BigTV English

Kolkata Doctor Murder Case: కోల్ కతా డాక్టర్ ఘటనలో.. తెరపైకి మరో కొత్త పేరు

Kolkata Doctor Murder Case: కోల్ కతా డాక్టర్ ఘటనలో.. తెరపైకి మరో కొత్త పేరు

నిజానికి మమతా బెనర్జీ హత్యాచార ఘటనను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేకపోయినందుకు హోంమినిస్టర్‌గా ఉన్న మమతా బెనర్జీని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారా? లేక ఆరోగ్యశాఖ మంత్రి అయిన మమతా బెనర్జీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారా? లేక రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరిగినా ఏం చేయలేకపోతున్నారని సీఎం మమతా ఏం చేయలేకపోతున్నారని ర్యాలీ చేశారా? బెంగాల్‌ సీఎం, హోంమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి అన్ని మమతా బెనర్జీనే.. మళ్లీ ఆమే ర్యాలీ తీయడమే పెద్ద వండర్.. ఇది అసలు నిసిగ్గు వ్యవహారం.. సరే పోనీలేండి ఇదంతా పాత విషయమే.. ఇక్కడ పాయింట్ ఏంటంటే.. ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. కానీ చీమకుకూడా హాని జరగలేదు.. చాలా పకడ్బంధీగా పోలీస్‌ వ్యవస్థ పనిచేసింది.
కానీ ఆ తర్వాత జరిగిన ర్యాలీలన్నింటిలో జరిగింది హింసాకాండే.

ఆర్‌జీ కర్‌ హాస్పిటల్‌లో దారుణానికి వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. అదే సమయంలో హాస్పిటల్‌లోకి చొరబడ్డ అల్లరిమూక.. నానా బీభత్సం సృష్టించింది. ఘటన జరిగిన ప్రాంతాన్ని మొత్తం ధ్వంసం చేశారు. తరువాత.. నబన్నా అభియాన్.. అంటే చలో సచివాలయం పేరుతో కోల్‌కతాలో ఓ ర్యాలీ నిర్వహించారు. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ జరిగింది. ఇది ఎంత హింసాత్మకంగా మారిందంటే.. చాలా మంది నిరసనకారులు గాయపడ్డారు. దీన్ని ఆసరాగా చేసుకొని బీజేపీ 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. ఇది కూడా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. వీధుల్లో బీజేపీ, తృణమూల్‌ కార్యకర్తలు తన్నుకున్నారు. బీజేపీ నేతలపై దాడులు జరిగాయి.. కాల్పులు జరిగాయి. కొన్ని చోట్లు బాంబులు కూడా పేలాయి. మమతా బెనర్జీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఏం చేసినా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు.


Also Read: ఉపేక్షించింది ఇక చాలు.. మేలుకోండి: కోల్‌కతా రేప్ ఘటనపై రాష్ట్రపతి

మమతా బెనర్జీ ర్యాలీ చేస్తే ప్రశాంతంగా సాగిపోవడం ఏంటి..? వేరే ఎవ్వరూ ర్యాలీకి దిగిన ఈ దాడులు.. అరాచకం నిద్రలేవడం ఏంటన్నది అస్సలు అర్థం కావడం లేదు. ఓ వైపు ఇలాంటి ఘటనలు రోజుకోకటి జరుగుతుంటే.. మరోవైపు తాను కూడా మద్దతిస్తున్నాను అన్నట్టుగా ఒక్కో నిర్ణయం తీసుకుంటున్నారు. ఆమె లెటెస్ట్‌గా ఓ ట్వీట్ చేశారు. టీఎంసీ పార్టీ విద్యార్థి విభాగం వ్యవస్థాపక దినోత్సవాన్ని ట్రైనీ డాక్టర్‌కు అంకితమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలని జుట్టు పీక్కుంటున్నారు బెంగాల్ ప్రజలు.. ఆమె గవర్నమెంట్‌పై ఆమె నిరసన తెలపడం ఏంటో.. ఆమెకు వ్యతిరేకంగా గొంతెత్తిన విద్యార్థులను, నిరసనకారులను చితకబాదడం ఏంటో.. ఆమెకే తెలియాలి. మొత్తానికి సీబీఐ విచారణను డైవర్ట్ చేసే వాతావరణం క్రియేట్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు..

టీఎంసీ నేతలను ఇదే ప్రశ్న వేస్తే.. ప్రస్తుతం విచారణ కేంద్రం చేతిలో ఉంది కదా అంటున్నారు. కాబట్టి.. విచారణ సీబీఐ జరుపుతుంది కాబట్టి.. మాకేం సంబంధం లేదన్నట్టుగా ఉంది బెంగాల్ ప్రభుత్వ వ్యవహార తీరు. ఇప్పటికైనా ఈ పనికిమాలిన రాజకీయాలను పక్కన పెట్టి అసలు వ్యవహారంపై ఫోకస్ చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. కానీ పట్టించుకునేవారు ఎవరు. అధికారపక్షమైనా.. విపక్షమైనా.. ఎవరి పంచాయతీల్లో వారే ఉన్నారు. ఎవరి పొలిటికల్ గెయిన్‌లో వారే ఉన్నారు.

ఇక సీబీఐ ఇన్వెస్టిగేషన్ విషయానికి వద్దాం..ఈ కేసులో ఇప్పుడు మరో కొత్త పేరు వినపడింది. అతనే ASI అనూప్ దత్తా.. ఎవరీ అనూప్ దత్తా అనే కదా మీ డౌట్.. మొన్న ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌కు సీబీఐ పాలిగ్రాఫ్‌ టెస్ట్ నిర్వహించిన సమయంలో ఈ పేరు తెరపైకి వచ్చింది. ఈ అనూప్‌, సంజయ్ మధ్య చాలా మంచి ఫ్రెండ్‌ షిప్‌ ఉంది. ఇంకా.. హత్యాచారం తర్వాత కూడా సంజయ్‌ అనూప్‌ను కలిసేందుకు వెళ్లాడు. ఈ అనూప్‌ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్‌ ఘోష్‌కు చాలా క్లోజ్ అని సీబీఐ గుర్తించింది. సంజయ్ పోలీస్ క్వార్టర్స్‌లో ఉండటానికి, పోలీస్ వెహికల్‌ను ఉపయోగించుకోవడానికి కూడా అనూపే కారణమని విచారణలో తేలింది. దీంతో అనూప్‌పై ఫోకస్ చేసింది సీబీఐ.. మరి అతడిని కూడా విచారిస్తుందా? అతడికి కూడా పాలిగ్రాఫ్‌ టెస్ట్ నిర్వహిస్తుందా? అనేది చూడాలి.. అంతేగాక మొత్తానికి బెంగాల్‌ ప్రజలతో పాటు.. దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తోంది న్యాయం కోసం.. మీ పనికి మాలిన రాజకీయం కాదని పాలకులు ఎప్పుడూ తెలుసుకుంటారో చూడాలి.

Related News

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

H-1B Visa: రద్దీగా ఎయిర్‌పోర్టులు .. అమెరికాకు ప్రవాసుల పయనం, పెరిగిన విమానాల టికెట్ల ధరలు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

UPS Deadline: UPSలోకి మారాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్-30 డెడ్ లైన్

India Vs Pakistan: ఇస్లామిక్ నాటో పైనే పాకిస్తాన్ ఆశలు.. భారత్‌కు ముప్పు తప్పదా?

Rahul Gandhi: భారత్‌లో కూడా జెన్- Z ఉద్యమం వస్తుంది.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్

Big Stories

×