Kuna Ravikumar Hot Comments: విపక్షం లేకపోవడమే.. ఏమోగానీ టీడీపీ సభ్యుడు కూన రవికుమార్ చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో చిన్నపాటి దుమారం రేపాయి. జీరో అవర్ సెషన్ డ్రైవర్ లేని కారులా ఉందన్నారు. తాము చెబుతున్న నియోజకవర్గాల సమస్యలు ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలీదన్నారు.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు జోక్యం చేసుకుని, మంత్రులు ఉన్నారని గుర్తు చేశారు. సభలో ఆ విధంగా సత్యాలు మాట్లాడడం తగదన్నారు. గతంలో సభ్యులు లేవనెత్తిన అంశాలను నోట్ చేసుకున్నామని మంత్రి చెప్పేవారని, అదొక ఆనందంగా ఉండేదన్నారు రవికుమార్. ఇప్పుడు అదేమీ కనిపించలేదని, అందుకే సభ దృష్టికి తెచ్చినట్టు తెలిపారు.
వెంటనే మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకున్నారు. రికార్డు చేసిన ప్రతీది తమ డిపార్టుమెంటుకి వస్తుందన్నారు. దానిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నామో సభ్యులకు తెలియజేస్తున్నామని తెలిపారు.
ఈ విషయంలో ఎవరూ అనుమానం పడాల్సిన అవసరం లేదన్నారు. ఈలోగా స్పీకర్ జోక్యం చేసుకున్నారు.. రికార్డు ఎలాగూ అవుతుందని, ఎవరైనా మంత్రి నోట్ చేసుకుంటే బాగుంటుందన్నారు. సభ్యుడు ఆ చివరలో ఉన్నారని, ఇక్కడ ఏం జరుగుతుందో తెలీదన్నారు. ఆ తర్వాత తన ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు రవికుమార్.
జీరో అవర్.. డ్రైవర్ లేని కారులా ఉంది..
అసెంబ్లీలో కూన రవికుమార్ సంచలన వ్యాఖ్యలు
సభ్యులు చెప్పే సమస్యలను రాసుకునే మంత్రి లేరు
మరి సభలో సమస్యలు చెప్పి ఏం లాభమని ప్రశ్నించిన కూన రవికుమార్
కూన రవికుమార్ వ్యాఖ్యలపై స్పందించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
సభ్యులు అడిగిన ప్రశ్నలకు… pic.twitter.com/iAVMsrY78Z
— BIG TV Breaking News (@bigtvtelugu) November 16, 2024