Big Stories

CM Revanthreddy chitchat: లోగుట్టు బయట పెట్టిన సీఎం, కారు.. కాకపోతే..

CM Revanthreddy latest news(Congress news telangana): తెలంగాణలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏం జరగబోతోంది? ఏ పార్టీ మెజార్టీ సీట్లను సొంతం చేసుకోనుంది? అధికార కాంగ్రెస్, బీజేపీయా? లేక విపక్ష బీఆర్ఎస్ పార్టీయా? తాము ఈసారి డబుల్ డిజిట్ చేరుకుంటామని కమలనాధులు చెబుతున్నారు. వీటిలోని కొన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.

- Advertisement -

ఈసారి 2004 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని మనసులోని మాట బయటపెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ఈసారి కచ్చితంగా సికింద్రాబాద్ సీటును తాము గెలుచుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. సికింద్రాబాద్ ఎంపీ సీటు ఏ పార్టీ గెలుస్తుందో.. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ నేతల్లో బలంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఒక్కసీటు రాదన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఎక్కువ సీట్లలో మూడో స్థానానికి.. రెండు మూడు చోట్ల సెకండ్‌ ప్లేస్‌లో ఉండవచ్చని సూచనప్రాయంగా చెప్పుకొచ్చారు.

- Advertisement -

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 సీట్లను గెలుచుకుంటుందని కేసీఆర్ పదేపదే చెప్పిన విషయాన్ని ఇక్కడ గుర్తుచేశారు ముఖ్యమంత్రి రేవంత్. తాను చెప్పడం కంటే ఫలితాలు ఎలా ఉంటాయో మీరు చూస్తారన్నారు. మే ఫస్ట్ వీక్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రియాంక, చీఫ్ ఖర్గే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు.

ALSO READ: తెలంగాణ లోక్ సభ బరిలో తమిళ పార్టీ.. ఏ ఏ స్థానాల్లో పోటీ చేస్తుందంటే?

ఎంఐఎం-బీజేపీ మధ్య అవగాహన లేకపోతే హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా హిందూ అభ్యర్థిని బీజేపీ ఎలా నిలబెట్టిందన్నారు సీఎం. ఎంఐఎం అభ్యర్థిని ఓడించాలన్న వ్యూహమే బీజేపీకి లేదన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తెలంగాణకు మంచి పాలనను అందించామన్న సీఎం రేవంత్‌రెడ్డి,  కేవలం నాలుగు నెలల్లో వేల కోట్లకు వడ్డీ చెల్లించామన్నారు. 2021లోనే కాళేశ్వరంలో లోపాలు గుర్తించారని, ఈ విషయం బయటకు రాకుండా కేసీఆర్ జాగ్రత్త పడ్డారన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News