BigTV English

KTR: భూసేకరణపై మాట మార్చిన కేటీఆర్, అసలు గుట్టు రట్టు!

KTR: భూసేకరణపై మాట మార్చిన కేటీఆర్, అసలు గుట్టు రట్టు!

2020లో శాసన మండలిలో మంత్రి హోదాలో భూసేకరణ గురించి కేటీఆర్ అన్న మాటలు వింటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. సింపుల్ గా అప్పుడు రైటు, ఇప్పుడు రాంగ్ అంటున్నారంతే. నాడు ఫార్మాసిటీ భూసేకరణ గురించి అడిగితే.. ప్రతిపక్ష నేతలు రాజకీయం చేస్తూ అడ్డుపడుతున్నారని, అభివృద్ధి ఇష్టం లేదంటూ మాట్లాడారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కొడంగల్ ఏరియాలో ఇదే ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్ గురించి భూసేకరణ చేస్తే… దళిత గిరిజన బీసీల భూములు లాక్కుని సీఎం అనుయాయుల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం డబ్బులు సంపాదించుకునేందుకు చేస్తున్న కుట్రగా చెబుతున్నారు. ఏమైనా ఇది మతి ఉండి మాట్లాడుతున్నదేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.


ఇదే భూసేకరణ, ఇదే ఫార్మా రంగం గురించి కేటీఆర్ తాజాగా ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఫార్మాసూటికల్ ఇండస్ట్రీ గురించి గొప్పలు చెప్పుకున్నారు. కోవిడ్ టైంలో పారాసెటమాల్ కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడిందని, అప్పుడు హైదరాబాదే ఆదుకుందని గుర్తు చేస్తున్నారు. ఆఖరకు నాడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ కూడా పీఎంకు ఫోన్ చేస్తే.. మన హైదరాబాద్ ఇండస్ట్రీనే కన్సల్ట్ అయ్యారన్నారు. మరి ఇంత గొప్పగా చెప్పుకున్న ఈ ఫార్మాను ఇప్పుడు మరింత అభివృద్ధి చేద్దామని ఈ ప్రభుత్వం అనుకుంటే మాత్రం… పొల్యూషన్ అని, భూములు ఎలా లాక్కుంటారంటూ రెచ్చగొట్టేలా రాజకీయం చేయడం తగునా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

బీఆర్ఎస్ హయాంలో భూసేకరణ జరిగిన తీరు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్న టాక్ ఉంది. ఎందుకంటే కాళేశ్వరం అంటూ ఊదరగొట్టి మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ సహా కాల్వలు, ఇతరాలు అని చెప్పి రైతుల దగ్గర్నుంచి వేలాది ఎకరాలు సేకరించి భూసేకరణ చట్టం ప్రకారం సరైన పరిహారం ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన సంగతిని కేటీఆర్ మర్చిపోయినా… మల్లన్నసాగర్ భూనిర్వాసితులు మాత్రం మర్చి పోవడం లేదు.


మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలాల్లోని 8 గ్రామ పంచాయతీలు, 8 చిన్న గ్రామాల పరిధిలోని 17వేల ఎకరాల వ్యవసాయ భూములను నాటి కేసీఆర్ సర్కార్ సేకరించింది. తొగుట మండలంలోని ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లక్ష్మాపూర్, పల్లె పహాడ్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, కొండపాక మండలంలోని సింగారం, ఎర్రవల్లి గ్రామాలు రిజర్వాయర్ నిర్మాణంతో ముంపునకు గురయ్యాయి. మొత్తంగా 6 వేల దాకా కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యాయి. వేములఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1,330, పల్లెపహాడ్ లో 1,011, ఏటిగడ్డ కిష్టాపూర్ లో 1,493, లక్ష్మాపూర్ లో 385, రాంపూర్ లో 255, బ్రాహ్మణ బంజేరుపల్లిలో 293, సింగారంలో 273, ఎర్రవెల్లిలో 892 కుటుంబాలను గజ్వేల్ మండలం ముత్రాజ్ ​పల్లి, సంగపూర్ లో నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీకి తరలించి చేతులు దలుపుకున్నారు.

ఎందుకంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టుల కోసం సేకరించిన ప్రతి ఎకరానికి మార్కెట్​ రేటు కంటే నాలుగు రెట్లు ఎక్కువ పరిహారం చెల్లించాలి. ఐదెకరాలు, అంతకంటే తక్కువ భూములున్న చిన్న రైతు కుటుంబాలకు జీవనోపాధి కోసం కనీసం ఎకరా భూమి, ఎస్సీ, ఎస్టీలైతే భూమికి బదులు భూమి ఇవ్వాలి. జీవనోపాధి కోల్పోయే రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, చిరువ్యాపారుల కుటుంబాల్లోని కనీసం ఒకరికి వివిధ రంగాల్లో వృత్తి శిక్షణ ఇచ్చి ఉపాధి చూపించాలి. లేదంటే ప్రభుత్వం ఆ కుటుంబానికి నెలకు 2 వేల రూపాయల చొప్పున 20 ఏళ్లపాటు సహాయం అందించాలని 2013 భూసేకరణ చట్టం చెబుతోంది. కానీ నాటి కేసీఆర్ ప్రభుత్వం ఈ చట్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కి నిర్వాసితులను ఆర్ అండ్ ఆర్ ​కాలనీలకు తరలించి చేతులు దులుపుకొంది. వారి గోస అంతా ఇంతా కాదు.

మల్లన్న సాగర్ కింద 6 వేల కుటుంబాలు ఇండ్లు, పొలాలు, ఉపాధి కోల్పోయాయి. దీంతో ఈ ఫ్యామిలీలు ఇప్పుడు దయనీయంగా బతుకున్నాయి. ఆ ఏరియాలో బహిరంగ మార్కెట్ లో ఎకరా విలువ 30 లక్షలకుపైగా పలికినా… నాటి గులాబీ సర్కారు ఎకరాకు 6 లక్షల నుంచి 10 లక్షల వరకు పరిహారం ఇచ్చిందంతే. దీంతో ఆ వచ్చిన డబ్బుతో ఇంకోచోట భూములు కొనలేని పేద రైతులు కూలీలుగా మిగిలిపోయారు. మల్లన్న సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నింపేందుకు ఉన్నఫలంగా తరలించిన నాటి సర్కారు.. వారికి ఎలాంటి ఉపాధి అవకాశాలు చూపలేదు. దీంతో వాళ్లు కుటుంబ పోషణ కోసం కూలీలుగా మారారు. వారిని కదలిస్తే చాలు గత సర్కార్ నిర్వాకంపై విరుచుకుపడుతున్నారు.

Also Read: జైలు కెళ్లడానికి తొందరేలా? అందుకేనా కేటీఆర్ రెచ్చగొడుతున్నారు?

సో… మనం చేసిన భూసేకరణ, నిర్వాసితుల గోడు పక్కన పెట్టేసి.. ఇప్పుడు ఏమీ జరగకపోయినా.. మంచి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి రైతులను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నా.. సరే భూదాహంతోనే రైతుల భూములు లాక్కుంటున్నారని బీఆర్ఎస్ లీడర్లు దిక్కుమాలిన లాజిక్ వినిపించడమేంటన్న ప్రశ్నలైతే వస్తున్నాయి.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×