BigTV English

Kolkata Case: కోల్ కతా హత్యాచారం కేసులో రోజుకో ట్విస్ట్.. అనిమానితుల లిస్ట్ లో ఎవరెవరున్నారు?

Kolkata Case: కోల్ కతా హత్యాచారం కేసులో రోజుకో ట్విస్ట్.. అనిమానితుల లిస్ట్ లో ఎవరెవరున్నారు?

Kolkata Doctor Rape and Murder Case Update: కోల్‌కతా హత్యాచార కేసులో మరో ట్విస్ట్‌. రోజులు గడుస్తున్న కొద్ది కొత్త అంశాలు, సరికొత్త మలుపులు తెరపైకి వస్తున్నాయి. లేటెస్ట్‌గా తెలిసిన విషయాలు కాలేజీ సిబ్బందిపై మరికొన్ని అనుమానాలు పెంచుతున్నాయి. అంతేకాదు సీబీఐకి కొన్ని అంశాల్లో క్లారిటీ మిస్ అవుతుంది. అంతేకాదు అనుమానితుల లిస్ట్‌లో మరికొందరు పేర్లను చేర్చింది సీబీఐ.


అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కాలేజీలోని సెమినార్‌ హాల్‌లో రక్తపు మడుగులో నీర్జివంగా పడి ఉంది. ఈ విషయాన్ని చూసిన హాస్పిటల్ సిబ్బంది ఆమె ఇంటికి ఫోన్ చేశారు. ఒకసారి కాదు.. మూడుసార్లు కాల్ చేశారు. మూడుసార్లు కూడా నిజం చెప్పలేదు.. మాట దాటేశారు. అదే ఇప్పుడు కొత్త అనుమానాలకు కారణమైంది. ఫస్ట్ కాల్.. మీ అమ్మాయి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. మీరు ఫ్యామిలీ మెంబర్స్‌ కాబట్టి మీకు విషయం చెబుతున్నాను. వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు రండి..? దీనికి ఆ తండ్రి ఏమైంది? ఏమైనా సీరియసా? అని ప్రశ్నించాడు. అవును సీరియసే.. వెంటనే రండి. మిగిలిన విషయాలు మీరు ఇక్కడికి వచ్చాక డాక్టర్లు చెబుతారు.

సెకండ్ కాల్.. ఈసారి అసిస్టెంట్ సూపరిండెంట్‌ కాల్ చేశాడు. తన కండిషన్‌ చాలా సీరియస్‌గా ఉంది. వీలైనంత త్వరగా రాగలరా. దీంతో మరింత కంగారు పడిన ఆ తల్లిదండ్రులు.. తమ కూతురికి ఏమైందో చెప్పాలన్నారు. కానీ మీరు ఇక్కడికి రండి.. వచ్చాక డాక్టర్లు వివరిస్తారని చెప్పారు. ఆ తర్వాత ఆయన కంగారులో మరిన్ని ప్రశ్నలు వేశాడు. కానీ అవతలివారు సమాధానం చెప్పకుండా కాల్ కట్ చేశారు.


Also Read: కోల్‌కతా హత్యాచారం నిందితుడు సంజయ్ రాయ్ లై డిటెక్టర్ టెస్టు .. ఏం తెలిసిందంటే?..

ఆ తర్వాత థర్డ్ అండ్ ఫైనల్ కాల్.. ఈసారి ఆ తండ్రికి కాల్‌ చేసి మీ కూతురు సూసైడ్‌ చేసుకొని చనిపోయింది. పోలీసులు కూడా వచ్చారు.. ఇక్కడ అందరూ ఉన్నారు. వారి ముందే నేను మీకు కాల్ చేస్తున్నాను. ఈ మూడు కాల్స్.. ఈ మూడు కాల్సే ఇప్పుడు అనేక ప్రశ్నలను లెవనెత్తుతున్నాయి. ఠాగూర్‌ మూవీలో హాస్పిటల్‌ సీన్‌ను రీక్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది కదా. అవును.. అందుకే ఆ బాధితురాలి తల్లిదండ్రులు మొదటి నుంచి ఏదో కుట్ర ఉందని అనుమానిస్తున్నారు.. న్యాయం కావాలని ప్రశ్నిస్తున్నారు.

నిజానికి ఎవరికైనా ఫోన్ చేసి డైరెక్ట్‌గా మీ కూతురు చనిపోయిందని చెప్పడం చాలా కష్టమైన పని. అందుకే మీ కూతరికి సీరియస్‌గా ఉందని చెప్పారనుకుందాం. కానీ సెకండ్, థర్డ్ కాల్‌ ఏంటి? ఎందుకు? అనేది అర్థం కావడం లేదు. నిజంగా అంత జాలి ఉంటే వారిని హాస్పిటల్‌కు ఎందుకు రమ్మన్నారు. మరి వచ్చే వరకు ఎందుకు ఆగలేదు. ముందే కాల్ చేసి ఎందుకు చనిపోయిందని చెప్పారు.. ? అది కూడా సూసైడ్‌ చేసుకొని చనిపోయిందని ఎందుకు చెప్పారు? పోనీ.. ఆమె అప్పుడే చనిపోయిందా? అంటే కాదు. తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య ఆమె చనిపోయిందని అటాప్సీ రిపోర్ట్ చెబుతోంది. వీళ్లు ఫ్యామిలీకి కాల్‌ చేసింది 9 గంటల ప్రాంతంలో. ఈలోపే ఆమె అత్యంత దారుణంగా అత్యాచారానికి గురై మరణించిందని తెలుసు. మరి ఈ సూసైడ్‌ కోణం ఎక్కడి నుంచి వచ్చింది?

మరోవైపు సీబీఐ మరో ఇద్దరు హాస్పిటల్‌ గార్డ్‌లకు పాలిగ్రాఫ్‌ టెస్ట్‌లు నిర్వహించింది. ఇది ఈ కేసులో మరో ట్విస్ట్‌ అనే చెప్పాలి. వారిని అనుమానితులుగా భావిస్తుందా? లేక నిందితుల లిస్ట్‌లో చేరుస్తుందా? అనేది చూడాలి.

Also Read: కోల్ కతా డాక్టర్ ఘటనలో.. తెరపైకి మరో కొత్త పేరు

ఇప్పుడు బెంగాల్‌ మొత్తం ఇంకెప్పుడు అని ప్రశ్నిస్తుంది. బెంగాల్‌ హత్యాచారంపై గొంతెత్తిన లక్షలాది మందిలో తాను కూడా చేరాడు సింగర్ అర్జిత్ సింగ్. న్యాయం జరిగేది ఇంకెఎప్పుడు? అని ఎలుగెత్తి ప్రశ్నించాడు. అర్‌ కబే అంటూ ఓ సాంగ్‌ను రిలీజ్‌ చేశాడు. దీని అర్థం.. ఇంకెప్పుడు? అని.. ఈ పాటలో ఎన్నో ప్రశ్నలను సంధించాడు అర్జిత్.

ఇంత తక్కువ వయసులోనే కొందరు ఎందుకు మరణిస్తున్నారు? కొందరు భయంతోనే ఎందుకు ముసలివారవుతున్నారు? నిస్సహాయులుగా కొందరు ఎందుకు మిగిలిపోతున్నారు? కొందరు రాయిలా ఎందుకు మారిపోతున్నారు? అన్యాయాలపై గొంతెత్తేది ఇంకెఎప్పుడు? మనమందరం గర్వంగా తలెత్తుకొని జీవించేది ఎప్పుడు? నీ కళ్లు తెరుచుకునేదెప్పుడు? పక్కవాళ్ల కోసం గొంతెత్తేది ఎప్పుడు? నేను సైతం అంటూ ఈ పోరాటంలో చేరుతున్నాను. మరి మీ సంగతేంటని తన పాటతో ప్రజలపై ప్రశ్నలు సంధించాడు అర్జిత్. నిజానికి తన స్టార్‌డమ్‌ను ప్రజల్లో చైతన్యం కోసం ఉపయోగించిన సెలబ్రిటీ అర్జిత్‌ మాత్రమే అని చెప్పాలి.

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×