E-Paper
Advertisement

స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టులు.. టెట్ క్వాలిఫికేషన్‌పై ప్రశ్నలు

స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టులు.. టెట్ క్వాలిఫికేషన్‌పై ప్రశ్నలు
Advertisement

AP DSC:విజయనగరం జిల్లాలోనూ డీఎస్సీ అవకతవకలపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఒకే ఫ్యామిలీలో ఉద్యోగాలు పొందిన ఇద్దరి అర్హతల విషయంలో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిల్లా మోహినిదేవి, చిల్లా యోగేశ్వరరావు… ఇద్దరూ ఎస్జీటీలుగా ఉద్యోగాలు పొందారు. సెల్ఫ్ డిక్లరేషన్‌లో ఇద్దరూ స్పోర్ట్స్ కోటాని నమోదు చేశారు. అయితే బీసీ-ఏ సామాజికవర్గానికి చెందిన ఇద్దరి టెట్ క్వాలిఫికేషన్ అనుమానాలు రేకెత్తిస్తోంది.

బీసీ-ఏ అభ్యర్థులకు 75 మార్కుల టెట్ అర్హతపై ప్రశ్నలు

Advertisement

చిల్లా యోగేశ్వరరావు టెట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే… ఎస్జీటీకి అవసరమైన పేపర్ 1-ఏలో ఒక్కసారి కూడా అర్హత సాధించలేదు. ఇక ఆయన సోదరి చిల్లా మోహినీదేవి కూడా… ఎస్జీటికి అవసరమైన పేపర్ 1-ఏలో అర్హత సాధించలేదని స్పష్టంగా తెలుస్తోంది. బీసీ-ఏ టెట్ క్వాలిఫికేషన్ 75 మార్కులుగా ఉంది. కానీ వీరిద్దరూ ఆ అర్హత సాధించలేకపోయారు.

నిజానికి స్పోర్ట్స్ కోటా అభ్యర్ధులకు డీఎస్సీ రాయాల్సిన అవసరం లేదన్న మినహాయింపు ఇచ్చారు. కానీ టెట్ అర్హత తప్పనిసరి చేశారు. ఇక్కడే చిల్లా యోగేశ్వరరావు, చిల్లా మోహినిదేవీ అర్హతలపై ఫిర్యాదుదారులు ఆరోపణలు చేస్తున్నారు.

Advertisement

కర్నూలు ప్రభాకర్ కేసుతో పోలికలు తెస్తున్న ఫిర్యాదుదారులు

కర్నూలు ప్రభాకర్ కథ లాగే… ఇక్కడా వీరిని అనుమానించాల్సి వస్తోంది. స్పోర్ట్స్ అథారిటీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన వీరి సర్టిఫికెట్లలో టెట్ అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్ కనిపించడం లేదు. శాప్ పోర్టల్‌లోనే కొందరి అర్హత పత్రాల్లో టెట్ సర్టిఫికెట్ కనిపిస్తోంది.

Also read :ఉప్పాడ తీరంపై పవన్ ఫోకస్.. గ్రౌండ్‌లోకి ఐఐటీ మద్రాస్ టీమ్

మరికొందరి వివరాల్లో టెట్ సర్టిఫికెట్ కనిపించడం లేదు. మొత్తంగా ఆరోపణలు పక్కనపెడితే… స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ ఉద్యోగానికి టెట్ అర్హత అవసరం ఉందా, లేదా అన్న ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది.

Tags

Related News

క్షణికావేశంలో ముగిసిన కుటుంబ కథ.. పశ్చిమ గోదావరిలో కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన!

జమ్మలమడుగు పాలిటిక్స్‌లో రగులుతున్న పోలిటికల్ వార్.. బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ మధ్య కోల్డ్ వార్!

సీఎం రేవంత్ వ్యూహం వర్సెస్ బీఆర్ఎస్ కౌంటర్.. తెలంగాణ అసెంబ్లీలో ఏం జరగబోతోంది?

తెలంగాణలో ఈవీ వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

కాంగ్రెస్ వ్యూహంలో గట్టిగా చిక్కుకున్న బీఆర్‌ఎస్.. కల్వకుంట్ల కవిత సంచలనం

సర్కార్‌కు ఎంప్లాయీస్ టెన్షన్.. తగ్గేదే లే అంటున్న తెలంగాణ ఉద్యోగులు!

తెలంగాణ శాసనసభ సమావేశాల వేళ గులాబీ దళంలో ఉత్కంఠ.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా..?

Big Stories

Advertisement
×