Intinti Ramayanam Today Episode August 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతికి తెలియకుండా ప్రణతి భరత్ ల పెళ్లి చేయాలని రాజేంద్రప్రసాద్ అనుకుంటాడు. కానీ అవని మాత్రం మీరు చేస్తున్న తప్పు మామయ్య అత్తయ్య గారిని ఒప్పించే పెళ్లి చేస్తే బెటర్ అని అంటుంది. రాజేంద్రప్రసాద్ అలా చేయడం కాదు ఇప్పుడు ఇలా చేస్తేనే మీ అత్తయ్య దారికి వస్తుందని అంటాడు. అవని మాత్రం అస్సలు ఒప్పుకోదు. అక్షయ్ గూడ అవనికి సపోర్టుగా మాట్లాడుతాడు. అటు ఉదయం లేవగానే భానుమతి అందరితో ప్రణతి పెళ్లి చేయాల్సిందే అని అంటుంది. ఇంటి పెద్దగా నిర్ణయం తీసుకునే హక్కు నాకుంది.
నా నిర్ణయాన్ని ఎవరు కాదనరని నా నమ్మకమని అంటుంది. పార్వతి మాత్రం అసలు ఒప్పుకోను అని అంటుంది. అన్నయ్యని ఎవరు కాదనకూడదు అని భానుమతి అంటుంది. పార్వతి మాత్రం నా కూతురు పెళ్లి నా ఇష్టమైన వాడితోనే చేస్తాను అత్తయ్య ఈ దాంట్లో నా నిర్ణయం మార్చుకోను అని చెప్తుంది. కానీ భానుమతి మాత్రం నా నిర్ణయం కాదంటే నేను చచ్చిపోతాను అని అసలు నిజం అని బయట పెట్టేస్తుంది. ఆయన నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు అని అంటుంది. ఏంటి ఎవరు చేశారు ఎవరు చెప్పారు అని ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. నువ్వు భరత్ ను పెళ్లి చేసుకొనే ముందు నువ్వు బాగా ఆలోచించు అని ప్రణతికి సలహా ఇస్తాడు అక్షయ్. అంతేకాదు తన గురించి చెప్తాడు. నన్ను బాగా చూసుకుంటుంది నాకు అన్నిట్లో సపోర్ట్ గా ఉంటుందని అనాధాశ్రమంలో పెరుగుతున్న ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి వల్లే మన కుటుంబం ఇలా ముక్కలైంది అన్న విషయం నీకు తెలిసిందే.. నువ్వు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకో అని అంటాడు. ప్రణతి ఎంత చెప్పిన అవని తప్పు చేసిందని అంటాడు. అవని పార్వతితో ప్రణతి పెళ్లి విషయం గురించి మాట్లాడాలని అనుకుంటుంది. ఆ ఇంటికి వెళ్ళగానే పార్వతి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్న నీతో నేనేంది మాట్లాడేదేని పార్వతి అంటుంది..
ఏం చెప్తుందో వినొచ్చు కదా అని భానుమతి అంటుంది.. పల్లవి అప్పుడే వచ్చి నువ్వు నీ తమ్ముడి పెళ్లి చేయాలని అనుకుంటున్నావా? నువ్వు ఎవరూ లేరు ఒంటరిగా ఉన్నాను అంటున్నావ్ కదా.. నువ్వు ప్రతిసారి ఇక్కడికి వస్తున్నావు. అది నువ్వు ఆలోచించవా అని పల్లవి అంటుంది.. ప్రణతి భరత్ల పెళ్లి కోసమని నువ్వు ప్రతిసారి ఇక్కడికి వస్తున్నావు. కావాలనే ఇదంతా చేస్తున్నామని అర్థమవుతుంది అని పల్లవి అంటుంది. అంతేకాదు పార్వతీ పల్లవి మాటలు విని అవనిని బయటికి తోసేస్తుంది..
పల్లవి అవని వచ్చిన విషయాన్ని తన తండ్రికి చెప్పాలని బయటకు వెళుతుంది. అవని ఇంత అవమానం జరిగినా కూడా మళ్లీ వచ్చిందంటే మనం ఏదో ఒకటి చేయాల్సిందే అని చక్రధర్ అంటాడు. అయితే ఆ భరత్ ని ఏదో ఒకటి చేయాలి వాడు చెడ్డవాడని నిరూపిస్తే అందరూ చీకొట్టి వెళ్ళిపోతారు అని చక్రధరంటాడు.. నువ్వు చెప్పిన ఐడియా బాగానే ఉంది డాడ్ అలానే చేద్దామని పల్లవి అంటుంది. భానుమతి తన భర్త తనని అడ్డంగా ఇరికించాడు అని బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వచ్చినా కమలాకర్ నా గురించి చెప్తావా అని కొడతాడు.
భానుమతి పెట్టిన కేకలకి ఇంట్లోని వాళ్ళందరూ వస్తారు.. కమల్ తెలివిగా తప్పించుకుంటాడు. అవని బాధపడుతూ ఉంటుంది.. రాజేంద్రప్రసాద్ అవని ఎక్కడికో వెళ్లిందని వెతకడానికి బయటకు వెళ్తాడు.. ఇంటికొచ్చిన రాజేంద్రప్రసాద్ అవని ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవచ్చు అని అంటాడు. అత్తయ్య నువ్వు చెప్పిన మాట వినదు కాబట్టే నేను వాళ్ళిద్దరికీ ద్దరికీ పెళ్లి చేయాలని అనుకున్నాను అని అంటాడు.. నువ్వు ఎన్నిసార్లు ఇలా వెళ్లిన సరే బాలు నేను అవమానిస్తూనే ఉంటారు అని అంటాడు. ఇక తర్వాత ప్రణతి భరత్ ని పిలిచి మనం ఏదో ఒకటి చేయాలి వదినకు అవమానం జరుగుతుంది అని ఆలోచిస్తారు.
Also Read: హమ్మయ్య.. పూజను పూర్తి చేసిన రోహిణి.. బాలు సెటైర్లు.. మనోజ్ కు కడుపు మంట..
మా అమ్మ తన నిర్ణయాన్ని మార్చుకునేలా కనిపించలేదు.. మనమే ఏదో ఒకటి చేయాలి అని అంటుంది. భరత్ మాత్రం మా అక్క మీ అమ్మ ఒప్పుకున్న తర్వాతే పెళ్లి అంటుంది. వీళ్ళిద్దరూ పంతం ముందు మనం బలైపోయేలా ఉన్నాము ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని ప్రణతి భరత్ తో అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ప్రణతి భరత్ లో ఇంట్లోంచి పారిపొయ్యేందుకు ప్లాన్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…