BigTV English

Telugu organizations in USA: సంఘాల పేర్లతో చెత్త పనులు.. చిక్కుల్లో అమెరికన్ తెలుగోళ్లు!

Telugu organizations in USA: సంఘాల పేర్లతో చెత్త పనులు.. చిక్కుల్లో అమెరికన్ తెలుగోళ్లు!

Telugu organizations in USA: ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న మాటలు ఇప్పుడు అక్కరకు రాకుండా పోతున్నాయా? అమెరికాలో ఉన్న తెలుగు సంఘాల్లో లుకలుకలు, ఆర్థిక అవకతవకలు, తెలుగు వాళ్ల బ్లాక్ మెయిలింగ్ దందాలు ఒక్కటేమిటి అన్నీ సంఘాల మెడకు చుట్టుకుంటున్నాయి. కోర్టులు, FBI దర్యాప్తుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. అందులో ఎంతో ఘనకీర్తి సంపాదించిన తానా చుట్టూ ఇప్పుడు నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. కొందరు చేసిన పనికి అందరికీ మచ్చ తెచ్చే పరిస్థితి దాపురించింది.


తెలుగు సంఘాల మాటున ఏం జరుగుతోంది?

అమెరికా లాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ప్రతిభావంతులకు అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తూ, పోషిస్తున్న దేశం. మరి దేశం కాని దేశం వెళ్లి ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తున్నవారు ఏం చేయాలి… మాతృదేశం పేరు నిలబెట్టాలి. కానీ అమెరికాలో తెలుగు సంఘాల మాటున ఏం జరుగుతోంది? లూప్ హోల్స్ ఉన్నాయి కదా అని వాడితే ఏం జరుగుతుందో ఆ మాత్రం కనిపెట్టలేకపోతున్నారా? అంటే అవునన్న సమాధానమే వస్తోంది.


185 తెలుగు టెకీలను తీసేసిన యాపిల్ కంపెనీ

తాజాగా యాపిల్ కంపెనీలో పని చేస్తున్న 185 మంది తెలుగు టెకీలను ఆ కంపెనీ ఉద్యోగాల నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించడంతో అసలు ఏం జరిగిందన్న స్టోరీ మొదలైంది. అక్కడితో మ్యాటర్ ఆగలేదు. విరాళాలు పొందిన తానాకు FBI, కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్ట్‌ నోటీసులు జారీ చేయడం, పూర్తి వివరాలతో హాజరు కావాలని చెప్పడంతో ఒక్కసారిగా మ్యాటర్ బ్లాస్ట్ అయింది.

US తెలుగు సంఘాల చిత్తశుద్ధికి ఇది పరీక్షా కాలం

అమెరికాలోని తెలుగు సంఘాలు చేస్తున్న కథలన్నీ ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. కొందరు చేసిన, చేస్తున్న పనులకు సంఘాలకు సంఘాలే తలదించుకోవాల్సిన సీన్లు క్రియేట్ అవుతున్నాయి. ఇందుకు దశాబ్దాల ఘన చరిత్ర ఉన్న తానా అతీతమేమీ కాదు. ఆ సంస్థలో ఒక మాజీ సభ్యుడు తన సొంత కంపెనీకి చేసుకున్న నిధుల మళ్లింపు ఇప్పటికే FBI దాకా వెళ్లింది. మ్యాటర్ దర్యాప్తులో ఉంది. రికవరీ చేస్తున్నారు.

ఓవైపు FBI, ఇంకోవైపు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్

ఇప్పుడు అంతకు మించిన కథలు అమెరికాలోని తెలుగు అసోసియేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఓవైపు ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్, ఇంకోవైపు US ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ రంగంలోకి దిగడంతో మ్యాచింగ్ గ్రాంట్ ప్రోగ్రామ్ ద్వారా విరాళాలు అందుకుంటున్న తెలుగు అసోసియేషన్ల కథ మొత్తం మారిపోతోంది.

అమెరికాలో విపరీతంగా పుట్టుకొచ్చిన తెలుగుసంఘాలు

అమెరికాలో తెలుగు సంఘాలకు లెక్కలేదు. ముందు తానా, నాటా, ఆటా, టాటా ఇలాంటివి కొన్నే ఉండేవి. కానీ రాను రాను గల్లీకో తెలుగు సంఘం అన్నట్లుగా సీన్ మారిపోయింది. ఎందుకంటే కులాల కుంపట్లు, పైచేయి తమదే ఉండాలన్న ఆధిపత్య ధోరణితో విపరీతంగా తెలుగు సంఘాలు పుట్టుకొచ్చాయి. ఇందులో ఎవరి సీన్ వారిదే. ఈ సంఘాలు నిత్యం నిధుల వేటే లక్ష్యం అన్నట్లుగా డీలింగ్స్ చేయడం మొదలు పెట్టాయి. మొత్తం ఫండ్ రైజింగ్ చుట్టూనే వీటి మ్యాటర్ తిరుగుతుందంటే ఆశ్చర్యపోనవసరం లేదు.

నిధుల కోసం కొందరు గేమ్ ప్లాన్ చేశారా?

నిజానికి అమెరికా వచ్చే తెలుగు వారికి ఏ కోర్సులు, ఏ యూనివర్శిటీలు బాగున్నాయి. ఉద్యోగ కల్పన, అమెరికాలో ఉన్న తెలుగు వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేయడం, ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని త్వరగా ఇండియాకు పంపడం, ఎవరైనా న్యాయపరమైన చిక్కుల్లో ఉంటే వారికి లీగల్ హెల్ప్ చేయడం, అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడం ఇలాంటివెన్నో చేయాలి. ఇవి చేయాలంటే నిధులు కావాలి. మరి వందలాదిగా ఉన్న అమెరికా తెలుగు సంఘాలకు పెద్ద మొత్తంలో నిధులు విరాళంగా ఇచ్చేదెవరు? సరిగ్గా అక్కడే గేమ్ ప్లాన్ మొదలు పెట్టారా అన్న చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది.

విరాళాలు పొందిన సంస్థలు ఇరుక్కునే పరిస్థితి

సొంతలాభం కొంత చూసుకోకుండా ఎవరూ ఏ సేవా కార్యక్రమాలూ చేయరు. విరాళం ఇస్తే తీసుకోవాలి. కానీ లూప్ హోల్ ఉంది కదా అని వాడేయకూడదు. ఎవరికీ దొరకబోమనుకునే ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు పనికిరాదు. మరి అమెరికా తెలుగు సంఘాలు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యాయో అర్థం కాని పరిస్థితి. అసలే అమెరికా.. ఆర్థిక మోసాలను అక్కడి దర్యాప్తు సంస్థలు పసిగట్టలేవనుకున్నారా.. లైట్ తీసుకున్నారా.. తాము చేసింది బయటకు రాదనుకున్నారో ఏమోగానీ.. ఫైనల్ గా టైమ్ వచ్చేసింది. అమెరికా తెలుగు సంఘాల్లోని కొందరు చేసిన పనికి విరాళాలు ఇచ్చినట్లు నటించిన వారు, తమ కంపెనీలను బోల్తా కొట్టించిన వారు, విరాళాలు పొందిన సంస్థలు ఇప్పుడు అన్నీ మూకుమ్మడిగా ఇరుక్కునే పరిస్థితి దాపురించింది.

యాపిల్ లో 185 మంది తెలుగు టెకీల పోస్టులు గల్లంతు

యాపిల్ కంపెనీలో సీనియర్ మేనేజర్ క్యాడర్ నుంచి ఎంట్రీ లెవల్ ఎగ్జిక్యూటివ్‌ల వరకు మొత్తం 185 మంది తెలుగు ఉద్యోగుల్ని తొలగించారు. కారణం యాపిల్ మ్యాచింగ్ గ్రాంట్ ప్రోగ్రామ్ ను దుర్వినియోగం చేయడమే. ఇదే ఏంటో ఇప్పుడు చూద్దాం. అమెరికాలో ఒక కార్పొరేట్ సంస్థలో పని చేసే ఉద్యోగి ఏదైనా స్వచ్చంద సంస్థకు విరాళం ఇచ్చారనుకుందాం. అప్పుడు ఆ సదరు కంపెనీ కూడా ఉద్యోగుల్లో ఇలా దాతృత్వ భావన పెంచేందుకు అంటే విరాళాలు క్రమం తప్పకుండా ఇవ్వాలని ప్రోత్సహించే క్రమంలో ఉద్యోగి ఎంత నిధిని డొనేట్ చేస్తాడో.. అంతే మొత్తం సదరు కార్పొరేట్ సంస్థ కూడా అదే ngoకి నిధులు విరాళంగా ఇస్తుందన్న మాట.

అవకతవతకు గుర్తించిన యాపిల్ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్

చెప్పాలంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ మాదిరే. కానీ ఇందులో కంపెనీ ఆశయం గొప్పది. అయితే అదే లూప్ హోల్ ఉపయోగించిన కొందరు.. తెలిసిన తెలుగు ఉద్యోగులతో ఇలా డబ్బులు విరాళంగా ఇస్తున్నట్లు ట్రాన్స్ ఫర్ చేయడం.. సదరు కంపెనీ కూడా ట్రాన్స్ ఫర్ చేయగానే వాళ్ల డబ్బులు వాళ్లకు తిరిగి ఇచ్చేయడం ఇలాంటి కథలు జరిగాయి. ముఖ్యంగా యాపిల్ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ఇందులో ఏదో రింగ్ నడుస్తోందని అనుమానించింది. వెంటనే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ కు కంప్లైంట్ చేసింది. అందులో భాగంగానే ఈ స్కాం మొత్తం బయటపడింది.

తానాకు నోటీసులు జారీ చేసిన కాలిఫోర్నియా కోర్టు

అమెరికా తెలుగు సంఘాల్లోని కొందరు ఇలాంటి లూప్ హోల్స్ ద్వారా ఫండింగ్ పొందేందుకు చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరినీ తలదించుకునేలా చేసిందంటున్నారు. చెప్పాలంటే అమెరికాలోని తెలుగు సంఘాలకు ఇది చాలా కష్టకాలం. ఎలా అంటే.. తానాకు కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్ట్‌ నోటీసులు జారీ చేసింది. తానాకు సంబంధించిన మొత్తం సమాచారంతో కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఆ సమాచారాన్ని FBIకి కూడా మెయిల్‌ చేయాలని ఆదేశించింది. ఫిజికల్ డాక్యుమెంట్లతో పాటు, ఎలక్ట్రానిక్‌ డేటా కూడా తీసుకురావాలన్న కోర్టు.. ప్రతి లావాదేవీకి సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆదేశించింది. కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్ట్‌ ఆదేశాలు ఇప్పుడు అమెరికా తెలుగు కమ్యూనిటీలో చర్చనీయాంశంగా మారాయి.

తెలుగువారంటేనే హడలిపోయే సీన్ క్రియేట్ అయిందా?

ఇప్పుడు అమెరికాలో తెలుగు వారి పరిస్థితి ఏంటంటే.. అన్ని కార్పొరేట్ కంపెనీలు ఈ బ్యాక్ గ్రౌండ్ నుంచి ఎవరైనా వస్తే అలర్ట్ గా ఉండే పరిస్థితిని తీసుకొచ్చాయి. సామాజిక సేవ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ఏర్పడ్డ అమెరికా తెలుగు సంఘాలు ఇప్పుడు మనోళ్లకు దారులు మూసేసే పరిస్థితి తీసుకొచ్చాయా అన్న చర్చ జరుగుతోంది. 2018లో ఓ తెలుగు అసోసియేషన్‌కు చెందిన కీలక వ్యక్తి ఈ మ్యాచింగ్ గ్రాంట్స్ మోసానికి పాల్పడ్డాడని, ఆ తర్వాత చాలా తెలుగు సంఘాలు కూడా అదే బాటలో నడిచాయని, అందుకే ఇప్పుడు పరిస్థితి రోడ్డున పడిందన్న టాక్ నడుస్తోంది.

గూగుల్ టేకవుట్, వాట్సప్ మెసేజెస్, ఈమెయిల్స్, బ్యాంక్ స్టేట్ మెంట్స్

మేం చేయలేదు.. మాకు తెలియదు.. సంబంధం లేదు అనడానికి వీల్లేదు. గూగుల్ టేకవుట్, వాట్సప్ మెసేజెస్, ఈమెయిల్స్, బ్యాంక్ స్టేట్ మెంట్స్ ఇవన్నీ ఆధారాలు ఉంటాయి. ఫండింగ్ ఎలా బెండింగ్ అయిందో తేలుస్తారు. మ్యాచింగ్ గ్రాంట్ మోసాలే కాదు.. అమెరికన్ దర్యాప్తు సంస్థలు ఇంకిన్ని రకాల నేరాలను పసిగడుతున్నాయి. అమెరికన్ తెలుగు సంఘంలో చెక్ రైటింగ్ అథారిటీ కలిగి ఉన్న ఓ వ్యక్తి 2 లక్షల 50 వేల డాలర్లను ఇండియాకు పంపి వ్యక్తిగత లాభం పొందారని, ఇది NGO బైలాస్ ను ఉల్లంఘించడమే అని గుర్తించింది. సో మనోళ్లు అమెరికాలో చేస్తున్న పనులు అందరినీ తలదించుకునేలా చేస్తున్నాయి. కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టులో వచ్చే తీర్పుపైనే తెలుగు సంఘాల భవితవ్యం ఆధారపడి ఉంది.

తానాకు జాయింట్ నోటీసులతో షేకింగ్

2019 జనవరి నుంచి 2024 డిసెంబర్ దాకా తానా కార్యకలాపాలకు సంబంధించిన వివరణాత్మక రికార్డులను FBI, IRS అలాగే US డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ జాయింట్ గా తానాకు నోటీసులు ఇచ్చాయి. ఇదంతా మ్యాచింగ్ గ్రాంట్స్ ఎలా పొందారు.. అన్నీ సక్రమంగానే వచ్చాయా లేదా అన్నది ఇప్పుడు చెక్ చేయబోతున్నారు. తానాకు ఈ మ్యాచింగ్ గ్రాంట్ ప్రోగ్రామ్ విరాళాలు ఒక తలనొప్పి అయితే ఇప్పటికే తానా ఫౌండేషన్‌ నిధుల మళ్లింపు వ్యవహారం చర్చనీయాంశమైంది.

శ్రీకాంత్ పోలవరపు నిధుల మళ్లింపు హాట్ టాపిక్

ఫౌండేషన్ మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు మూడు మిలియన్ డాలర్లకుపైగా నిధులను తన సొంత సంస్థకు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన తానా బోర్డు మీటింగ్ పెట్టుకుని ఆయన నుంచి రికవరీ చేసే చర్యల్లో ఉన్నాయి. నిధులు మళ్లింపు నిజమేనని, అది తన సొంత నిర్ణయమని, దీనికి పూర్తి బాధ్యత వహిస్తానని శ్రీకాంత్‌ పోలవరపు చెప్పుకొచ్చారు. ఇలా దారి మళ్లించిన ఫండ్స్ ను పూర్తిగా తిరిగి రాబట్టేందుకు తానా బోర్డ్ చట్టబద్ధంగా ఎఫ్‌బీఐ సాయంతో ముందుకు సాగుతోంది.

FBI సహాయంతో నిధుల రికవరీకి తానా ప్లాన్

నిజానికి FBIకి తానా అందించిన ఫిర్యాదులో గత పదిహేనేళ్లుగా అనేక ఆర్థిక అవకతవకలు జరిగాయని ప్రస్తావించారు. మ్యాచింగ్‌ గ్రాంట్‌ కుంభకోణం, మనీలాండరింగ్‌, ఇతర ఆర్థిక నేరాలు సైతం జరిగాయన్నారు. ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని తానా సభ్యులు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫండ్ డైవర్షన్ కేసు ఇలా ఉంటే మ్యాచింగ్ గ్రాంట్ల వ్యవహారంపైనా FBI దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఈ కేసులన్నీ చూస్తుంటే ఎక్కడి తానా.. ఇప్పుడు ఎక్కడ ఉంది అన్న ప్రశ్నలు రాక మానవు. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, లాభాపేక్షలేని సంస్థగా 1978లో అధికారికంగా ఏర్పాటైన తానా.. ఇప్పుడు FBI, అమెరికా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఉనికికే ప్రమాదం వచ్చేలా ఉందని NRIలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

షాపు యజమానిని బ్లాక్ మెయిల్ చేసిన పరిస్థితి

అమెరికాలో తెలుగు జనాభా పెరిగే కొద్దీ, ఆదాయాలు పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త తెలుగు సంఘాలు పుట్టుకొచ్చాయి. చాలా వరకు ఆధిపత్యంతోనే వచ్చాయంటారు. ఆటా వంటి సంఘాల్లో ఎలక్షన్లు కూడా సరిగా జరపలేని పరిస్థితి. మళ్లీ ఫిబ్రవరిలో ఎలక్షన్ జరగనుంది. అమెరికన్ తెలుగు సంఘాలు పోటా పోటీగా సంబరాలకు ప్లాన్లు చేస్తుంటాయి. మిగితా వారికంటే గొప్పగా ఉండేలా సీన్లు క్రియేట్ చేస్తుంటారు. సంఘాల సంగతి అలా ఉంటే.. అమెరికా వెళ్తున్న తెలుగువారిలో కొందరు అసలు పని మానేసి మనోళ్లనే బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారన్న మ్యాటర్ ఇటీవలే బయటికొచ్చింది.

డల్లాస్ గ్రోసరీ స్టోర్ లో బ్లాక్ మెయిలింగ్ ఘటన

డల్లాస్ లో ఓ గ్రోసరీస్ స్టోర్ కు వెళ్లిన కొందరు తూకాల్లో లోపాలు ఉన్నాయని వీడియో తీశారు. తర్వాత గ్రోసరీ స్టోర్ యజమానిని బెదిరించి, లక్ష డాలర్లు ఇవ్వకపోతే అధికారులకు వీడియోలు పంపుతామని బెదిరించారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో సదరు స్టోర్ ఓనర్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో కేసులు పెట్టడం కూడా జరిగిపోయాయి. ఈ మ్యాటర్ కాస్తా వైరల్ గా మారింది. తెలుగు వాళ్లు.. తెలుగు వాళ్లనే బ్లాక్ మెయిల్ చేయడం ఏంటన్న చర్చ జరిగింది. ఇలా పరువు తీసుకుంటారా అన్నది హాట్ డిబేట్ అయింది.

1960-70ల్లో డాక్టర్లుగా అమెరికా వెళ్లిన తెలుగువారు

తొలితరం తెలుగు వారు 1960-70ల్లో డాక్టర్లుగా అమెరికాకు వెళ్లారు. చాలా హుందాగా, గౌరవప్రదంగా, ప్రశాంతంగా ఉండే పరిస్థితి. ఆ తర్వాత 1985-95ల్లో ఇంజనీర్స్ వెళ్లడం మొదలుపెట్టారు. భవిష్యత్ పై, సంపాదనపైనే ఫోకస్ పెట్టి అమెరికాలో జీవితాలు గడిపారు. కానీ ఇప్పుడు అమెరికాలోని తెలుగువారిలో మునుపటి భయం తగ్గింది. కారణం రెండేసి ఉద్యోగాలు చేయడం, సంపాదన పెరగడం, అదే సమయంలో రియల్ ఎస్టేట్ నుంచి గ్యాస్ స్టేషన్స్ ఇలా రకరకాల వ్యాపారాలు చేస్తుండడం తెలుగువారి ప్రాబల్యాన్ని పెంచాయి. అయితే ఇప్పుడు ఈ మ్యాచింగ్ గ్రాంట్ ప్రోగ్రామ్ స్కామ్స్ తో తెలుగు సంఘాలకు సమస్య వచ్చి పడింది. అలాగే అమెరికాలోని తెలుగువారంటేనే అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

Related News

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

Big Stories

×