BigTV English

Lal Salaam: చిక్కుల్లో లాల్ సలామ్.. ఎంత పని చేసావ్ ఐశ్వర్య.. నీ వలనే ఇదంతా.. ?

Lal Salaam: చిక్కుల్లో లాల్ సలామ్.. ఎంత పని చేసావ్ ఐశ్వర్య.. నీ వలనే ఇదంతా.. ?


Lal Salaam: కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చిన స్టార్స్ లో రజినీకాంత్ ఒకరు. బస్సు కండక్టర్ నుంచి తలైవా గా మారడానికి ఆయన పడిన కష్టాలు, అవమానాలు అన్ని ఇన్ని కావు. ఎంతో ఆస్తిని కూడబెట్టాడు.. కానీ తన పిల్లల జీవితాలను సరిదిద్దలేకపోయాడు. అంటే కెరీర్ పరంగా కూతుళ్లను స్టార్స్ గా మార్చలేకపోయాడు. రజినీకి ఇద్దరు కూతుళ్లు.. సౌందర్య రజినీకాంత్, ఐశ్వర్య రజినీకాంత్. ఇద్దరూ.. ఇండస్ట్రీలో ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, అది మాత్రం జరగడం లేదు. ఇక కూతుళ్ళ కోసం రజినీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే ఐశ్వర్య.. నిర్మాతగా, డైరెక్టర్ గా మారి పలు సినిమాలు తీసింది. అందులో ఏ ఒక్కటి ఆమెకు సక్సెస్ ను అందివ్వలేకపోయింది. ఇక ధనుష్ తో విడిపోయాక.. మరోసారి తన దర్శకత్వ ప్రతిభను చూపిస్తాను అంటూ.. లాల్ సలామ్ సినిమాను తెరకెక్కించింది.

జైలర్ లాంటి హిట్ సినిమా తరువాత రజినీ కూతురు కోసం ఈ సినిమాను చేయక తప్పలేదు. స్పోర్ట్స్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో విష్ణు విశాల్. విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటించగా.. కపిల్ దేవ్, జీవిత రాజశేఖర్ గెస్ట్ రోల్స్ లో మెరిశారు. ఎన్నో అంచనాల మధ్య ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా నెగెటివ్ టాక్ ను తెచ్చుకుంది. కథ బాగానే ఉన్నా.. మధ్యలో అర్ధం పర్థం లేని సీన్స్.. రజినీ ఎలివేషన్స్ తప్ప ఏమి లేదని పెదవి విరిచేశారు. ఇక ఈ సినిమా నెగెటివ్ టాక్ గురించి ఐశ్వర్య.. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ” అసలు సినిమా ఇది కాదు. సినిమా మొత్తంలో 21 రోజుల ఫుటేజ్ మిస్ అయ్యింది. అది ఉండి ఉంటే.. లాల్ సలామ్ హిట్ అయ్యేది” అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆమె మాటలే లాల్ సలామ్ ను చిక్కులో పడేసింది.


సినిమా రిలీజ్ అయ్యి రెండు నెలలు అవుతుంది. ఇప్పటివరకు రెండు సార్లు ఈ సినిమా ఓటిటీ డేట్ ను మార్చారు. అయినా ఈ సినిమా ఓటిటీలో వచ్చింది లేదు. ఎందుకు అంటే.. ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్.. ఐశ్వర్య ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు విని.. ఆ 21 రోజుల ఫుటేజ్ ఇస్తేనే సినిమాను ఓటిటీలో రిలీజ్ చేస్తామని, లేదంటే చేయమని చెప్పుకొచ్చారంట. అందుకే ఇంకా ఈ సినిమా ఓటిటీలోకి రాలేదని సమాచారం. సినిమా పోయినా కూడా కనీసం ఓటిటీలోకి వస్తే డబ్బులు అయినా వచ్చేవి. ఇప్పుడు ఐశ్వర్య చెప్పిన మాటలు వలన అది కూడా పోయింది..ఎంత పని చేసావ్ ఐశ్వర్య.. నీ వలనే ఇదంతా.. అని అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు ఓటిటీ బాట పడుతుందో చూడాలి.

Related News

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Big Stories

×