MP Bandi Sanjay: బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్.. ఇకనైనా సొంత పార్టీపై ఘాటు స్టేట్‌మెంట్లు ఆపుతారా? ఆయనతో బండి సంజయ్ భేటీ.. పార్టీతో సంధి కోసమా? ఎన్నికల స్టంట్ ఏమైనా ఉందా? అసలు.. బండి సంజయ్ వ్యూహమేంటి? రాజాసింగ్ రియాక్షన్ ఏంటి? ఇన్నాళ్లూ లేని భేటీ.. ఇప్పుడే ఎందుకు జరిగింది?
రాజాసింగ్‌లో అసహనం బండి ఎంట్రీతో చల్లారిందా?
భారతీయ జనతా పార్టీపై రాజాసింగ్‌లో టన్నుల్లో పేరుకుపోయిన అసంతృప్తి, అసహనమంతా.. బండి సంజయ్ ఎంట్రీతో చల్లారిపోయిందా? ఇక.. రూటు మార్చి.. యాక్టివ్ అయిపోతారా? అసలు.. బండి సంజయ్.. రాజా సింగ్‌ని ఎందుకు కలిశారు? దీని వెనుక పార్టీ ఆదేశాలున్నాయా? సొంత ఎజెండా ఏమైనా ఉందా? ఇదే.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
నాయకత్వంతో పాటు క్యాడర్‌లోనూ అనేక సందేహాలు
కొన్నాళ్లుగా సొంత పార్టీ నాయకత్వంపై ఏకధాటిగా విమర్శలు చేస్తున్న రాజాసింగ్ లాంటి నేతని.. బండి సంజయ్ ఇంటికెళ్లి మరీ పొగిడారు. ఈ పరిణామాన్ని బీజేపీలోనే ఎవరూ ఊహించలేదు. దాంతో.. పార్టీ నాయకత్వంతో పాటు క్యాడర్‌లోనూ అనేక సందేహాలు తలెత్తుతున్నాయ్. దీని వెనకున్న రాజకీయం ఏంటా? అనే ఆలోచనతో పడిపోయారు బీజేపీ శ్రేణులు. కానీ.. ఎంత ఆలోచించినా.. దీని వెనకున్న లెక్కేంటో ఎవ్వరికీ అర్థం కావట్లేదు.
సంజయ్ తన వర్గాన్ని కూడగట్టుకుంటున్నారనే చర్చ
ఇక.. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ఈటల రాజేందర్ పేరు బలంగా వినిపిస్తోందనే చర్చ మొదలైంది. దాంతో.. బండి సంజయ్ ముందే అలర్టై.. తన వర్గాన్ని కూడగట్టుకుంటున్నారనే చర్చ సాగుతోంది. అందులో భాగంగానే.. బండి హనుమాన్ జయంతి రోజు రాజాసింగ్‌తో ఆయన భేటీ అవడం చర్చనీయాంశమైంది. అంతేకాదు.. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. ఆ పార్టీ సీనియర్ నేత గౌతమ్ రావును ప్రకటించడాన్ని కూడా రాజాసింగ్ వ్యతిరేకించారు. ఆయన్ని.. టేబుల్స్ తుడిచే నేత అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గౌతమ్ రావుతో రాజాసింగ్‌కు సంధి కుదిర్చిన బండి సంజయ్!
గౌతమ్ రావుని పాతబస్తీలోకి అడుగు పెట్టనివ్వనని సంచలన కామెంట్లు చేశారు. కానీ.. బండి ఎంట్రీ ఇచ్చి.. అదే గౌతమ్ రావుతో రాజా సింగ్‌కు సంధి కుదిర్చారు. దాంతో.. తన బలగాన్ని పెంచుకునే పనిలో బండి సంజయ్ ఉన్నారనే చర్చ బీజేపీ వర్గాల్లో సాగుతోంది. ఈటలను అధ్యక్షుడిగా వ్యతిరేకిస్తున్న బండి.. గ్రౌండ్ లెవెల్‌లో ఆయనపై వ్యతిరేకతని సైతం కూడగడుతున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. ఆ లెక్కన.. రాజాసింగ్‌ని కేవలం ఎన్నికల కోసమే ఉపయోగించుకుంటున్నారా? అనే డౌట్ కూడా తలెత్తుతోంది.
Also Read: టార్గెట్@మోదీ ఇలాకా..! విజయ యాత్రకు సంకల్పం.. గెలుపు గుర్రాలకు టిక్కెట్లు
గతంలో రాజాసింగ్ వ్యాఖ్యాల్ని పట్టించుకోని బండి సంజయ్
రాజాసింగ్ గతంలో ఎన్ని సార్లు పార్టీ నేతలపై.. ఎన్ని రకాల వ్యాఖ్యలు చేసినా.. బండి సంజయ్ ఎప్పుడూ పట్టించుకోలేదు. పార్టీ రాజాసింగ్‌ని సస్పెండ్ చేసినా.. ఏ ఒక్క నేత ఆయన్ని పరామర్శించలేదు. కానీ.. ఉన్నఫలంగా బండి సంజయ్.. రాజా సింగ్‌తో భేటీ కావడం ఎన్నికల స్టంటేననే చర్చ సాగుతోంది. మొన్నటివరకు.. సొంత పార్టీపై ఘాటు విమర్శలతో గందరగోళం సృష్టించిన రాజాసింగ్.. బండి సంజయ్ బుజ్జగింపుతోనైనా.. పార్ట లైన్‌లో ఉంటారా? లేక.. ఎప్పటిలాగే అధినాయకత్వాన్ని ఏకిపారేస్తారా? అనేది ఆసక్తి రేపుతోంది.