YS Jagan: ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకులు, ముఖ్య నేతలు సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లిపోయారు?… ఇంతకు మునుపు వరకు చిన్న ఇష్యూస్ కూడా పెద్దపెద్దగా చూపించి, లేనిపోని హడావుడి చేసిన వైసిపి ముఖ్య నేతలు… ఇటీవల కాలంలో జరిగిన పెద్ద ఇష్యూస్ పై ఒక్క మాట మాట్లాడకపోవడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది… అనంత వైసీపీ నేతలు ఎందుకు సైలెంట్ అయిపోయారు? అంత సీనియార్టీ ఉన్నా అధికారపక్షాన్ని ఎందుకు నిలదీయ లేకపోతున్నారు? అసలు అనంతపురం జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది?
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసాయి… జగన్ రెడ్డి పుట్టినరోజుని పెద్ద ఎత్తున జరపాలని రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకులు ప్లాన్ చేసుకున్నారు… అందుకు తగ్గట్టు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఒక అడుగు ముందుకేసి జగన్ పుట్టినరోజు నాడు పెద్ద ఎత్తున జంతుబలులు ఇచ్చి ఆ రక్తాన్ని జగన్, స్థానిక నాయకుల ఫ్లెక్సీ లకు రక్తాభిషేకం చేసి, వాటిని వీడియో తీసి వారి వాట్స్అప్ స్టేటస్లుగా పెట్టుకున్నారు… ఇంతవరకు బానే ఉన్నా ఇవి కాస్త పోలీసుల వరకు చేరడం అక్కడ టిడిపి నాయకులు వీరిపై కంప్లైంట్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి…
సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం భానుకోట గ్రామంలో వైసీపీ శ్రేణులు గొర్రెపోతును నరికి ఆ రక్తంతో జగన్ , రాప్తాడు వైసిపి ఇంచార్జ్ ప్రకాష్ రెడ్డి ఫ్లెక్సీలకు అభిషేకం నిర్వహించారు… ఇంకా అనేక చోట్ల ఇలాగే నిర్వహించి లేదా తల్వార్లతో కేక్ కటింగ్ చేసి తమ నాయకుడిపై అభిమానం చూపించే ప్రయత్నం చేశారు… తమ నాయకుడి పట్ల అభిమానం చూపించే కార్యక్రమాలు అనేకం ఉన్నా ఇలాంటి మార్గాన్ని ఎంచుకోవడం పట్ల, స్థానిక ప్రజల్లో, టిడిపి నాయకుల్లో కానీ తీవ్ర వ్యతిరేకత ఏర్పడేలా చేసింది… ఇక ఇవి కాస్త పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు కేసు నమోదు చేశారు
ఇక సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం లో మరింత దూకుడుగా వ్యవహరించిన వైసీపీ కార్యకర్త ఇక్కడ టపాసులు కాల్చొద్దు అన్నందుకు ఒక మహిళను అది కూడా గర్భిణీ స్త్రీ పై దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది… గర్భిణీ పై దాడి అంశాన్ని జిల్లా ఎస్పీ సీరియస్ గా తీసుకొని యువకుడు అజయ్ దేవా నీ కదిరి నడిరోడ్లపై ఊరేగించి తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చారు… ఇంతవరకు ఓకే కానీ అరెస్ట్ అయిన రెండు రోజుల తర్వాత స్థానిక నాయకులు కాకుండా ఎక్కడో విజయవాడ నాయకులు బయటకు వచ్చి ఆ వ్యక్తి వైసీపీ కార్యకర్త కాదని జనసేన కార్యకర్త అని ప్రచారం చేస్తున్నారు… ఒకవేళ నిజంగా జనసేన కార్యకర్త అయి ఉంటే జగన్ పుట్టినరోజు వేడుకల్లో జనసేన కార్యకర్త ఎందుకు పాల్గొంటాడు అన్న మినిమం కామన్సెన్స్ కూడా మర్చిపోయారని తెలుగు తమ్ముళ్లు ఎద్దేవా చేస్తున్నారు…
ఒకవేళ నిజంగా జనసేన కార్యకర్త అయి ఉంటే స్థానిక కదిరి వైసిపి నాయకులు ఇన్నాళ్లు గుడ్డి గుర్రాల పళ్ళు తోమేరా అంటూ సైటర్లు వేస్తున్నారు… మరి ఆ విషయాన్ని ఎందుకు జనాల్లోకి తీసుకు వెళ్ళలేకపోయారు, కనీసం ఏ ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇతను వైసీపీ కార్యకర్త కాదు జనసేన కార్యకర్త అని ఒక్కరు కూడా ఎందుకు చెప్పలేకపోయారు…. తీరా అరెస్ట్ అయిన జైల్లోకి వెళ్లిన రెండు రోజుల తర్వాత ఎక్కడో విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి ఇతనికి వైసీపీకి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేయ్యడం ఏంటని విమర్శిస్తున్నారు…
ఇదే కాకుండా రాప్తాడు , కళ్యాణదుర్గం లో జరిగిన ఇష్యూస్‌పై కూడా ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్పందించకపోవడం తీవ్ర చర్చనీయాంశం అయింది… ప్రతి విషయాని కి స్పందించే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఇంతవరకు ఈ విషయంపై ప్రెస్ మీట్ పెట్టకపోవడం, చిన్న విషయం కూడా రాద్ధాంతం చేసే కళ్యాణదుర్గం వైసీపీ ఇన్చార్జ్ తలారి రంగయ్య ఈ విషయంపై ఒక్క మాట మాట్లాడకపోవడంపై స్థానిక వైసిపి కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్థానిక వైసిపి కేడర్ మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్‌గా సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తోంది… వైసీపీ కార్యకర్తల అరెస్టు అయితే ఒక్కరు కూడా బయటికి రాకుండా మౌనంగా ఉండటమేంటని వైసిపి నాయకుల్ని ప్రశ్నిస్తున్నారు… చూడాలి మరి ఇప్పటికైనా వైసీపీ నాయకులు బయటకు వచ్చి ఈ సంఘటనలపై మాట్లాడతారో లేదో.
Story by Ajay, Big Tv