BigTV English

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

AP Liquor Scam Case: మద్యం కుంభకోణంతో నాకు సంబంధం లేదు.. నా కుటుంబ సభ్యులను ఇద్దరిని మద్యం వల్ల కొల్పోయాను..అలాంటి నేను మద్యం వ్యాపారానికి దూరం .. దాని వల్ల వచ్చే ఆదాయానికి కక్కూర్తి పడతానా అని.. పెద్దపెద్ద కబుర్లు చెప్పారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి… అయితే చెవిరెడ్డికి షాక్ కలిగించే వీడియోలు రీలీజ్ చేసి మద్యం కుంభకోణంలో ఆయన అనుయానులదే కీలక పాత్ర అని అంటున్నారు సిట్ అధికారులు.. తాజాగా చెవిరెడ్డి సన్నిహితుడు అయిన వెంకటేష్ నాయుడు విజువల్స్ బయటకు రావడంతో లిక్కర్ స్కాంలో వారి పాత్రపై అనుమానాలకు ఊతమిస్తున్నాయి.. సదరు వీడియోలతో చెవిరెడ్డితో పాటు మాజీ సీఎం జగన్ సైతం కేసుల్లో గట్టిగా ఇరుక్కోవడం ఖాయమంటున్నారు. అసలు ఆ కేసులో ఏం జరుగుతోంది?


చెవిరెడ్డి సన్నిహితుడైన చెరుకూరి వెంకటేష్ నాయుడు

ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి బాల్యస్నేహితుడు, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి.. అయిన చెరుకూరి వెంకటేష్ నాయుడికి చెవిరెడ్డి తో ఉన్న సన్నిహిత సంబంధాలతో వైసీపీలోని అగ్రనాయకులకు పరిచయం అయ్యాడు.. వెంకటేష్ నాయుడు మద్యం స్కామ్ లో కీలక సూత్రధారి అని సిట్ నిర్ధారించింది. అతన్ని ఏపీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ చేసిన సిట్ ఏ 34 నిందితుడిగా చేర్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వెంకటేష్ నాయుడు దేశం వదిలిపోతుండగా బెంగుళూరు విమానాశ్రయ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు సిట్ అదుపులోకి తీసుకుంది..అరెస్ట్ చేసినప్పటి నుంచి చెవిరెడ్డి సుభాషితాలు చెబుతున్నారు చెపుతున్నారు..మద్యం అంటే గిట్టదు..మద్యం కేసులో తమకు సంబందం లేదని అంటున్నారు. ఒక్కోసారి బెదరింపులు.. ఒక్కోసారి బేలగా మాట్లాడుతున్నారు. ఇటీవల కూడా ఇదే విషయాన్ని ఏసీబీ కోర్టకు హాజరైనప్పుడు కూడా.. లిక్కర్ అంటే తనకు ఎలర్జీ అన్నట్లు శుద్దపూసలా మాట్లాడారు..


వైసీపీ, బీఆర్ఎస్‌లకు ఆప్తుడిగా వ్యవహరించిన చెవిరెడ్డి

వైసీపీతో పాటు బీఆర్ఎస్‌కు అత్యంత ఆప్తుడిగా పనిచేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత ఎన్నికల సమయంలో ఆ పార్టీలకు తన సొంత టీమ్‌లతో సర్వేలు కూడా చేయించారు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అప్పట్లో ఆప్తుడైన చెవిరెడ్డి అక్కడా, ఇక్కడా వ్యాపార దందాలు కొనసాగించారంట.. ఆయన తరుపున రియల్ ఎస్టేట్ వ్యవహారాలను హైదరాబాద్ లో వెంకటేష్ నాయుడు చక్కదిద్దే వాడని అంటున్నారు.. దానికితోడు తాడేపల్లి జగన్ నివాసంలో 2022 జగన్ నివాసంలో సంక్రాంతి నాడు తిరుమల దేవస్థానం సెట్టింగ్ వేసి సంబరాలు నిర్వహించారు..ఈసంబరాలలో కూడా వెంకటేష్ కీలక పాత్ర వహించాడంట. దానికి సంబంధించి జగన్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను వెంకటేష్ తన ఫేస్ బుక్ పోస్లులో పేస్ట్ చేశాడు..

వెంకటేష్ వీడియోలతో బిత్తరపోతున్న వైసీపీ నేతలు

అందులో వైసిపి నాయకులందరితోను వెంకటేష్ సన్నిహితంగా ఉన్న పోటోలు ఉన్నాయి.. చివరకు లక్ష్మి పార్వతి పోటోలతో సహా ఉండటం గమనార్హం.. తిరుమల శ్రీవారి దర్శనానికి సైతం వెంకటేష్ మంది మార్బలంతో వచ్చినప్పుడు అక్కడ అధికారులు రాచమర్యాదుల చేసేవారంట.. ఆయా సందర్భాల్లో చెవిరెడ్డికి ఆత్మగా వెంకటేష్ నాయుడు కీలకంగా వ్యవహారించాడని అంటున్నారు.. రెండు రోజుల క్రితం వ్యక్తిగత కక్షతోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కాలేజి రోజుల్లో చంద్రబాబుకి ఉన్న గొడవలను మనుషులో పెట్టుకుని మిథున్ రెడ్డిని అక్రమంగా కేసులలో ఇరికించారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. దానికి బదులుగా వెంకటేష్ వీడియోలు దిమ్మతిరిగే విదంగా ఉన్నాయని అంటున్నారు.

జగన్ లండన్ పర్యటనలో కలిసిన వెంకటేష్

ముఖ్యంగా జగన్ లండన్ పర్యటనలో వెంకటేష్ నాయుడు అయనను అక్కడ కలుసుకున్నట్లు కూడా ఫోటోలు బహిర్గతమ్యాయి.. ఆ సమయంలో జగన్ అర్థిక వ్యవహారాలను వెంకటేష్ టీమ్ పర్యవేక్షించారని అంటున్నారు.. దీనికితోడు తన ఇంటినే మద్యం డబ్బు ఉంచడానికి డెన్ గా ఉంచారని ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి ..అయితే ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ లో నంద్యాల వెంకటేష్ నాయుడు అడ్రస్ చూపిస్తుంది.. మిగతా ఎక్కడా కనిపించడం లేదు.. మొత్తం మీద చెవిరెడ్డితో పాటు వైసిసి నేతలకు దిమ్మ తిరిగే విధంగా వెంకటేష్ వీడియోలు బహిర్గతం అవుతుండటం కలకలం రేపుతోంది.

Also Read: కుప్పకూలిన మరో విమానం.. నలుగురు మృతి

వైసీపీ, బీఆర్ఎస్ నేతలతో వెంకటేష్‌కు సన్నిహిత సంబంధాలు

ఏపి వైసిపి నాయకులకే కాదు తెలంగాణ బిఅర్ఎస్ నాయకులతో కూడా వెంకటేష్ నాయుడు సన్నిహిత సంబందాలు కలిగిఉన్నాడని అంటున్నారు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఅర్ కు సంబంధించి జాతీయ పత్రికలో సైతం వెంకటేష్ నాయుడు 10లక్షల వ్యయంతో యాడ్ వేసాడు.. దీంతో పాటు రెగ్యులర్‌గా కేటీఅర్ తో టచ్ లో ఉండటమే కాకుండా చెవిరెడ్డి సర్వే బృందానికి తెలంగాణ , ఏపిల్లో అవసరమైన నిధుల వ్యవహారం చూసేవాడని సిట్ దర్యాప్తులో బయటపడిందంట.. మొత్తం మీద మద్యం స్కామ్‌లో తనను కుట్రతో ఇరికించారని చెబుతున్న చెవిరెడ్డికి షాక్ తగిలేలా వెంకటేష్ నాయుడు వీడియోలు బయటకు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది.. మరి దీనిపై చెవిరెడ్డి పత్తిత్తు కబుర్లు ఏం చెపుతారో చూడాలి.

Story By Rami Reddy, Bigtv

Related News

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

YCP Vs TDP: పులివెందులలో కాక రేపుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికలు

AP News: జగన్ -పెద్దిరెడ్డి అవినావ బంధం

Kalvakuntla Family Issue: అన్నాచెల్లెళ్ల మధ్య గ్యాప్! అసలు లెక్కలేంటి?

Big Stories

×