Big Stories

CSK vs SRH IPL 2024 Preview: ఎవరు విజృంభిస్తారు? నేడు చెన్నై వర్సెస్ హైదరాబాద్ మధ్య మ్యాచ్

CSK vs SRH IPL 2024 Match Prediction: ఐపీఎల్ లో దూకుడైన ఆటతీరుకు మారుపేరుగా నిలిచిన హైదరాబాద్ తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయింది. ఒక్కసారి దాని రైజింగ్ చల్లారిపోయింది. మరిప్పుడు ముందులా ఆడుతుందా? లేక మళ్లీ తడబడుతుందా? అని అందరి మదిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ తో చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 కి మ్యాచ్ జరగనుంది.

- Advertisement -

మొన్నటి వరకు టాప్ 4లో ఉన్న చెన్నై ప్రస్తుతం 6వ స్థానానికి పడిపోయింది. 8 మ్యాచ్ లు ఆడింది. 4 గెలిచి, 4 ఓడింది. ఇక హైదరాబాద్ అయితే 8 మ్యాచ్ లు ఆడి 5 గెలిచింది. 3 ఓడింది. దీంతో మూడో స్థానంతో దోబూచులాడుతోంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 20 మ్యాచ్ లు జరిగాయి. చెన్నయ్ 14 సార్లు గెలిస్తే, హైదరాబాద్ 6 సార్లు మాత్రమే విజయం సాధించింది.

- Advertisement -

Also Read: నేడు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఆర్సీబీ

చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే వారి బౌలింగ్ సడన్ గా వీక్ గా మారిపోయింది. బ్యాటింగ్ లో కెప్టెన్ రుతురాజ్ ఆదుకుంటున్నాడు. ఆజ్యింక రహానె మొదట్లో బాగా ఆడాడు. తర్వాత త్వరగా అవుట్ అయిపోతున్నాడు. డేరి మిచెల్, రవీంద్ర జడేజా, శివమ్ దుబె, ఎంఎస్ ధోనీ అంతా పటిష్టంగా కనిపిస్తున్నారు.

కానీ బౌలింగ్ వద్దకు వచ్చేసరికి పెద్ద లక్ష్యాలను కూడా కాపాడలేకపోతున్నారు. ప్రత్యర్థులు కొడుతున్నకొద్దీ అవే బాల్స్ వేస్తున్నారు. దాంతో గెలవాల్సిన మ్యాచ్ లు కూడా చెన్నయ్ ఓడిపోయింది. మరి ఈ బలహీనత నుంచి బయటపడుతుందా? లేదా అన్నది చూడాలి.

హైదరాబాద్ మొన్నటి వరకు ఇరగదీసి ఆడారు. అదే మంత్రం ఆర్సబీ మీద పనిచేయలేదు. దీంతో అరవీర భయంకరంగా రెచ్చిపోతున్న హైదరాబాద్ కి ముక్కుపిండి మూలన కూర్చోబెట్టిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఇప్పుడు చెన్నై తో ఎలా ఆడుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ధనాధన్ బ్యాటింగ్ కి సన్ రైజర్స్ కొత్త నిర్వచనం చెప్పారు. బౌలింగులో కూడా బలంగానే కనిపిస్తున్న సన్ రైజర్స్ నేటి మ్యాచ్ లో ఎలా ఆడుతుందో వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News