BigTV English

Vishal: కావాలనే తప్పుడు వార్తలు రాస్తున్నారు.. విశాల్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన కుష్భూ

Vishal: కావాలనే తప్పుడు వార్తలు రాస్తున్నారు.. విశాల్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన కుష్భూ

Vishal: హీరోలకు చిన్న ఇబ్బంది కలిగిందని తెలిసినా వారి ఫ్యాన్స్ చాలా బాధపడుతుంటారు. అలా ఒకప్పుడు యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న విశాల్ కనీసం నిలబడడానికి, మైక్ పట్టుకొని మాట్లాడడానికి కూడా కష్టపడడం చూసి తన ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అసలు ఏం జరిగిందో తెలియకుండా విశాల్‌కు అనారోగ్యం అంటూ కొందరు ప్రచారం మొదలుపెట్టారు. దీంతో డాక్టర్లు సైతం విశాల్ ఆరోగ్యం గురించి అందరికీ క్లారిటీ ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయినా కూడా తప్పుడు ప్రచారాలు ఆగలేదు. ఆ తప్పుడు ప్రచారాలపై ఫైర్ అవుతూ విశాల్ ఆరోగ్యంపై పూర్తిస్థాయి క్లారిటీ ఇచ్చేశారు కుష్భూ. ఇకపై అలాంటివి ఆపమని అన్నారు.


ఒక్కసారిగా షాక్

కుష్భూ భర్త సుందర్ సీ.. ‘మద గజ రాజా’ అనే మూవీని తెరకెక్కించారు. అందులో విశాల్ హీరోగా నటించాడు. ఈ మూవీ 11 ఏళ్ల క్రితమే షూటింగ్ పూర్తిచేసుకున్నా కూడా ఇప్పటివరకు రిలీజ్ అవ్వలేదు. దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తున్నారు. కానీ ఫైనల్‌గా ఇన్నాళ్లకు ఈ సినిమా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. దీంతో ‘మద గజ రాజా’ మూవీని అందరు ప్రేక్షకులు మర్చిపోయారు కాబట్టి దీనికి సరైన ప్రమోషన్స్ చేయాలని మేకర్స్ రంగంలోకి దిగారు. ముందుగా గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్‌కు సుందర్‌తో పాటు కుష్భూ కూడా వచ్చారు. కానీ అందులో విశాల్‌ను చూసిన ప్రేక్షకులు అందరూ షాకయ్యారు.


Also Read: జపాన్‌లో ఆడియో లాంచ్, ముగ్గురు హీరోయిన్స్‌తో స్పెషల్ సాంగ్.. ‘రాజా సాబ్’ ప్లానింగ్ బయటపడిందిగా.!

కంగారు పడొద్దు

విశాల్ (Vishal) మొహం పూర్తిగా మారిపోయారు. తను నిలబడడానికి కూడా కష్టపడ్డాడు. అంతే కాకుండా మైక్ పట్టుకొని మాట్లాడడానికి కూడా తనకు శక్తి చాలలేదు. అలా ఎందుకు జరిగింది అనే విషయంపై క్లారిటీ ఇవ్వడానికి కుష్భూ స్వయంగా ముందుకొచ్చింది. 11 ఏళ్ల తర్వాత తను నటించిన మద గజ రాజా మూవీ రిలీజ్ అవుతుందని డెంగ్యూతో బాధపడుతున్నా కూడా విశాల్ ఆ ఈవెంట్‌కు వచ్చారని అన్నారు. 103 డిగ్రీల జ్వరం ఉండడం వల్లే తను అలా వణికాడని క్లారిటీ ఇచ్చారు. ఈవెంట్ అవ్వగానే విశాల్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లామని, ప్రస్తుతం తను కోలుకుంటున్నాడని బయటపెట్టారు. కంగారు పడాల్సిన అవసరం లేదంటూ ఫ్యాన్స్‌ను కోరారు.

కుదుటపడిన ఫ్యాన్స్

వ్యూస్ కోసం విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు రాస్తున్నారని సీరియస్ అయ్యారు కుష్భూ (Kushboo). మొత్తానికి డాక్టర్లతో పాటు కుష్భు కూడా క్లారిటీ ఇవ్వడంతో విశాల్ ఫ్యాన్స్ కాస్త కుదుటపడ్డారు. ఇది కేవలం జ్వరమే అన్న విషయం వారికి కూడా క్లారిటీ వచ్చేసింది. ‘మద గజ రాజా’ (Madha Gaja Raja) విషయానికొస్తే ఈ మూవీ 2011లోనే విడుదల కావాల్సింది. అప్పట్లో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలయ్యింది. కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇందులో విశాల్‌కు జోడీగా వరలక్ష్మి శరత్‌కుమార్, అంజలి నటించారు. ‘మద గజ రాజా’ సమయంలోనే విశాల్, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రేమలో పడ్డారు. కానీ కొన్నాళ్లకు వర్కవుట్ అవ్వక విడిపోయారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×