BigTV English

New Continent : భూమిపై ఇంకో ఖండాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఇన్నాళ్లు ఎక్కడ దాక్కుందో తెలుసా?

New Continent : భూమిపై ఇంకో ఖండాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఇన్నాళ్లు ఎక్కడ దాక్కుందో తెలుసా?

New Continent : ఇప్పటి వరకు మనకు ఏడు ఖండాలు మాత్రమే తెలుసు..  కానీ ఇప్పుడు మరో ఖండాన్ని గుర్తించారు భూగర్భ శాస్త్రవేత్తలు. న్యూజిలాండ్ సమీపంలోని ద్వీపాల సమూహాల దగ్గర ఈ నూతన ఖండం బయటపడగా.. దానికి జిలాండియా అనే పేరు పెట్టారు. మరి ఇన్నాళ్లు.. ఎందుకు కనిపెట్టలేదు అంటారు.  ఎందుకంటే.. ఇది సముద్రం అడుగున నీళ్లల్లో దాక్కుంది. అవును.. భూగర్భ శాస్త్రవేత్తలకు ఎన్నో ఆసక్తికర విశేషాల్ని అందించిన.. ఈ కొత్త ఖండం గురించి మీరు తెలుసుకొండి.


ప్రస్తుతానికి మనకు ఈ జిలాండియా కొత్త ఖండం కావచ్చు.. కానీ, కొన్ని వేల ఏళ్ల క్రితం భూమిలానే అనేక జీవులకు ఆవాసంగా ఉంది. ఇది ఖండాల ఏర్పాటుకు ముందు.. ఒకే ఒక్క పెద్ద భూభాగంమైన  గోండ్వానాలో భాగమని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది.. సుమారు 1 బిలియన్ నుంచి 542 మిలియన్ ఏళ్ల క్రితం ఉనికిలో ఉందని అంచనా వేస్తున్నారు. అంటే.. దాదాపు 100 కోట్ల ఏళ్ల నాడు అన్నమాట. అప్పటి నుంచి క్రమంగా.. భూపలకాలు కదలుతూ.. ఇప్పుడున్న ఖండాలుగా ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ పరిణామంలో.. ఈ జిలాండియా అనే ఖండం సముద్రంలో కనుమరుగైందని అంటున్నారు. అంతే కాదండోయ్.. ఇప్పుడు ఈ ఖండానికి సంబంధించిన పూర్తి స్థాయి మ్యాప్ ను సైతం రూపొందించారు.

సముద్రం అడుగున ఉన్న రాతి నమూనాలకు సేకరించిన శాస్త్రవేత్తలు.. సమీపంలోని అనేక ద్వీపాల నుంచి సైతం నమూనాల్ని, ఇతర అవక్షేపాల్ని సేకరించి అధ్యయం చేశారు. విస్తారమైన డేటాను రూపొందించి.. అనేక ఇతర భూపరిశోధనల డేటాతో పోల్చి విశ్లేషించి, ఈ ఖండం మనుడను నిర్థరించారు. ఈ పరిశోధనల్లో ఆశ్చర్యకరంగా.. పశ్చిమ అంటార్కిటికాలోని భూపలకాల కదలికలు.. మిగతా పలకాలను ప్రభావితం చేస్తుందని గుర్తించారు.


ఈ జిలాండియా ఖండం పరిమాణాన్ని అంచనా వేసిన శాస్త్రవేత్తలు.. మడగాస్కర్ కంటే దాదాపు 6 రేట్లు పెద్దదని తేల్చారు. అంటే.. దాదాపు 4.9 మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నట్లు గుర్తించారు. అయితే.. కొన్ని చిన్న ద్వీపాల రూపంలో మనుగడలోనే ఉందని, ప్రస్తుత న్యూజిలాండ్ సమీపంలోని ద్వీపాలు చాలా వరకు.. ఈ ఖండానికి సంబంధించినవే అని స్పష్టం చేస్తున్నారు.

భూ కదలికలు, పరిణామాలతో పాటు అనేక విషయాల్ని తెలియజేస్తోంది ఈ పరిశోధన. భూఖండాల ఏర్పాటుతో పాటు ఏ భూపలకాలు ఎటుగా కదిలాయనే విషయాన్ని గుర్తించేందుకు ఇలాంటి పరిశోధనలు కీలకమంటున్నారు. అంతే కాదు.. ఈ భూభాగాలు ఉనికిలో ఉన్నప్పుడు వాటిపై ఎలాంటి జీవరాశులు జీవించేవి, అవి ఏమైనా శిలాజాల రూపంలో లభిస్తాయా అనే శోధనలు చేపట్టాల్సి ఉంటుంది. అందుకే.. ఈ జిలాండియా ఖండానికి సంబంధించిన సమగ్ర మ్యాప్ ను తయారు చేసిన శాస్త్రవేత్తలు.. అందులోని అగ్నిపర్వతాలను, ఖండం తీరుతెన్నులు సహా ఇతర అనేక అంశాల్ని గుర్తించి పొందుపరిచారు.

Also Read : యూట్యూబర్‌తో మైక్ టైసన్ బాక్సింగ్ మ్యాచ్.. ఫుల్ ట్రాఫిక్‌తో నెట్‌ఫ్లిక్స్ డౌన్

ప్రస్తుతం మనం చూస్తున్న ఖండాలన్నీ ఒకప్పుడు ఒకే ఖండంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా. కానీ.. తర్వాతి కాలంలో భూ పలకాల మార్పుల కారణంగా, అవి క్రమంగా విడిపోతూ, ఒక్కొక్కటీ ఒక్కో దిశలో కదిలిపోయాయని భావిస్తుంటారు. భారత్ కూడా ఇలానే.. దక్షిణాఫ్రికా నుంచి విడిపోయిన భూ పలకం అన్నది.. శాస్త్రవేత్తల మాట. అక్కడి నుంచి క్రమంగా ఆసియా ప్రాంతానికి వచ్చి.. ఇక్కడి ఆసియా ఖండాన్ని ఢీ కొట్టిందని భావిస్తుంటారు. ఆ కారణంగానే.. హిమాలయాలు ఏర్పడ్డాయని చెబుతుంటారు. అలా..  భూపటాల కదలికల మధ్య ఈ జిలాండియా అనే ఖండం సముద్రంలో మునిగిపోయిందని అంటున్నారు.

 

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×