BigTV English

Jamili Elections: జమిలి ఎన్నికలు.. మోదీకి, చంద్రబాబు షాక్

Jamili Elections: జమిలి ఎన్నికలు.. మోదీకి, చంద్రబాబు షాక్

Jamili Elections: దేశంలోని పెద్ద రాష్ట్రాలలో ఒకటైన మహారాష్ట్రలో బీజేపీ మహా విజయం సాధించింది. ముందు నుంచి జమిలీ మంత్రం పఠిస్తున్న బీజేపీ పెద్దలు మహా గెలుపుతో మహా గెలుపుతో జమిలి ఎన్నికల కసరత్తులో మరింత స్పీడ్ పెంచుతారా? జమిలికి వెళ్లి నాలుగో పర్యాయం అధికారంలోకి రావాలన్న బీజేపీ కల నెరవేరుతుందా? కేంద్రంలో వరుసగా మూడు ఓటముల తర్వాత కూడా బీజేపీ కూటమిని ఎదుర్కోలేకపోతున్న కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?.. అసలు జమిలీ ఎన్నికలపై కూటమి పక్షాల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం ఏంటి?


మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో బీజేపీ జోష్ మీద ఉంది. బీజేపీతో పాటుగా మిత్రపక్షాల నేతలు ఇప్పుడు జమిలికి మద్దతుగా వాయిస్ పెంచుతున్నారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఫలితాల తరువాత పార్లమెంట్ లో జమిలి ప్రక్రియను ప్రారంభించేందుకు నిర్ణయించుకుంది బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం. హార్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. అటు జమ్ము కాశ్మీర్ లోనూ గౌరవమైన సీట్లను సాధించింది.

తాజాగా మహారాష్ట్రలోనూ బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అద్భుత విజయం సాధించి, మూడో సారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైంది. ఝార్ఖండ్‌లోనూ గౌరవప్రదమైన స్థానాలు కైవం సేసుకోగలింది. దాంతో.. ఇప్పుడు మరోసారి దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణ పైన చర్చ మొదలైంది. కేంద్రంలో తక్కువ మెజార్టీతో మూడో సారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీకి మహారాష్ట్ర ఫలితాలతో మిత్రపక్షాల నుంచి రాజకీయంగా ఒత్తిడి తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.


హర్యానా, జమ్ము కాశ్మీర్ మిత్రపక్షాల నుంచి బీజేపీకి కొంత రిలీఫ్ దక్కినట్లైంది. ఇప్పుడు మహారాష్ట్రలోనూ విజయం సాధించడంతో మోడీకి తిరిగి పూర్తి పట్టు సాధించే అవకాశం దక్కింది. ఆ క్రమంలో జమిలి విషయంలోనూ మోదీ మరింత వేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. జమిలి వంటి చారిత్రాత్మక నిర్ణయం అమలుకు ముందు ఈ ఎన్నికలు బీజేపీకి బిగ్ బూస్టప్ ఇచ్చినట్లు కనిపిస్తుంది.

Also Read: ఏపీలో ఘ‌నంగా రాజ్యాంగ దినోత్స‌వ వేడుక‌లు.. హాజ‌రుకానున్న సీఎం చంద్ర‌బాబు

మొత్తమ్మీద ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్న జమిలి ఎన్నికలపై బీజేపీ ఇక ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటారు రాజకీయ విశ్లేషకులు. మహా రిజల్స్ ఇచ్చిన జోష్ తో ఇక దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్దమవుతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ, ఆ పార్టీ కూటమికీ సంబంధించినే పార్టీలే అధికారంలో ఉన్నాయి. దీంతో జమిలి ఎన్నికలు నిర్వహించడానికి ఇదే సరైన సమయమని బీజేపీ భావిస్తుంది.

అందులో భాగంగా వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికలకు సంబంధించిన కీలక బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలనుకుంటుంది. ఈ బిల్లుకు లోక్ సభ, రాజ్యసభలో ఎలాగో ఇబ్బంది లేదు. దీంతో జమిలీ ఎన్నికల బిల్లుకు ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చనేది విశ్లేషకుల అంచనా. ఆ తర్వాత ఇక జమిలి ఎన్నికలకు సంబందించి ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టనుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కేంద్రం జమిలి ఎన్నికలకు వెళ్లడానికే సిద్దపడుతున్నట్లు ఢిల్లీలో ప్రచారం జరగుతుంది.దేశంలో ఎప్పుడూ ఏదో చోట ఎన్నికలు జరగడం వల్ల దేశ అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలుగుతుందనేది బీజేపీ ఉద్దేశం. దీంతో ఈ పరిస్థితులకు ఎలాగైనా చెక్ పెట్టాలని మోదీ, అమిత్ షా ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.

2027లోనే జమిలి ఎన్నికలు జరుగుతాయని గత కొంత కాలంగా ప్రచారంజరుగుతోంది. ఈ క్రమంలోనే దేశంలో జమిలి ఎన్నికలపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి మాత్రం షెడ్యూల్ ప్రకారం 2029లోనే ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు స్పష్టం చేశారు . ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటుండటంతో.. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై రకరకాల చర్చలు మొదలువుతున్నాయి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×