E-Paper
Advertisement

క్షణికావేశంలో ముగిసిన కుటుంబ కథ.. పశ్చిమ గోదావరిలో కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన!

క్షణికావేశంలో ముగిసిన కుటుంబ కథ.. పశ్చిమ గోదావరిలో కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన!
Advertisement

West Godavari: ఒక క్షణం.. ఒక్క చిన్న నిర్ణయం.. ఆ కుటుంబం కథనే ముగిసేలా చేసింది. కన్నపేగుల్ని కడతేర్చి, తండ్రీ తాను కూడా ఆనంతలోకి వెళ్లిపోయిన గుండెల్ని పిండేసే విషాదం ఇది. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వశిష్ట గోదావరి బ్రిడ్జ్‌పై సంచలనం సృష్టించిన సామూహిక ఆత్మహత్యల మిస్టరీ వీడింది. నదిలో మూడు మృతదేహాలు తేలాయి. గోదావరిలో గాలింపు చర్యలు ముగిశాయి.

బ్రిడ్జ్ మీద పడి ఉన్న చెప్పులు..

అది వశిష్ట గోదావరి బ్రిడ్జ్.. ఆకాశం నీలంగా ఉంది, కానీ ఆ కుటుంబం మనసు మాత్రం నల్లటి కటిక చీకట్లోకి వెళ్లిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వంతెన పైకి వచ్చారు ఆ ముగ్గురు. క్షణం ఆలోచించలేదు.. కనీసం కన్న పిల్లల మొహాలు కూడా చూడలేదు. ఆ నీళ్లలోకి దూకేశారు. బతకాల్సిన జీవితాలు, చూడాల్సిన లోకం అలా గోదావరి అడుగున కలిసిపోయాయి. బ్రిడ్జ్ మీద పడి ఉన్న చెప్పులు, ఆ సైలెన్స్.. అక్కడ ఏదో పెద్ద ఘోరం జరిగిందని అప్పటికే నైట్ మేర్‌లా వణికిస్తూనే ఉంది.

Advertisement

Also read: టికెట్ గెలుచుకొని వచ్చా.. కప్పు తీసుకొని పోతా.. మూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఝాన్సీ!

మూడు డెడ్ బాడీలు..

గోదావరి ఉధృతికి గాలింపు చర్యలు నూటికి నూరు శాతం టఫ్‌గా మారాయి. అయినా సరే, పోలీస్‌ డిపార్ట్‌మెంట్ ఊరుకోలేదు. రంగంలోకి దిగాయి హై స్పీడ్ ఎయిర్‌ బోట్లు. ఫైర్ సిబ్బంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వాటర్ వేవ్స్‌ను చీల్చుకుంటూ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. డీప్ వాటర్‌లో గాలించిన రెస్క్యూ టీమ్స్ కి బాడీస్‌ ఆచూకీ దొరికింది. డాక్టర్లు, పోలీసుల టెన్షన్‌ను పెంచుతూ ఫైనల్లీ ఆ మూడు డెడ్ బాడీలు ఒక్కటొకటిగా నీటి ఉపరితలానికి వచ్చాయి. ఆ దృశ్యం చూసిన వాళ్ల గుండెలు పగిలిపోయాయి.

కన్న తండ్రే కాలయముడై..

Advertisement

అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం దిండి సమీపంలోని గోదావరి నీళ్లలో తేలిన ఆ మృతదేహాలను గుర్తించారు. నంబూరి శ్రీనివాస్, అతని కుమారుడు ఈశ్వర్, గారాబంగా పెంచాల్సిన కుమార్తె నిత్యశ్రీ.. ఆ ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కన్న తండ్రే కాలయముడై ఆ పసివాళ్ల ప్రాణాలు తీసేస్తే, ఆ దేవుడికి కూడా దయ రాలేదా..? పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఇలా ప్రాణాలు తీసుకునే రైట్ ఆ తండ్రికి ఎవరిచ్చారు..? కూతురిని, కొడుకుని బలి ఇచ్చి, తను కూడా తనువు చాలించిన ఈ దారుణాన్ని చూస్తుంటే.. ఛీ, జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఫైర్ సిబ్బంది ఆ డెడ్ బాడీలను ఒడ్డుకు చేర్చడంతో ఈ విషాద ఘటనకు ఒక క్లైమాక్స్ దొరికింది. అసలు ఆ తండ్రి ఇంతటి డెసిషన్‌ ఎందుకు తీసుకున్నాడో పోలీసులే తేల్చాలి.

Also read: సీఎం రేవంత్ వ్యూహం వర్సెస్ బీఆర్ఎస్ కౌంటర్.. తెలంగాణ అసెంబ్లీలో ఏం జరగబోతోంది?

Tags

Related News

జమ్మలమడుగు పాలిటిక్స్‌లో రగులుతున్న పోలిటికల్ వార్.. బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ మధ్య కోల్డ్ వార్!

సీఎం రేవంత్ వ్యూహం వర్సెస్ బీఆర్ఎస్ కౌంటర్.. తెలంగాణ అసెంబ్లీలో ఏం జరగబోతోంది?

తెలంగాణలో ఈవీ వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టులు.. టెట్ క్వాలిఫికేషన్‌పై ప్రశ్నలు

కాంగ్రెస్ వ్యూహంలో గట్టిగా చిక్కుకున్న బీఆర్‌ఎస్.. కల్వకుంట్ల కవిత సంచలనం

సర్కార్‌కు ఎంప్లాయీస్ టెన్షన్.. తగ్గేదే లే అంటున్న తెలంగాణ ఉద్యోగులు!

తెలంగాణ శాసనసభ సమావేశాల వేళ గులాబీ దళంలో ఉత్కంఠ.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా..?

Big Stories

Advertisement
×