Live-in Rights: కొందరు పెళ్లి అనే బంధంతో ఒక్కటైతే కొందరు నమ్మకం అనే బంధంతో లివింగ్ రిలేషన్‌షిప్ కొనసాగిస్తారు. కానీ కొందరి కథల్లో కన్నీళ్లే ఉంటాయి. ఏడడుగులు వేయలేదు కదా మాకు పెళ్ళి కాలేదు కదా మాపై చట్టం ఎలా చర్యలు తీసుకుంటుందనే అహంకారపు ధీమాకు సర్వోన్నత న్యాయస్థానం ముగింపు పలికింది.
గృహహింసను అడ్డుకునే ఐపీసీ సెక్షన్ 498ఏ.. కేవలం పెళ్లయిన వారికే కాదు, సహజీవనంలో మోసపోయిన ప్రతి ఆడబిడ్డకు కూడా రక్షణగా ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. కాగితాలపై సంతకాలు లేకపోవచ్చు మంగళసూత్రం మెడలో పడకపోవచ్చు కానీ నమ్మి వచ్చిన ఆ ఇల్లాలి కన్నీళ్లకు విలువ లేదా? ఏ మహిళా ఒంటరి కాదు.. ఆమె రోదనను వినే చట్టం ఉంది.
Alao Read: RBI బ్యాంక్ లో ఉద్యోగం చేస్తోన్న ఇషాన్ కిషన్..ఫోటోలు వైరల్
నమ్మి వచ్చిన మహిళలను మానసికంగా, శారీరకంగా హింసిస్తే ఇకపై చట్టం నుంచి తప్పించుకోవడం ఎవరివల్లా కాదు. మూడేళ్ల జైలు శిక్ష తప్పదు. ఈ తీర్పు కేవలం ఒక సెక్షన్ విస్తరణ కాదు.. ప్రతి మహిళకు చట్టం ఇస్తున్న అభయ హస్తం. బంధం ఏదైనా, భద్రత ఇవ్వడమే చట్టం బాధ్యత అని సుప్రీం మరోసారి నిరూపించింది.
Also Read: రాజకీయ విమర్శలా? మానసిక వేధింపులా.. తమిళనాడు నుంచి ఏపీ దాకా ఇదే రచ్చ!