పల్నాడు జిల్లా నుంచి మరో కీలక వైసీపీ నేత.. జగన్‌కు షాక్ ఇవ్వనున్నారట. పార్టీ సీనియర్‌నేత, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్.. ఫ్యాన్ పార్టీని వీడతారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. వైసీపీకి రాజీనామ చేసి.. ఆయన సైకిల్‌పై సవారీ చేసేందుకు సుముఖంగా ఉన్నారట. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఆయన తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారనే టాక్ నడుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ నెలఖరులోపు మర్రి రాజశేఖర్.. ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది.
మర్రి రాజశేఖర్ కొన్ని రోజులుగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. చిలకలూరిపేట ఇన్‌ఛార్జిగా విడదల రజినిని నియమించిన నాటి నుంచి ఆయన అసహనంలో ఉన్నట్లు సమాచారం. తనకు చెప్పకుండానే నియమించారనే అధిష్టానంపై గుర్రుగా ఉన్నారట. పార్టీలో చేరినప్పటి నుంచి తన నేతకు.. అడుగడునా అవమానాలు, అన్యాయం జరిగిందని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారట. తమ నేత.. పార్టీ విధేయుడిగా ఉండి.. శ్రమిస్తుంటే.. అదిగో పదవి.. ఇదిగో పదవి అంటూ జగన్.. నిర్లక్ష్యం చేస్తూ వచ్చారనేది మర్రి అనుచరుల మాటగా తెలుస్తోంది. వైసీపీ కోసం ఎన్నో కష్టాలుపడినా.. మొదట్నుంచి సరైన గుర్తింపు లేదని వారంతా మండిపడుతున్నారట. గత ఎన్నికలకు ముందే MLC ఇచ్చి సరిపెట్టారని.. గతంలోనూ మంత్రి పదవి ఇస్తామని ప్రకటించిన జగన్.. ఆ మాట నిలుపుకోలేదని ఆయన వర్గీయులు ఆసహనం వ్యక్తం చేస్తున్నారట.
Also Read: బాబు ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న నెల్లూరు గేమ్ ఛేంజర్స్
కొంతకాలంగానూ మర్రి రాజశేఖర్ వ్యవహారశైలి చూస్తుంటే.. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు నిజమేననే వాదన వినిపిస్తోంది. కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు అన్నీ తానై వ్యవహరించిన నేత… కొన్నిరోజులుగా సైలెంట్ కావటంతో.. ఆయన పార్టీ మారుతున్నారన్న వాదనకు మరింత బలం చేకూరింది. మర్రి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేస్తారా. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తారా అనే అంశం ఉత్కంఠగా మారింది. త్వరలోనే దీనిపైనా క్లారిటీ వస్తుందని మర్రి వర్గీయులు చెబుతున్నారట. పదవులు ఉన్న నేతలను తీసుకోమని TDP చెబుతున్న నేపథ్యంలో మర్రి రాజశేఖర్ జాయినింగ్‌పై ఉత్కంఠ నెలకొంది. ఆయన్ను పార్టీలోకి తీసుకుని.. మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారనే టాక్ నడుస్తోంది.
మరోవైపు.. సంక్రాంతి లోపు సీఎం చంద్రబాబును రాజశేఖర్ కలుస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. గత ఎన్నికల ముందే రాజశేఖర్ పార్టీ తీరుపై ప్రశ్నించారట. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా… రోడ్లు అంశంపై ప్రజలకు అసంతృప్తి ఉందంటూ ఆయన గతంలో చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. తర్వాత కాలంలో ఈ వ్యాఖ్యలను అటు పార్టీ కానీ.. ఇటు రాజశేఖర్ కానీ స్పందించలేదు. సో.. ఈ అగాధం ఎప్పటినుంచో ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి.