E-Paper
Advertisement

జీతాలైతే తీసుకుంటున్నారు.. ఆదాయమేది? ఐఏఎస్‌లపై సర్కార్ ఆగ్రహం!

జీతాలైతే తీసుకుంటున్నారు.. ఆదాయమేది? ఐఏఎస్‌లపై సర్కార్ ఆగ్రహం!
Advertisement

Revenue Mobilisation: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించడానికి, సంక్షేమ, అభివృద్ధి పథకాలకు బడ్జెట్ కొరత లేకుండా ఉండాలంటే తప్పనిసరిగా అదనపు నిధుల సమీకరణే ఏకైక మార్గం అని సర్కార్ ఇటీవల ఆఫీసర్లకు సూచించింది. అన్ని శాఖల నుంచి అదనపు ఆదాయ మార్గాలను ఆన్వేషించాలని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి ఇవ్వాలని సర్కార్ కోరింది.

రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం..

Advertisement

కానీ, నిధుల సమీకరణలో కీలక శాఖల కార్యదర్శుల ఉదాసీనత, స్పష్టమైన ప్రణాళికలు లేకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఖర్చులు పెట్టడంలో చూపించే ఉత్సాహం… రాబడి పెంచడంలో ఎందుకు కనిపించడం లేదని ప్రభుత్వం ఉన్నతాధికారులను నిలదీసినట్లు సమాచారం. ఇక ఆర్థిక పరిస్థితులను గట్టెక్కించేందుకు ప్రత్యేక ‘మనీ మోబిలైజేషన్'(ఆదాయ పెంపు) ప్రణాళికలను సమర్పించాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశించింది.

సీఎం ఆగ్రహం..

Advertisement

అయితే, ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలకు హాజరవుతున్న కార్యదర్శులు, రాబడి పెంపుపై నిర్దిష్ట కార్యాచరణను సమర్పించకుండా చేతులెత్తేస్తుండటం సర్కార్‌కు మింగుడుపడటం లేదు. బడ్జెట్ లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం రాబట్టడంలో అధికారులు విఫలమవుతున్నారనే భావన వ్యక్తమవుతోంది. ఖర్చులను అదుపు చేయడంతో పాటు ఆదాయాన్ని సమకూర్చుకోవడంపైనే శాఖల పురోగతి ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసినా, ఆ దిశగా అడుగులు పడటం లేదని స్వయంగా ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

​సబ్‌కమిటీ సూచనలు కనీసం ఖాతరు లేదు..

​రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఓ ఉన్నత స్థాయి సబ్‌కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గతంలోనే పలు కీలక సూచనలు చేసింది.ఉపయోగంలో లేని, ఆక్రమణలకు గురయ్యే అవకాశమున్న ప్రభుత్వ భూములను గుర్తించి, మోనిటైజేషన్,ల్యాండ్ పూలింగ్ ద్వారా నిధులు రాబట్టాలని సూచించింది. అంతేగాక వివిధ పన్నుల వసూళ్లలో జరుగుతున్న లీకేజీలను కఠినంగా అరికట్టాలని ఆదేశించింది. వివిధ శాఖల వద్ద అందుబాటులో ఉన్న సహజ, యంత్ర సంపదను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఆదాయ వనరులను సమకూర్చాలని నొక్కి చెప్పింది. అయితే, సబ్‌కమిటీ చేసిన సూచనలను కూడా ప్రాక్టికల్‌గా అమలు చేయడంలో ఆయా శాఖల సెక్రటరీలు తీవ్ర మందకొడితనాన్ని ప్రదర్శిస్తున్నట్లు సర్కార్ అసంతృప్తిని వ్యక్తం చేసింది.

​ఆ కీలక శాఖల సెక్రటరీలపైనే ప్రధానంగా దృష్టి..

​ఆదాయం ఆర్జించే ప్రధాన శాఖల్లో ఏ ఒక్కటీ ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచడం లేదని సర్కార్ భావిస్తోంది.​మున్సిపల్-పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని హెచ్ ఎండీఏ భూముల వేలం, లేఅవుట్ అనుమతులు, ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో నిర్లక్ష్​యం ఉన్నట్లు సర్కార్ భావిస్తుంది. రెవెన్యూ శాఖ పరిధిలోని రిజిస్ట్రేషన్ల లీకేజీలు, ప్రభుత్వ భూముల గుర్తింపులో పురోగతి లేకపోవడంపై కూడా ఆగ్రహంగానే ఉన్నది.మైనింగ్ రాయల్టీల వసూళ్లలో బకాయిలు, కొత్త లీజుల వేలంలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఎక్సైజ్, రవాణా, కమర్షియల్ టాక్స్ శాఖల పరిధిలో పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం, ఆదాయ లక్ష్యాలకు దూరంగా ఉండటం పై కూడా ప్రభుత్వం గుర్రుగా ఉన్నది. కేవలం రొటీన్ పాలనతో సరిపెట్టుకుంటే కుదరదని,రాష్ట్ర బడ్జెట్ అవసరాలకు తగినట్లుగా కొత్త ఆదాయ మార్గాలను వెతకాల్సిందే అని సీఎం, డిప్యూటీ సీఎం కూడా గతంలోనే ఉన్నతాధికారులకు నొక్కి చెప్పారు.

Also Read: కర్ణాటక పరిశ్రమలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి, ఐసీయూలో మరో ముగ్గురు!

Tags

Related News

వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఇద్దరి ప్రాణాలు గాల్లో

ప్రభుత్వ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. యూనిఫాంలో కొత్త మార్పులు!

కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్

ఢిల్లీ కేంద్రంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

తెలంగాణ యువతకు డెల్ సంస్థ బిగ్ ఆఫర్.. అన్నీ ఉచితం!

మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 45 రోజుల్లో ఆ దరఖాస్తులకు పరిష్కారం..?

Big Stories

Advertisement
×