Telangana Politics: తెలంగాణ పాలిటిక్స్‌లో హీట్ పెరగనుంది. ఈ సారి వాడి వేడిగా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సభలో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగనుంది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేయనున్నారు. వెయ్యిరోజుల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తున్న కాంగ్రెస్… అసెంబ్లీ వేదికగా సైతం తాము చేసిన డెవలప్‌మెంట్‌ను వివరించనుంది.
ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సిద్ధం అవుతున్నాయి. 22A, ఫీజ్‌రీయింబర్స్‌మెంట్, ఉద్యోగులు, జాబ్‌క్యాలెండర్‌పై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు రెడీ అయ్యారు. లెజిస్లేటివ్ పార్టీ సమావేశాలు నిర్వహించి MLAలు, MLCలకు దిశానిర్దేశం చేశారు. ప్రజాసమస్యలే ప్రధాన ఎజెండాగా అసెంబ్లీలో చర్చించాలని సూచించారు. BRSLP సమావేశం KCR ఫాంహౌజ్‌లో జరగగా… నాంపల్లి BJP ఆఫీస్‌లో BJLP మీటింగ్ జరిగింది. ఈ సెషన్స్‌కి సైతం KCR దూరంగా ఉండేలా కనిపిస్తున్నారు. ప్రతిపక్షాల ప్రశ్నలను ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార కాంగ్రెస్ రెడీ అవుతోంది. KCR అసెంబ్లీకి రావాలని లేకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు హస్తం నేతలు. కేంద్ర నిధులపై BJPని కాంగ్రెస్ ఎండగట్టనుంది. కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న తెలంగాణ పాలిటిక్స్… అసెంబ్లీ వింటర్ సెషన్స్‌తో హీట్ పెరగనుంది. అధికార, ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణ పాలిటిక్స్ రంజుగా మారనున్నాయి.
Alsop read: హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బస్సు, మెట్రోకు ఒకే పాస్!