Ashwin Kumar:ఒక సినిమా సక్సెస్ అయ్యింది అంటే.. ఆ సినిమా వెనుక పడ్డ కష్టం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేనిది. ఒక్కోసారి ఆస్తులు కోల్పోవాల్సి వచ్చింది. మరికొన్నిసార్లు ఆర్టిస్టుల ప్రాణాలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొంతమంది కట్టుకున్న వారి ఆస్తులను, నగలను కూడా తాకట్టుపెట్టి మరీ తమ డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఎన్నో కష్టాలు పడి సక్సెస్ సాధించి, లైమ్ లైట్ లోకి వచ్చిన డైరెక్టర్స్ లో అశ్విన్ కుమార్ (Ashwin Kumar) కూడా ఒకరు. ‘మహావతార్ నరసింహ’.. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ యానిమేటెడ్ చిత్రం ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. జూలై 25న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే అద్భుతమైన స్పందన రావడంతో అటు వసూళ్ల పరంగా కూడా రికార్డులు సృష్టిస్తోంది.
భార్య ఆస్తులు కూడా తాకట్టు పెట్టాను -డైరెక్టర్
ఇప్పటికే రూ.105 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో సత్తా చాటుతోంది ఈ సినిమా. ఇకపోతే ఈ మహావతార్ నరసింహ సూపర్ హిట్ కావడంతో ఈ చిత్ర దర్శకుడు అశ్విన్ కుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్లు చేశారు. ప్రముఖ డైరెక్టర్ అశ్విన్ కుమార్ మాట్లాడుతూ.. “ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను. ఒక రకంగా చెప్పాలి అంటే నా జీవితంలో సంపాదించిన డబ్బు మొత్తాన్ని ఈ సినిమా కోసమే ఖర్చు చేశాను. అటు మా తల్లిదండ్రులతో పాటు నా భార్య తరఫున వారి ఆస్తులు కూడా తాకట్టు పెట్టాను. నా భార్య నగలు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. ఆఖరికి సొంత ఇల్లు కూడా తాకట్టు పెట్టి వడ్డీలు కట్టుకుంటూ ఈ సినిమా తీశాను” అంటూ సినిమా సక్సెస్ వెనుక ఉన్న అసలు కష్టాన్ని తెలియజేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు అశ్విన్ కుమార్.
మహావతార్ నరసింహ మూవీ విశేషాలు..
అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోం భలే ఫిలిమ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుషల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా మహావతార్ నరసింహ యానిమేటెడ్ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఇటీవలే హైదరాబాద్ కి వచ్చి ఏఏఏ (ఏషియన్ అల్లు అర్జున్ ) సినిమాస్ లో తన సినిమాను వీక్షించి ఆడియన్స్ నుంచీ వస్తున్న ఆదరణ చూసి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు డైరెక్టర్. ఇక ప్రస్తుతం డైరెక్టర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికైతే ఎటువంటి తారాగణం లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి విడుదలైన అతి తక్కువ సమయంలోనే 100 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది.
మహావతార్ పవన్ కళ్యాణ్ చూడాలి – అల్లు అరవింద్
ఇక ఈ సినిమాను తెలుగులో గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ (Allu Aravindh) పంపిణీదారుడిగా వ్యవహరించారు. అటు ఈయన కూడా ఈ సినిమాను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కచ్చితంగా చూడాలి అని ఇటీవల జరిగిన సక్సెస్ మీట్ లో వెల్లడించిన విషయం తెలిసిందే. మరి పవన్ కళ్యాణ్ ఈ సినిమాను చూసి ఎప్పుడు తన రివ్యూని పంచుకుంటారో అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.
ALSO READ:Mega 157: అన్నయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆ రోజే టైటిల్, రిలీజ్ డేట్ ప్రకటన!