KTR Challenge: రేవంత్ సర్కార్‌ని మాజీ మంత్రి కేటీఆర్ రెచ్చగొడుతున్నారా? చేతనైతే అరెస్ట్ చేయడంటూ సవాల్ విసురుతున్నారా? పదేపదే ఈ మాటలు ఆయన ఎందుకంటున్నారు? ఇంతకీ ఏ కేసులో కేటీఆర్ అరెస్ట్ కానున్నారు? ఫార్ములా రేస్.. లగచర్ల ఘటన.. ఫోన్ ట్యాపింగ్ కేసులోనా? ఇదే ప్రశ్నలు తెలంగాణ ప్రజలను వెంటాడుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడాది అవుతోంది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీసే పనిలో నిమగ్నమైంది ప్రభుత్వం. మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి తనను అరెస్ట్ చేయండి.. జైలుకి వెళ్లడానికి సిద్ధమేనంటూ 50 సార్లైనా ఆ మాట చెప్పారు కేటీఆర్.
త్వరగా జైలుకి వెళ్లాలనే అభిప్రాయం కేటీఆర్‌కు ఉందేమో తెలీదుగానీ.. జైలుకి వెళ్లిన ప్రతి నేత ముఖ్యమంత్రి అవుతున్నారనే అభిప్రాయం ఆయన మనసులో బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. జైలుకి వెళ్లి వచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తే, కాబోయే సీఎంను తానేనని ప్రొజక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్నిపదేపదే రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే ప్రతీ విషయంలోనూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులను సైతం రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారన్నది నేతల మాట. ఒకవేళ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే కేటీఆర్‌కు మైలేజ్ వస్తుందని అంటున్నారు.
ALSO READ: ఆ గ్రామానికి ఏమైంది? నెలన్నర వ్యవధిలో 20 మరణాలు? కారణం అదేనంటున్న గ్రామస్థులు..
లగచర్ల ఘటనపై మావోలు లేఖ రాయడం, ప్రజా సంఘాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఈ సమయంలో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే మరింత మైలేజీ వస్తుందని అంటున్నారు. ప్రజల కోసం జైలుకి వెళ్లాలని అనుపించుకోవాలనే ఆలోచన బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందట.
గతంలో ముఖ్యనేతల అరెస్ట్‌ల విషయానికొద్దాం. గతంలో అప్పటి మాజీ సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి వంటి నేతలు అరెస్ట్ అయ్యారు. అర్థరాత్రి ఆయా నేతల ఇళ్లకు వెళ్లి లాక్కుని అరెస్ట్ చేశారు పోలీసులు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా కాకుండా అంతా చట్టం ప్రకారమే చేస్తోంది. అందుకోసమే అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తోంది.
జగన్ అరెస్ట్ విషయంలో అన్ని ఆధారాలు బయటపెట్టిన తర్వాతే సీబీఐ అరెస్ట్ చేసిందని అంటున్నారు. జైలు నుంచి విడుదల తర్వాత ఆయన ఓసారి ప్రతిపక్షానికే పరిమితం అయ్యారని అంటున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేస్తున్నారు.
ఇక లగచర్ల విషయానికొద్దాం. అరెస్టయిన వారిని పరామర్శించడానికి జైలుకి వెళ్లారు కేటీఆర్. ఆ సమయంలో ఆయనపై అరెస్టయినవారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అంతర్గత సమాచారం. మీ రాజకీయాల కోసం తమను బలిపశువు చేయడమేంటని ప్రశ్నించారు. దీంతో ముఖం చిన్నబుచ్చుకుని బయటకు వచ్చారట కేటీఆర్.
లగచర్ల విషయాన్ని దేశవ్యాప్తంగా హైలైట్ చేసేందుకు బీఆర్ఎస్ టీమ్ ఆ ప్రాంతంలో పర్యటిస్తోంది. అక్కడికి వెళ్లిన మాజీమంత్రి సబితను గ్రామస్తులు నిలదీశారు. మీవల్లే మా ఊరికి చెడ్డ పేరు వచ్చిందని, సురేష్‌తోపాటు కొంతమంది తాగి వచ్చి దాడి చేశారు. ఆ దాడికి, రైతులకు ఎలాంటి సంబంధం లేదని మండిపడ్డారు.
సురేష్‌కు కనీసం ఇక్కడ భూమి కూడా లేదని, హైలైట్ కావాలనే ఈ స్కెచ్ వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల మాటలతో షాక్ అవ్వడం కారు పార్టీ నేతల వంతైంది. లగచర్ల ఘటన కేసులో మొత్తానికి కారు పార్టీ నేతల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందనే చెప్పాలి.
మీ వల్లే మా ఊరికి చెడ్డ పేరు వచ్చింది. సురేష్ ఒక ఆవారా. కొంతమంది తాగి వచ్చి దాడి చేశారు. ఆ దాడికి, రైతులకు ఎలాంటి సంబంధం లేదు.
సబితకు జ్ఞానోదయం చేసిన గ్రామస్తులు. హరీష్, కేటీఆర్ కూడా వెళ్లి నాలుగు మొట్టికాయలు వేయించుకుని రండి. pic.twitter.com/CyT2zMRPUo
— Telangana Congress (@INCTelangana) November 15, 2024