఆలస్యమైతే అన్యాయమే!

న్యాయం ఆలస్యమైతే అన్యాయమే!
Advertisement

Judicial Backlog: న్యాయదేవత కళ్లకు గంతలు కట్టుకుంది సరే.. వ్యవస్థ కూడా సామాన్యుడి ఆర్తనాదాలను వినకుండా చెవులకు గంతలు కట్టుకుందా? బిహార్‌లో పాట్నా కోర్టు దీప్ రాయ్‌ని 34 ఏళ్లు జైల్లో ఉంచి చివరకు ముసలితనంలో నిర్దోషి అంటూ రిలీజ్ చేసింది. ఈ కేసులో చివరకు న్యాయం గెలవచ్చు. కానీ ఆయన కోల్పోయిన జీవితాన్ని ఏ చట్టం తిరిగి ఇస్తుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై పడిన బొగ్గుమచ్చను ఆయన చనిపోయిన తర్వాత న్యాయస్థానాలు చెరిపేశాయి.

5కోట్ల పెండింగ్ కేసులు..

ఈ రెండు కేసులే కాదు. దేశంలోని కోర్టుల్లో 5కోట్ల పెండింగ్ కేసులు మూలుగుతున్నాయి. అవి కోర్టుకు కాగితాలే కావచ్చు.. కానీ అవి మనుషుల జీవితాలు. ఒక్క సుప్రీంకోర్టులోనే ఈ ఏడాది నాటికి 92 వేలకు పైగా అపరిష్కృత కేసులు కొండలా పేరుకుపోయాయి. లోక్‌సభలో న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లుకు ఆమోదం పడింది. సుప్రీం జడ్జీల సంఖ్య 38కి పెరగబోతుంది. మరి ఆ పెరిగిన సంఖ్య కేసుల కొండను కరిగిస్తుందా. రాజకీయ నేతల కుమ్ములాటలు, ఈడీలు, సీబీఐ కేసులు, ముందస్తు బెయిళ్లు, ఎన్నికల వివాదాలు… వీటికే కోర్టుల సమయం అంతా సరిపోతోంది.

Advertisement

Also Read: తెలంగాణలో రైస్ మిల్లర్లకు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న మంత్రి ఉత్తమ్..!

కోర్టు గుమ్మం దగ్గర కన్నీళ్లు..

వీఐపీల కేసులకు రాత్రికి రాత్రే బెంచ్‌లు ఏర్పాటు చేసి గంటల తరబడి విచారణలు జరుపుతారు. మరి ఏ ఆధారం లేక, లాయర్లకు ఫీజులు ఇచ్చుకోలేక, కోర్టు గుమ్మం దగ్గర కన్నీళ్లతో నిలబడే సామాన్యుడికి ఆ సమయం ఎందుకు దక్కడం లేదు. పొలిటికల్ కేసుల ఒత్తిడిలో పేదవాడి న్యాయం నలిగిపోవాల్సిందేనా?

Advertisement

Also Read: అమ్మబాబోయ్.. మళ్లీ పెరగబోతున్న రీఛార్జ్ ధరలు.. ఏకంగా 15% టారిఫ్ హైక్!

Tags

Related News

బిగ్ టీవీ కథనాలకు భారీ ఇంపాక్ట్.. మెట్రో పిల్లర్ల తవ్వకాలపై కళ్లు తెరిచిన అధికారులు!

కేటీఆర్ ఆస్తులపై దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ.. త్వరలో బిగ్ ట్విస్ట్?

కొడంగల్ వేదికగా కల్వకుంట్ల కవిత,కేటీఆర్ పొలిటికల్ స్కెచ్.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ కుమార్తె.. కీలక బాధ్యతలిచ్చిన వైసీపీ పార్టీ!

మమతా బెనర్జీకి వరుస బిగ్ షాక్‌లు.. రాత్రికి రాత్రే అభ్యర్థి అరెస్ట్!

భారతీయ ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్.. వీసా ఫీజు పొడిగింపు!

భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైల్వే స్టేషన్ కనెక్టివిటీ.. ఎక్కడో తెలుసా..?

చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ నయా అడుగు.. దేశ జీడీపీకి మరో భారీ బూస్టర్!

Big Stories

Advertisement
×