BigTV English

Air India: చిన్న బొట్టు, తలకు రంగు, బట్టతలకు గుండు.. ఉద్యోగులకు కొత్త రూల్స్..

Air India: చిన్న బొట్టు, తలకు రంగు, బట్టతలకు గుండు.. ఉద్యోగులకు కొత్త రూల్స్..

Air India: ఉద్యోగులందు విమానయాన ఉద్యోగులు వేరు. వారి లుక్కు, గెటప్పు సెపరేటు. నీట్ గా, పోష్ గా ఉండాల్సిందే. గుడ్ లుక్ ఏమాత్రం తగ్గేదేలే. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయక్కడ. సాలరీస్ కూడా అదే రేంజ్ లో ఉంటాయనుకోండి. లేటెస్ట్ గా టాటాల చేతికి వచ్చిన ఎయిర్ ఇండియా.. విమాన క్రూ సిబ్బందికి కొత్త నిబంధనలు జారీ చేసింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఏకంగా 40 పేజీల సర్క్యులర్ జారీ చేసింది. రూల్స్ తప్పనిసరిగా పాటించాల్సిందేనని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.


తెల్ల జుట్టు ఉన్నవారు నల్ల రంగు వేసుకోవాలని, బట్టతల ఉంటే గుండు చేసుకోవాలని.. లేడీస్ అయితే మేకప్ కంపల్సరీ, చిన్న బొట్టు, సన్నని గాజు, ఓ రింగు.. ఇలా చాలానే నిబంధనలు పెట్టింది. ఎయిర్ ఇండియా కొత్త రూల్స్ ఏంటంటే….

మహిళా ఉద్యోగులకు నిబంధనలు:


–కంపెనీ మార్గదర్శకాల ప్రకారమే జడ వేసుకోవాలి. మరీ పైకి గానీ, మరీ కిందకు గానీ కొప్పులు వేసుకోకూడదు. హెయిర్‌ బన్‌ను తల వెనుకవైపు మధ్యలో వేసుకోవాలి. దానిపై సన్నని నెట్‌ ఉండాలి. జుట్టుకు నాలుగే టిక్‌టాక్‌ పిన్స్‌ పెట్టుకోవాలి. చిన్న జుట్టు ఉన్న వారు పర్మనెంట్‌ స్ట్రెట్‌నింగ్‌ చేయించుకుని నీట్‌గా దువ్వుకోవాలి. జుట్టు నెరిస్తే కంపెనీ హెయిర్‌ కలర్‌ షేడ్‌ కార్డ్‌లో ఉండే రంగు వేసుకోవాలి.

–స్కిన్ కలర్ ఫౌండేషన్ కంపల్సరీ. ఐషాడో, లిప్‌స్టిక్‌, నెయిల్ పాలిష్ వేసుకోవాలి.

–చేతికి ఒకే ఒక్క సన్నని గాజు వేసుకోవాలి. ఒక్కో చేతికి ఒక్కోటి చొప్పున రెండు ఉంగరాలు పెట్టుకోవచ్చు.

–చెవులకు బంగారం, లేదా వజ్రాలతో ఉండే స్టడ్స్ మాత్రమే ధరించాలి. ముత్యాల పోగులు పెట్టుకోకూడదు.

–చీరలు లేదా ఇండో వెస్టర్న్‌ యూనిఫామ్. స్కిన్‌ కలర్‌లో ఉండే సాక్సులు మస్ట్. వింటర్లో కంపెనీ ఇచ్చిన స్వెటర్లు మాత్రమే వేసుకోవాలి.

–చీర కట్టుకునేవాళ్లు మాత్రమే నుదుటిన చిన్న బొట్టు పెట్టుకోవాలి. అది కూడా ఆప్షనల్. ఇష్టం లేనివాళ్లు బొట్టు పెట్టుకోకపోయినా పర్వాలేదు.

పురుష ఉద్యోగులకు నిబంధనలు:

–బట్టతల లేదా నుదురు ఎక్కువగా కనిపించేవారు పూర్తిగా గుండు చేయించుకోవాలి. గుండును ప్రతి రోజూ షేవ్‌ చేసుకోవాలి.

–జుట్టును చిన్నగా కటింగ్‌ చేయించుకుని హెయిర్‌ జెల్‌ రాసుకోవాలి. పక్క పాపిటితో నున్నగా దువ్వుకోవాలి. తెల్ల వెంట్రుకలు ఉంటే నేచురల్ షేడ్‌లో జుట్టుకు రంగు వేసుకోవాలి.

–చేతికి ఒకే ఒక్క ఉంగరం.. అది కూడా పెళ్లికి సంబంధించినది అయితేనే అనుమతి. బ్రాస్‌లైట్‌లు వేసుకోకూడదు.

–సిక్కు ఉద్యోగుల చేతికి కడియం ఉండొచ్చు. అయితే అది బంగారం లేదా వెండితో ఎలాంటి డిజైన్లు, లోగోలు, రంగు రాళ్లు లేకుండా 0.5 సెంటీమీటర్ల మందంతో మాత్రమే ఉండాలి.

–విమానంలో ఉన్నంత సేపు నల్లరంగు జాకెట్లు ధరించాలి. లోగోలు లేని నలుపు సాక్సులు వేసుకోవాలి.

Tags

Related News

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

Big Stories

×