BigTV English

Game Changer: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ నుంచి మరో లీక్.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ రావాల్సిందే

Game Changer: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ నుంచి మరో లీక్.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ రావాల్సిందే

Ram Charan Game Changer update(Latest news in tollywood): కథలో కొత్తదనాన్ని కోరుకునే వారిలో నటుడు రామ్ చరణ్ ఒకరు. ‘చిరుత’ సినిమాతో మొదలైన చరణ్ సినీ కెరీర్.. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ మూవీ వరకు చేరుకుంది. ఈ మధ్యలో చేసిన సినిమాలన్నీ కొత్త కొత్త కథలు.. డిఫరెంట్ పాత్రలతో వచ్చినవే. అయితే ‘మగధీర’తో తాను ఎవరో.. తన టాలెంట్ ఏంటో యావత్ సినీ ప్రియులకు చాటి చెప్పాడు.


ఆ తర్వాత అతడి పేరు తెలియని వారు లేకపోయారు. రీజనల్ స్టార్‌గా పలు బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న చరణ్ ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమాతో అతడి పేరు నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు చేరిపోయింది. అప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అనేవారు.. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి అనే స్థాయికి ఎదిగాడు.

ఇక ఈ మూవీ తర్వాత అతడు చేస్తున్న మరో చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ప్రముఖ క్రియేటివ్ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరెకెక్కిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ప్రపంచ సినీ ప్రియుల దృష్టిలో పడిన చరణ్‌‌తో సినిమా అంటే మామూలు విషయం కాదు. అందువల్లనే ఈ మూవీ పట్టాలెక్కి సుమారు 2 ఏళ్లు గడిచిపోయినా.. ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది.


Also Read: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ ఫెస్టివల్‌కే అంట!

ఇక ఈ మూవీ నుంచి అప్డేట్‌ల కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఇటీవలే మేకర్స్ ఓ సర్‌ప్రైజ్ అందించారు. ఇందులో భాగంగా చరణ్ బర్త్ డే రోజున ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘జరగండి.. జరగండి’ అంటూ సాగే ఈ సాంగ్ చాలా కలర్ ఫుల్‌గా కనిపించి మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. అంతేకాదు.. ఆ సాంగ్‌లో చరణ్ లుక్, స్టైల్ వేరే లెవెల్లో ఉండటంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు.

ఇక ఈ మూవీ నుంచి మరికొన్ని అప్డేట్ల కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీలోని ఓ సీన్‌‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియో ప్రకారం.. రామ్ చరణ్ ఒక స్టేజీపై తెల్లటి దుస్తుల్లో కనిపించాడు. దీని బట్టి చూస్తే అది పొలిటికల్ సీన్ అని తెలుస్తుంది. అందులో రామ్ చరణ్.. శ్రీకాంత్ ను హగ్ చేసుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని చాలామంది అంటున్నారు.

ఇకపోతే మరో అప్డేట్ కూడా వినిపిస్తుంది. ఈ మూవీ కొత్త షెడ్యూల్ ఇవాళ ఏపీలోని రాజమండ్రిలో మొదలుకానున్నట్లు తెలుస్తుంది. ఇది అత్యంత కీలకమైన షెడ్యూల్ అని సమాచారం. ఇందులో రామ్ చరణ్‌పై ఫ్యాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి.

https://twitter.com/itsme__Shannu/status/1787170629713826294

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×