శ్రీ సత్య సాయి జిల్లాలో పెనుగొండ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. పెనుగొండ నుంచి టిడిపి అనేకసార్లు అప్రహతిహంగా గెలిచి ఆ సెగ్మెంట్లో బలమైన కేడర్ ఏర్పాటు చేసుకుంది.పెనుగొండ నుంచి పరిటాల రవి మూడు సార్లు ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య పరిటాల సునీత ఒక్కసారి గెలుపొందారు. మొత్తంగా ఇప్పటివరకు 8 సార్లు పెనుగొండ నుంచి టీడిపి విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి శంకర నారాయణ వైసిపి నుంచి గెలుపొందారు. ఆ తర్వాత పరిణామాలు మాత్రం మారిపోయాయి.
2024 ఎన్నికల్లో మాజీ మంత్రి శంకర నారాయణని కాదని కళ్యాణదుర్గం నుంచి వలస వచ్చిన మాజీ మంత్రి ఉష శ్రీ చరణ్ కు జగన్ టికెట్ కేటాయించారు.. ఆ ప్రయోగం వికటించి ఉష శ్రీ చరణ్ ఘోర పరజయం పాలయ్యారు.. ఇక అప్పటి నుంచి పెనుగొండలో పట్టు పెంచుకోవాలని చూస్తున్న ఉష శ్రీచరణ్‌కు అక్కడ పార్టీ పరిస్థితులు కలిసి రావడం లేదంట. మాజీ మంత్రి శంకరనారాయణ తిరిగి పెనుకొండ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ పదవి ఆశిస్తున్నారు. అందులో భాగంగా మండల స్థాయిలో తన వర్గీయులతో సమావేశాలు పెట్టి మాజీ మంత్రి ఉషాశ్రీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.
పార్టీ అధ్యక్షుడు జగన్, ఇతర పార్టీ పెద్దల వద్దకు పంపి నియోకవర్గ ఇన్చార్జ్ పదవి శంకర్ నారాయణకే ఇవ్వాలని స్థానిక నేతలతో రాయబారాలు నడిపిస్తున్నారంట. అందులో భాగంగా సోమందేపల్లి, గోరంట్ల తదితర మండలాల్లో శంకరనారాయణ వర్గీయులు రహస్యంగా సమావేశం నిర్వహించినట్లు తెలియవచ్చింది. అయితే పెనుగొండ పాలిటిక్స్‌లో సెటిల్ అవ్వాలని చూస్తున్న మాజీ మంత్రి ఉషాశ్రీ సైతం తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు.
Also Read: రూటు మార్చిన జగన్.. నా చెల్లినే అంటారా..?
అసమ్మతి కార్యక్రమాలకు తెరలేపుతున్న వారిలో మండలానికి ఒకరిని అయినా పార్టీ రాష్ట్ర నాయకత్వం ద్వారా సస్పెండ్ చేయించాలని ఉష శ్రీ చరణ్ స్కెచ్ గీస్తున్నట్లు తెలిసింది. ఆమెను జగన్ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా నియమించడంతో తనకి ఎదురు తిరిగిన వారిని ఇప్పటికే సస్పెండ్ చేసి శంకరనారాయణ వర్గాన్ని బలహీనపర్చడానికి పావులు కదుపుతున్నారు. అక్కడి వరకు బాగానే ఉన్నా సస్పెండ్ చేసిన తర్వాత పరిణామాలు ఆమెకు ఊహించని షాక్ ఇస్తున్నాయంట. ఆమె సస్పెండ్ చేసినా ముగ్గురు నేతలు ఆయా మండలాల్లో పట్టున్న వారే వారంతా కలసి ఓ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి భారీ స్పందన వచ్చింది. ఆ మీటింగ్‌లో పెనుగొండకు ఉష శ్రీ చరణ్ వద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు.
అసమ్మతి వర్గం సమావేశానికి వచ్చిన రెస్పాన్స్‌తో ఉషశ్రీకి మైండ్ బ్లాంక్ అయిందట.. ఆ క్రమంలో ఎక్కడో కళ్యాణదుర్గం లో ఉన్న తనను జగన్ అనవసరంగా ఇక్కడికి తీసుకువచ్చారని ఆమె తెగ బాధపడిపోతున్నారంట .. నిజానికి కళ్యాణదుర్గంలో కూడా ఆమె మంత్రిగా స్వకార్యాలు చక్క పెట్టుకుని పార్టీని సర్వనాశనం చేశారన్న ఆరోపణలున్నాయి. అక్కడ కూడా భారీ ఎత్తున నిరసన గళాలు వినిపించాయి.. అందుకే జగన్ ఆమెను పెనుగొండకు షిఫ్ట్ చేశారంట. కళ్యాణ్ దుర్గం లో పార్టీని ముంచి ఇక్కడికి వచ్చావా తల్లీ.. అని పెనుగొండ వైసీపీ దితీయ శ్రేణి నాయకులు వాపోతున్నారు. ఇటీవల జరిగిన అసమ్మతి వర్గం మీటింటులో ఉష శ్రీ చరణ్ ను జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నుంచి బహిష్కరించాలని తీర్మానం చేయడం విశేషం.
ఉషా శ్రీ చరణ్ ఒంటెద్దు పోకడలతో తాము కేవలం ఆరు నెలలకు విసిగిపోయామని, ఆమె చేస్తున్న ప్రత్యర్థి పార్టీతో తలపడకుండా.. తమపైనే రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని పెనుగొండ వైసీపీ కేడర్ ఆరోపిస్తుంది … కాకపోతే ఆమె కు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలు ఉండటంతో జిల్లాలో ఆమె ఆడింది ఆట పాడింది పాటగా సాగిపోతుందని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి పెనుగొండ వైసీపీని జగన్ ఎలా ట్రాక్‌లో పెట్టే ప్రయత్నం చేస్తారో ?