E-Paper
Advertisement

అందితే జుట్టు.. అంద‌క‌పోతే కాళ్లు.. పోల‌వ‌రం క్రెడిట్ కోసం వైసీపీ డ‌బుల్ స్టాండ‌ర్డ్స్‌!

అందితే జుట్టు.. అంద‌క‌పోతే కాళ్లు.. పోల‌వ‌రం క్రెడిట్ కోసం వైసీపీ డ‌బుల్ స్టాండ‌ర్డ్స్‌!
Advertisement

వైసీపీ అంతే. ఏం చేసినా అది వైర‌లే. ఏదో ర‌కంగా వార్త‌ల్లో నిలుస్తుంది. జ‌గ‌న్ మాట‌ల‌కు అర్థాలే వేరులే అన్న‌ట్టుగా ఉంటుంది ప‌రిస్థితి. అంద‌రికీ భిన్నంగా పోవ‌డం జ‌గ‌న్‌కు అల‌వాటు. త‌న‌దైన రాజ‌కీయాన్ని న‌డిపించ‌డం కూడా వెన్న‌తో పెట్టిన విద్య‌. ఈ క్ర‌మంలో ఎవ‌రు న‌వ్వుకున్నా ప‌ట్టించుకోడు. ఎవ‌రు హేళ‌న చేసినా వెనుదిరిగి చూడ‌డు.

మావిగ‌న్ అన్నా అత‌నికే చెల్లుతుంది. విజ‌య‌వాడ రాజ‌ధాని అని మాట మార్చినా దాన్ని ప్ర‌జ‌లు ఆమోదించాల్సిందే. ఆక్సిడెంట్ చేసి చంపినా పాపం పిల్లోడు తెలిసీ తెలియ‌క తెశాడ‌ని సానుభూతి కురిపించినా అది జ‌గ‌న్‌కే సాధ్యం. లాక‌ప్ డెత్ విష‌యంలో కూడా రేప్ చేస్తే చంపుతారా? అస‌లు ఎవ‌రూ రేప్ చేయ‌రా? అని సంబంధం లేకుండా త‌న స్టైల్‌లో ప్ర‌శ్నించ‌డ‌ము కూడా వేరొక‌రికి సాధ్యం కాదంతే.

Advertisement

ఇవ‌న్నీ ఎందుకంటే మ‌ళ్లీ కొత్త‌గా పోల‌వరం మీద ఓ పంచ్ వేశారు వైసీపీ నేత‌లు. పోలవ‌రం ఈ స్థాయికి రావ‌డానికి అన్నే కార‌ణ‌మ‌న్నారు. అస‌లు ఆయ‌న తెచ్చిన నిధులు.. చూపిన చొర‌వ‌.. వారేవ్వా..అద్బుతమ‌ని కొనియాడారు. త‌మ అధికారిక వెబ్‌సైట్లో జ‌గ‌న్ వ‌ల్లే పోల‌వరం పూర్తికాబోతుంద‌ని చెప్పుకొచ్చారు. దీన్ని చూసిన కూట‌మి నేత‌లు భ‌గ్గుమ‌న్నారు.

మీకేనా సోష‌ల్ మీడియా ఉంది.. మా ప్ర‌తాపం చూడండ‌ని… అప్ప‌టి పాత వీడియోల‌న్నీ బ‌య‌ట‌కు తీసి ఎడాపెడా చెడామడా బ‌య‌ట‌పెట్టేశారు. అప్పుడు పోల‌వరం గురించి జ‌గ‌న్ ఏమ‌న్నాడో.. త‌ను సీఎం కాగానే కాంట్రాక్ట్ సంస్థ‌ను ఎలా మార్చేశాడో.. దీని ద్వారా పోలవ‌రానికి జ‌రిగిన న‌ష్టం.. డ్యామేజీ ఏ విధంగా అయ్యిందో.. అన్నీ వివ‌రాలు పొందుప‌రిచారు.

Advertisement

ఇదీ మీ త‌తంగం.. ఇదీ మీ పార్టీ విధానం.. ! అంటూ ఎదురుదాడికి దిగారు. అంతేకాదు ప‌నిలో ప‌ని పాత విష‌యాల‌న్నీ త‌వ్వి తీశారు. జ‌గ‌న్ గారి డబుల్ స్టాండ‌ర్డ్స్ ఇలా ఉంటాయి.. చూడండి అంటూ కొన్ని వీడియోలు పోస్ట్ చేశారు. రాజ‌ధాని విష‌యంలో ఎలా మాట మార్చాడు..? ఏ విధంగా అడ్డుత‌గిలాడు.. ? ఏమ‌న్నాడు…? ఎన్ని కొర్రీలు పెట్టాడు.. ? అన్ని వివ‌రాలు అందులో ఉన్నాయి.

స్వ‌యంగా ఇవ‌న్నీ జ‌గ‌న్ మాట్లాడిన‌వే. ఇక మొన్న‌టికి మొన్న భోగాపురం ఎయిర్ పోర్టు విష‌యంలో కూడా ఎలా మాట మార్చారు? క్రెడిట్ చోరీ కోసం ఎలా మాట‌లు మారుస్తున్నారు? అంటూ ఆ వీడియోల‌ను కూడా పోస్ట్ చేశారు. అస‌లు పోల‌వ‌ర‌మే వ‌ద్ద‌న్నోడు.. ఇప్పుడు త‌న వ‌ల్లే పోల‌వ‌రం అన‌డ‌మేందీ? అని జ‌న‌సేన, టీడీపీ రెంఎడు పార్టీల నుంచి సోష‌ల్ మీడియా వేదిక‌గా మాట‌ల దాడులు జ‌రుగుతున్నాయి.

ప్ర‌స్తుతం ఏపీలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ ఏది చెప్పినా.. ఏది చేసినా.. అందుకు విరుద్దంగా అర్థం చేసుకోవాల‌ని, అందులో నిజాయితీ ఉండ‌ద‌ని, త‌మ రాజ‌కీయ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఏ ఎండుకు ఆ గొడుకు ప‌ట్టే విధాన‌మే ఉంటుంద‌ని ఏపీ ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసే ప‌నిలో బిజీగా ఉన్నారు కూట‌మి సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌..!

Related News

బిగ్ టీవీ కథనాలకు భారీ ఇంపాక్ట్.. మెట్రో పిల్లర్ల తవ్వకాలపై కళ్లు తెరిచిన అధికారులు!

కేటీఆర్ ఆస్తులపై దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ.. త్వరలో బిగ్ ట్విస్ట్?

కొడంగల్ వేదికగా కల్వకుంట్ల కవిత,కేటీఆర్ పొలిటికల్ స్కెచ్.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ కుమార్తె.. కీలక బాధ్యతలిచ్చిన వైసీపీ పార్టీ!

మమతా బెనర్జీకి వరుస బిగ్ షాక్‌లు.. రాత్రికి రాత్రే అభ్యర్థి అరెస్ట్!

భారతీయ ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్.. వీసా ఫీజు పొడిగింపు!

భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైల్వే స్టేషన్ కనెక్టివిటీ.. ఎక్కడో తెలుసా..?

చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ నయా అడుగు.. దేశ జీడీపీకి మరో భారీ బూస్టర్!

Big Stories

Advertisement
×