ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొంతమంది అధికారులు వైసీపీ ప్రభుత్వం హయాంలో తెగ రెచ్చి పోయారు. ప్రభుత్వ ఉద్యోగులమని మర్చిపోయి వైసీపీ కార్యకర్తల్లా చెలరేగిపోయారన్న ఆరోపణలున్నాయి. చివరకు సీనియర్ నాయకుడు అయిన టీడీపీ అధినేత చంద్రబాబును సైతం ఎక్కడా లేక్క చేయలేదు. వైసిపి పెద్దలు చెప్పిందే అలస్యం రెచ్చిపోయి మరీ చంద్రబాబును కూడా జిల్లాలో చికాకు పెట్టారు. టీడీపీ కార్యాలయాలను సైతం ఖాళీ చేయించారు. అయితే ఇవేమి అటు చంద్రబాబుకు కాని వారి క్యాడర్ కు కాని గుర్తున్నట్లు లేదు. బదీలీలపై ఇతర ప్రాంతాలకు వెళ్ళిన అటువంటి వంటి వారికి తిరిగి తిరుపతిలో అవకాశం ఇవ్వమంటూ సీఎంఓకు లేఖ రాసారంట. దాంతో అసలేం జరుగుతుందో అర్థం కాక తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు.
కుప్పం మున్సిపాలిటి ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట స్థాయిలో అక్కడ జరిగిన గొడవలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. టిడిపి వేసిన నామినేషన్లు చెల్లకుండా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓటర్ల జాబితాలో లేని అనేక మంది వచ్చి ఓట్లరు బయట ప్రాంతాల నుంచి ఓట్లు వేశారు. దీంతో పాటు అప్పట్లో ఎన్నికల ఇన్చార్జీగా పనిచేసిన మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి, ప్రస్తుత ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిలను అనేక ఇబ్బందులకు గురిచేసారు. తిరుపతి నగర పాలక సంస్థలో సుదీర్ఘ కాలంగా పాతుకు పోయిన కెఎల్ వర్మ అని అప్పట్లో టీడీపీ శ్రేణులు బాహటంగానే ఎండగట్టాయి
వర్మని కేవలం కుప్పం ఎన్నికల కోసం తిరుపతి నుంచి బదిలీ చేయించుకున్న అక్కడి వైసీపీ నేతలు అయన చేత తమకు కావాల్సిన విధంగా పనులు చేయించుకున్నారు. కుప్పం మున్సిపాల్టీలో వైసిపి గెలుపులో కీలక పాత్ర కెఎల్ వర్మదే అన్న విషయం కుప్పంలో ఓపెన్ సీక్రెట్టే. ఆయన పుంగనూరు మున్సిపల్ కమిషనర్ గా పనిచేసినప్పుడు టిడిపి కార్యాలయం ఉన్న భవన యాజమానిని బెదిరించి మరీ ఖాళీ చేయించారన్న ఆరోపణలున్నాయి. టీడీపీ క్యాడర్ తో పాటు అనేక మందిని ఇబ్బందులకు గురి చేసారంటారు.
అలాంటి అధికారిని గత నెలలో తిరుపతి నుంచి బదిలీ చేస్తే.. అయన అరోగ్య పరిస్థితుల దృష్ట్యా తిరిగి తిరుపతిలో అవకాశం ఇవ్వమని మున్సిపల్ డైరెక్టర్ తో పాటు సీఎంఓ కార్యాలయం నుంచి తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ కు లేఖ వచ్చిందంట. రేపూ మాపో తాను తిరిగి తిరుపతి కార్యాలయంలో ప్రత్యక్షం అవుతానని, తనను ఎవ్వరు ఏమీ చేయలేరని అంటున్నారంట పెద్దిరెడ్డి అనుచరుడిగా ముద్ర ఉన్న కెఎల్ వర్మ.
Also Read: ఓడిపోయిన మేమింతే.. ఉషాశ్రీ చరణ్ దెబ్బకి అయోమయంలో వైసీపీ
అదే కార్యాలయంలోని మేనేజర్ చిట్టిబాబు, డీఈ విజయ్ కూమార్ రెడ్డిలు కూడా బదిలీ అయ్యారు.. వీరికి కూడా తిరిగి తిరుపతిలోనే పోస్టింగ్ ఇమ్మని మున్సిపల్ డైరెక్టర్ నుంచి సిఫార్సు రావడంతో అసలేం జరుగుతుందో అంతుపట్టడం లేదని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. వారిద్దరు కూడాగత ఐదు సంవత్సాలు తిరుపతి నగర పాలక సంస్థలో అన్నీ తామై నడిపించారంట .మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పిందే అలస్యం అన్నట్లు అడ్డగోలుగా చక్రం తిప్పారంట. భూమన అక్రమ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలన్ని ఆ ఇద్దరే నడిపారంటున్నారు.
ప్రభుత్వం మారగానే తెలుగు తమ్ముళ్లు ఫిర్యాదులు చేయడంతో వారిని బదిలీ చేసారు..అయితే ఇప్పుడు వారిని తిరిగి తిరుపతి రప్పించుకోవడానికి ఎవరు పావులు కదుపుతున్నారో అర్థంకాక టీడీపీ కేడర్ తెగ చర్చించుకుంటుంది. ఇక గతంలో టీడీఅర్ బాండ్ల వ్యవహారంలో కీలక పాత్రధారిగా ఉన్న ఓ టౌన్ ప్లానింగ్ అధికారిని కూడా తుడా కార్యాలయాలని తీసుకు రావడానికి అతని సామాజిక వర్గానికి చెందిన మాజీ తుడా చైర్మన్ తెగ ప్రయత్నాలు చేస్తున్నాడంట. గతంలో ఎవ్వరు అయితే ఆ అధికారిపై ఫిర్యాదులు చేసారో వారి ద్వారానే తిరిగి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడంట.
కుప్పం నగర పంచాయతీకి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గా చిట్టిబాబు , స్పెషలాఫీసర్ గా కె అల్ వర్మ పనిచేసిన సమయంలోనే ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా ఎన్నికల వ్యవహారాన్ని మొత్తం వీరిద్దరే నడిపించారు.. గెలిచినవారు ఓడిపోయినట్టుగాను ఓడిన వారు గెలిచినట్లుగాను రికార్డులు మార్చారని వారి మీద ఆరోపణలు ఉన్నాయి ..అయితే వారిద్దరి కాపాడ్డానికి ప్రయత్నిస్తున్నది ఎవరు సీఎంఓ వరకు వీరు వెళ్లడానికి సహకరించింది ఎవరు అన్న విషయం మీదనే ఇప్పుడు తిరుపతిలో చర్చ నడుస్తుంది .మరోవైపు కుప్పం తెలుగు తమ్ముళ్లు అయితే వీరిద్దరి పేరెత్తితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన ఈ వ్యక్తులకు ఎవరు సిఫార్సు లేటర్లు ఇస్తున్నారో? అని తిట్టి పోస్తున్నారు
తమ ఆరోగ్యం సరిగా లేదని సాకు చూపి అమలాపురం, బాపట్ల నుంచి వారిద్దరూ తిరిగి తిరుపతిలో పాగా వేయడానికి చూస్తుడటం తిరుపతిలో హాట్ టాపిక్‌గా మారింది. అడ్డగోలు అదికారులు, వైసిపి కి అనుకూలంగా పనిచేసిన అధికారులకు కీలక పోస్టింగ్ లు ఇప్పించడానికి ఎవ్వరు ప్రయత్నిస్తున్నారనే అంశంపై తిరుపతి కూటమిలో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. స్థానికంగా కొందరు నారాయణ సంస్థల ఉద్యోగులు లాబీయింగ్ చేస్తున్నారని, వారికి వైసిపి నాయకులతో వ్యాపారాలు ఉన్నాయని.. అందుకే ఈ వ్యవహారం నడిపిస్తున్నారని టిడిపి నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా అలాంటి అధికారులు తిరిగి తిరుపతి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు. మరి చూడాలి ఈ వ్యవహారం ఏ మలుపులు తిరుగుతుందో