E-Paper
Advertisement

ఇండియా, పాకిస్తాన్ మ‌ధ్య ట్రై సిరీస్‌…ఐసీసీ ప్లాన్ అదుర్స్‌

ఇండియా, పాకిస్తాన్ మ‌ధ్య ట్రై సిరీస్‌…ఐసీసీ ప్లాన్ అదుర్స్‌
Advertisement

India, Pakistan Tri-Nation Series: క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC). ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ (India, Pakistan To Clash In Tri-Nation Series) తరహాలోనే మరో మల్టీ నేషనల్ టోర్నమెంట్ నిర్వహించేందుకు ఐసీసీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో  ( PCB) పాటు బీసీసీఐతో (BCCI) చర్చలు జ‌రిపేందుకు సంసిద్దం అయింది ఐసీసీ. రెండు దేశాల మధ్య మ్యాచులు జరిగితే కోట్లల్లో వర్షం కురవడం గ్యారెంటీ. ప్రస్తుతం ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు కాబట్టి… మల్టీ నేషనల్ టోర్నమెంట్ నిర్వహించి క్యాష్ చేసుకోవాలని చూస్తోంది ఐసీసీ. దీని కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఇండియా, పాకిస్తాన్ మ‌ధ్య ట్రై సిరీస్ జ‌రిగే ఛాన్స్

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India Vs Pakistan) మధ్య మ్యాచ్ అంటే జనాలు ఎగబడి చూస్తారు అన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ద్వైపాక్షిక సిరీస్ లు ఈ రెండు దేశాల మధ్య జరిగేవి. కానీ 2008 సమయంలో జరిగిన ఉగ్రదాడులు నేపథ్యంలో… ద్వైపాక్షిక సిరీస్ లు పూర్తిగా రద్దు అయ్యాయి. అటు ఐపీఎల్లో కూడా పాకిస్తాన్ ప్లేయర్లు ఆడకుండా బీసీసీఐ ఆంక్షలు విధించింది. కేవలం ఐసీసీ టోర్నమెంట్లలో అటు ఆసియా కప్ లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి.

Advertisement

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

అయితే ఇక పైన అలా కాకుండా.. ప్రతి ఏడాది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లో ఉండేలా మల్టీ నేషనల్ టోర్నమెంట్ కు (PAK v IND – MULTI-NATIONAL TOURNAMENT) నాంది పలుకుతోంది ఐసీసీ. ఇందులో పాకిస్తాన్, టీమిండియా తో పాటు మరో రెండు దేశాలు ఉండే ఛాన్స్ ఉన్నాయి. లేదా మరొక జట్టును యాడ్ చేసి ట్రై సిరీస్ నిర్వహించాలనే ఆలోచన చేస్తోంది. అయితే మిగతా రెండు దేశాలు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా అని సమాచారం. ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్ లో నిర్వహించాలా ? లేదా వన్డే ఫార్మాట్ లో నిర్వహించాలా ? అనే దానిపైన కసరత్తులు జరుగుతున్నాయి.

దుబాయ్ వేదికగా ఇండియా వ‌ర్సెస్ పాక్ ట్రై సిరీస్‌

Advertisement

దుబాయ్ లో సెప్టెంబర్ 22, 23 తేదీలలో ఐసీసీ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఇందులో మొత్తం టెస్టులో ఆడే 12 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య నిర్వహించాలనుకున్న మల్టీ నేషనల్ టోర్నమెంట్ గురించి చర్చ జరగనుంది. ఒకవేళ ఈ టోర్నమెంట్ కు లైన్ క్లియ‌ర్ అయితే, యూఏఈ, ఇంగ్లాండ్ లేదా ఆస్ట్రేలియాలో నిర్వహించేలా ప్లాన్ చేసే ఛాన్స్‌లు క‌నిపిస్తున్నాయి. ఈ మూడింటిలో ఏదో ఒక వేదిక ఫైన‌ల్ కానుంది.

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

 

Related News

ఇప్పుడే సంబ‌రాలు చేసుకోకండి..ఫైన‌ల్స్ లో ప్ర‌తీకారం తీర్చుకుంటాం

పాకిస్తాన్ జ‌ట్టులోనూ కోటీశ్వరులు…షోయ‌బ్ అక్త‌ర్ నుంచి బాబ‌ర్ వ‌ర‌కు ఎవ‌రి ఆస్తులు ఎంతంటే ?

రియాజ్.. నీకు బుర్ర ఉందా ? 55 ప‌రుగుల చేసిన పాకిస్తాన్, ఎలా ఆసియా క‌ప్ కొడుతుంది ?

పాకిస్తాన్ ఘోర ఓట‌మి…హుటా హుటిన‌ దుబాయ్ వెళ్లిన న‌ఖ్వీ..!

టీమిండియా చేతిలో ఓడినా, ఆసియా కప్ గెలుస్తాం – పాక్ కోచ్ సంచలనం

వైభ‌వ్ ఓవ‌రాక్ష‌న్‌..మ్యాచ్ మ‌ధ్య‌లో తిల‌క్ వ‌ర్మ‌కు స్ట్రాంగ్ వార్నింగ్

లైవ్ మ్యాచ్ లో బ‌రితెగించిన పాక్ ఫ్యాన్స్‌…”క్రాంతి గౌడ్” మ‌గాడంటూ కేక‌లు !

Big Stories

Advertisement
×