ఐడెంటిటీ క్రైసిస్.. ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్.. ఈ రెండూ రాజకీయాల్లో వెంటాడుతున్నట్టున్నాయి ఉదయనిధి స్టాలిన్‌ను. తనకన్నా కాలేజీలో సీనియర్ కానీ.. రాజకీయాల్లో జూనియర్.. ఇలా వచ్చీ రాగానే సీఎం అయిపోయాడు..! అనే ఓ ఆత్మన్యూనతా భావం వెంటాడుతున్నట్టుంది. విజయ్ విషయంలో.
ఈ మాటను స్వయంగా తనే అన్నాడు అసెంబ్లీలో. ఓయ్.. బాబు నువ్వు నాకన్న కాలేజీలో సీనియర్ కావొచ్చు.. ఇక్కడ జూనియరే తెలుసా..? ఇప్పుడు సీఎం అయినంత మాత్రానా ఆ విషయం మరిచిపోకు..! అన్నట్టుగా దెప్పిపొడిచాడు. ఈ మాటల్లోనే ఆయన అంతరంగాన్ని, మనస్తత్వాన్ని అంచనా వేయొచ్చు.
వచ్చీ రాగానే రాజకీయాల్లో రెడ్ కార్పెట్ పరిచారు. రాజకీయ వారసత్వ కుంటుంబం.. తండ్రి కష్టపడి అన్ని సమకూరిస్తే.. ఇలా వచ్చి ఓ పార్టీ పదవి తీసుకుని .. ఆ తరువాత ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా చేసి.. డిప్యూటీ సీఎం అయి.. ఇలా వరుసగా టకటకా జరిగిపోయాయన్నీ. కానీ సీఎం అవుదామనుకున్నాడు. ఇలా విజయ్ వచ్చి మధ్యలో దూరాడు. తన కలలను కల్లలు చేసి పెట్టాడు. అందుకే కోపం అతనంటే.
ఎంతలా అంటే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఐటెం సాంగ్ డ్యాన్సర్లు అనేంత. రాజకీయాల్లో తన దుందుడుకు మనస్తత్వం కారణంగా చాలా సందర్భాల్లో అసందర్భ ప్రేలాపనలు చేసి వివాదాలను కొనితెచ్చకున్నాడు. తన పార్టీ డీఎంకేలో మాత్రం ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నారు. మాస్ అప్పీయరెన్స్ ఉందనిపించుకున్నాడు. కానీ ఇతరులెవరూ అతని రాజకీయ నడివడికను మెచ్చుకోలేదు. కనీసం ఓకే పర్వాలేదు.. అని కూడా అనలేదు.
సినిమాల్లో పంచు డైలాగుల్లా ఏదో అనబోయి.. మరేదో అని దొరికిపోయి.. వివాదం తెచ్చిపెట్టుని, విమర్శలెదుర్కొని.. పార్టీకి నష్టమే తెస్తున్నాడు తప్ప.. తండ్రికి తలనొప్పి, తలవంపులే తప్ప.. పార్టీకున్న ప్రజావ్యతిరేకతను తగ్గించాలనే కోణంలో ఉదయ్ రాజకీయం నడవటం లేదనే అంటున్నారంతా. తాజాగా త్రిష విషయంలో మరోసారి ఉదయ్ నోటి దురుసు బయటపడింది. దీంతో మహిళల్లో ఏర్పడిన వ్యతిరేకత పార్టీకి డ్యామేజే తెచ్చిపెట్టనుంది.
ఇక ఈ ఎపిసోడ్ కాకుండా.. ఆయన గతంలోకి వెళ్తే పర్వాలేదు అనేలాగా ఉన్నది నేపథ్యం. హీరోగా 2012లో ఆరంగేట్రం చేసి.. తొలి చిత్రమే బ్లాక్‌బస్టర్‌గా నిలిపి అందరినీ ఆకట్టుకోగలిగాడు. అన్ని రకాల పాత్రలు చేయగలనని తనుకు తాను నిరూపించుకున్నాడు. ఇక సినిమాలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు డిసైడ్ అయిన తరువాత చేసిన చివరి సినిమాను కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిపి..తన సినీ ఎండింగ్ కెరీర్‌కు శుభం కార్డు వేసుకున్నాడు.
మధ్యలో ఉదయ్ బిజినెస్ మెన్ అవతారం ఎత్తి దాంట్లోనూ సక్సెసయ్యాడు. వెనుక తండ్రి రాజకీయం, అప్పటికే రాజకీయంగా పాతుకుపోయిన కుటుంబం.. ఇవన్నీ కలిసి వచ్చాయి విజయ్‌కు. రెడ్ జైంట్ మూవీస్ సంస్థను నెలకొల్పి నిర్మాతగా అవతారం ఎత్తి మళయాళం, తమిళ సినిమాలను ఎన్నో నిర్మించాడు. అవన్నీ దాదాపుగా సక్సెసే అయ్యాయి. దీంతో మంచి బిజినెస్‌మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నాడు.
అటు హీరోగా ఎక్కువ కాలం చేయలేకపోయాడు. స్టార్ ఇమేజీని పొందలేకపోయాడు. బిజినెస్‌లో రాణించాడు. రాజకీయాల్లో మాత్రం విలన్‌గా ఉండిపోయాడు. హీరోగా అవుదామని ..అదే సీఎం అవుదామని వచ్చిన ఉదయ్.. ఇలా విలన్ మాదిరిగా డైలాగులు కొట్టడం ద్వారా .. ఆ పాత్రకే పరిమితయ్యేలా ఉన్నాడంటున్నారు తమిళ తంబీలు.