Breaking News: అమెరికాలోని మరో విమాన ప్రమాదం జరిగింది. ఉత్తర ఆరిజోనాలోని నవజో నేషన్‌లో నిన్న జరిగిన ఒక విషాదకర విమాన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అయితే చిన్లే సమీపంలోని ఓ ఆసుపత్రి నుంచి రోగిని తీసుకెళ్లేందుకు ఎయిర్ అంబులెన్స్ బయలుదేరింది. ఈ క్రమంలో ఫ్లైట్‌లో ఉన్నటుండి సాంకేతిక లోపం తలెత్తడంతో ఫైలెట్ పూర్తిగా నియంత్రణ కోల్ఫోయింది. దీంతో ఫ్లైట్ కూలినట్టుగా చిన్లే పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ ప్రమాదం సంభవించిన వెంటనే విమానంలో మంటలు చెలరేగడంతో, బోర్డులో ఉన్న నలుగురు సిబ్బంది ఒక పైలట్, ఇద్దరు వైద్య సిబ్బంది, ఒక రోగి ప్రాణాలు కోల్పోయారు.
అయితే విమానం కూలిన తర్వాత విమానంలో చెలరేగిన తీవ్రమైన మంటలు రెస్క్యూ కార్యకలాపాలను సంక్లిష్టం చేశాయి.. దీంతో బాధితులను రక్షించే అవకాశం లేకుండా పోయింది. ఈ ఘటనకు సంబంధించిన ఖచ్చితమైన కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. అంతేకాకుండా జాతీయ రవాణా భద్రతా బోర్డు (NTSB) ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు .
Also Read: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా
నవజో నేషన్ అధ్యక్షుడు బువు న్యూగ్రెన్ ఈ ఘటనను “విషాదకర నష్టం”గా తెలిపారు.. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే ఈ ఘటనపై దర్యాప్తు పూర్తయ్యే వరకు విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేయబడుతుందని చెప్పారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు.
అమెరికాలో కుప్పకూలిన విమానం.. నలుగురు మృతి
నవజో నేషన్ లో ఎయిర్ అంబులెన్స్ విమానం క్రాష్ ల్యాండింగ్
కూలిన వెంటనే చెలరేగిన మంటలు
ఈ ఘటనలో నలుగురు వైద్య సిబ్బంది మృతి చెందినట్లు అధికారుల వెల్లడి pic.twitter.com/uUArsYdAqo
— BIG TV Breaking News (@bigtvtelugu) August 6, 2025