BigTV English

Aditya L1 Mission: ఇక ఆదిత్యయాన్.. డేట్ ఫిక్స్.. సూర్యుడు చిక్కేనా?

Aditya L1 Mission: ఇక ఆదిత్యయాన్.. డేట్ ఫిక్స్.. సూర్యుడు చిక్కేనా?
aditya l1

Aditya L1 Mission: చంద్రుడిపై జెండా పాతింది ఇండియా. దక్షిణ ధృవంపై విక్రమ్ రోవర్ రయ్ రయ్ మంటూ దూసుకుపోతోంది. ఇప్పటికే మూన్ టెంపరేచర్ పట్టేసింది. ఈ రెండు వారాల్లో ఇంకేం గుట్టు రట్టు చేస్తుందో అనే క్యూరియాసిటీ నెలకొంది.


చంద్రుడు చేజిక్కాడని రిలాక్స్ కావట్లేదు ఇస్రో. ఇక సూర్యుడి సంగతి తేలుస్తామంటున్నారు మన సైంటిస్టులు. బాణుడిపై పరిశోధనలకు గాను ఆదిత్య ఎల్1 మిషన్ స్టార్ట్ చేసేశారు. సౌర వాతావరణంపై అధ్యయనం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు.

చంద్రయాన్‌ తరహాలోనే ఆదిత్యయాన్‌ ప్రయోగం. సెప్టెంబర్ 2, ఉదయం 11:50కి PSLV-XL రాకెట్‌ ద్వారా ఉపగ్రహాన్ని సౌర మండలానికి ప్రయోగించనుంది ఇస్రో. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండి సూర్యుడిపై పరిశోధనలు చేయనుంది. ఇప్పటికే శాటిలైట్‌ను శ్రీహరి కోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌‌కు తీసుకొచ్చారు.


సూర్యుడి అధ్యయనం కోసం ఇస్రో చేపడుతున్న తొలి మిషన్‌ ఆదిత్య -ఎల్1. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని పరిశోధించడమే ప్రయోగ లక్ష్యం. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, పలు దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో సౌర అధ్యయన ప్రక్రియను చేపట్టబోతోంది.

శాటిలైట్ బరువు 1500 కిలోలు. భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్‌ పాయింట్ -1 చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఆదిత్య-ఎల్1ను ప్రవేశపెడతారు. ఇది నాలుగు నెలల ప్రయాణం. ఈ కక్ష్యలోకి పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుంది.

సూర్యుడిపై ప్రయోగాల కోసం భారత్ ప్రయోగిస్తున్న తొలి స్పేస్ క్రాఫ్ట్ ఇదే. కరోనల్ హీటింగ్, సోలార్ విండ్, కరోనల్ మాగ్నెటోమెట్రీ, UV సోలార్ రేడియేషన్, ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా అంటే సూర్య కేంద్రస్థానం, సూర్యుని అయస్కాంత క్షేత్రం, సోలార్ ఎనర్జిటిక్ పార్టికల్స్ పై ప్రయోగం చేయడానికి ఈ ఆదిత్య ప్రయోగం ఉపయోగపడుతుంది.

భూమి వాతావరణ పరిస్థితులపై సూర్యుడి ప్రభావం ఎలా ఉంటుందన్నది ఈ మిషన్ ద్వారా దీర్ఘకాలంలో ఉపయోగపడుతుందని సైంటిస్టులు అంటున్నారు. సూర్యుని ఎగువ వాతావరణంలో 10 లక్షల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే.. దిగువ వాతావరణంలో కేవలం 5,730 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. ఇవన్నీ ఇప్పటికీ మిస్టరీనే. వీటిని ఛేదించడమే లక్ష్యంగా ఆదిత్య L1 రంగంలోకి దిగనుంది. లాంగ్ రేంజ్ పాయింట్ లోని సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి శాటిలైట్ ను చేరుస్తారు.

ఆదిత్య ఎల్ 1లో మొత్తం ఏడు పే లోడ్లు ఉంటాయి. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ పేలోడ్ ద్వారా.. సూర్యుడి ఫొటోలు, స్పెక్ట్రోస్కోపిపై ఫోకస్ పెడుతారు. దీని ద్వారా సూర్యుడికి ఎక్కడి నుంచి శక్తి లభిస్తుందో, భూమి వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలను మరింతగా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. మరో పేలోడ్ సోలార్ యూపీ ఇమేజింగ్ టెలిస్కోప్ తో 200-400 నానోమీటర్ తరంగధైర్ఘ్యం పరిధి మధ్య సూర్యుడిపై ప్రయోగం చేస్తుంది. మరో పేలోడ్ హై ఎనర్జీ ఎల్ 1 ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్ సౌర కరోనాలో మారుతున్న పరిస్థితులను అబ్జర్వ్ చేస్తారు. సోలార్ ఎనర్జీ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్ ఎక్స్ రే తీవ్రతను పర్యవేక్షించడానికి, కరోనల్ హీటింగ్ మెకానిజం స్టడీ చేయడానికి పనికి వస్తుందంటున్నారు. ఇంకో పేలోడ్ ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ సౌరగాలి తీరు, ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ను అర్థం చేసుకోడానికి పరిశోధనలు చేస్తుంది. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్ పెరిమెంట్ సౌర గాలి వైవిధ్యం, లక్షణాలను పరిశీలిస్తుంది.

ఇప్పటికే చంద్రుడిపై సక్సెస్ అయిన ఇస్రో.. ఇప్పుడు క్లిష్టమైన సూర్యుడిని టార్గెట్‌గా పెట్టుకొని తనకు తానే ఛాలెంజ్ విసురుకుంది.

Related News

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

Big Stories

×