E-Paper
Advertisement

జమ్మలమడుగు పాలిటిక్స్‌లో రగులుతున్న పోలిటికల్ వార్.. బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ మధ్య కోల్డ్ వార్!

జమ్మలమడుగు పాలిటిక్స్‌లో రగులుతున్న పోలిటికల్ వార్.. బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ మధ్య కోల్డ్ వార్!
Advertisement

Jammalamadugu: జమ్మలమడుగు అంటేనే హాట్‌ పాలిటిక్స్‌కు కేరాఫ్‌. కొంతకాలంగా ఎమ్మెల్యే బాబాయ్ ఆది నారాయణరెడ్డి, బాబాయ్ టీడీపీ నేత భూపేష్‌రెడ్డి మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోందనే ప్రచారం ఉంది. ముద్దనూరు మార్కెట్‌ యార్డ్‌, స్మార్ట్‌ కిచెన్‌ పనులు, మద్యం షాపుల వ్యవహారాల్లో ఇద్దరి అనుచరుల మధ్య పోటీ కనిపించింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఈ విభేదాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయనే టాక్‌ వినిపిస్తోంది.

కూటమి పొత్తులో బీజేపీ..

గత సార్వత్రిక ఎన్నికల్లో జమ్మలమడుగు టికెట్‌ భూపేష్‌రెడ్డికి వస్తుందని చివరి వరకు ప్రచారం జరిగినా.. కూటమి పొత్తులో బీజేపీకి సీటు దక్కడంతో సర్దుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో జమ్మలమడుగు మున్సిపాలిటీని టీడీపీకే కేటాయించాలని భూపేష్‌రెడ్డి పట్టుబడుతున్నారట. జిల్లా అధ్యక్షుడి హోదాలో సొంత నియోజకవర్గంలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకపోతే.. ఆ ప్రభావం జిల్లాలోని ఇతర నియోజకవర్గాలపైనా పడుతుందని ఆయన భావిస్తున్నారనే చర్చ జరుగుతోంది.

Advertisement

Also read: రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు సీఎం రేవంత్ ప్రవేశపెట్టే కీలక నివేదికలివే?

బాబాయ్‌ మధ్య మున్సిపల్‌ వార్‌..

మరోవైపు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి మాత్రం జమ్మలమడుగు మున్సిపాలిటీని బీజేపీకే కేటాయించేలా వ్యూహం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సీటు ఇచ్చిన నేపథ్యంలో.. స్థానిక సంస్థల్లోనూ అదే ఫార్ములా కొనసాగించాలన్న ఆలోచన ఉందట. దీంతో అబ్బాయ్‌.. బాబాయ్‌ మధ్య మున్సిపల్‌ వార్‌ మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి జమ్మలమడుగు మున్సిపాలిటీ విషయంలో కూటమి అధినేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Advertisement

Also read: ఏపిలో కొత్త పింఛన్ల దారులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు!

Tags

Related News

క్షణికావేశంలో ముగిసిన కుటుంబ కథ.. పశ్చిమ గోదావరిలో కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన!

సీఎం రేవంత్ వ్యూహం వర్సెస్ బీఆర్ఎస్ కౌంటర్.. తెలంగాణ అసెంబ్లీలో ఏం జరగబోతోంది?

తెలంగాణలో ఈవీ వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టులు.. టెట్ క్వాలిఫికేషన్‌పై ప్రశ్నలు

కాంగ్రెస్ వ్యూహంలో గట్టిగా చిక్కుకున్న బీఆర్‌ఎస్.. కల్వకుంట్ల కవిత సంచలనం

సర్కార్‌కు ఎంప్లాయీస్ టెన్షన్.. తగ్గేదే లే అంటున్న తెలంగాణ ఉద్యోగులు!

తెలంగాణ శాసనసభ సమావేశాల వేళ గులాబీ దళంలో ఉత్కంఠ.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా..?

Big Stories

Advertisement
×