BigTV English

Gudivada Amarnath: చోడవరం అయినా మిగులుతుందా? అయోమయంలో గుడివాడ అమర్ నాథ్

Gudivada Amarnath: చోడవరం అయినా మిగులుతుందా? అయోమయంలో గుడివాడ అమర్ నాథ్

Gudivada Amarnath: ఆ మాజీ మంత్రి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు అవుతుంది. ఆ మాజీ మంత్రి మాత్రమే కాదు ఆయన తండ్రి, తాతలు కూడా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. ఆ రోజుల్లో వాళ్లకి ఓ సొంత నియోజకవర్గ ఉంది. కానీ ఈ మాజీ మంత్రికి 20 ఏళ్ల రాజకీయ జీవితంలో సొంత నియోజకవర్గం అంటూ లేకుండా పోయింది. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఆయన పోటీ చేసే సెగ్మెంట్ మారిపోతుంటుంది. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి నాన్ లోకల్ అన్న ట్యాగ్ మెడకు వేలాడుతుండటంతో.. భయపడుతూనే ఎన్నికల బరిలోకి దిగుతుంటారు. ఇంతకీ సొంత నియోజకవర్గంలో లేని ఆ మాజీ మంత్రి ఎవరు? 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయనకు ఆ పరిస్థితి ఎందుకొచ్చింది?


పోటీకీ సొంత సెగ్మెంట్ లేని గుడివాడ అమర్‌నాథ్

విశాఖపట్నం జిల్లాలో దాదాపు రాజకీయ నాయకులు అందరికీ చెప్పుకోవడానికి సొంత నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ సెగ్మెంట్ టికెట్ తమదే అన్న ధీమాతో ముందు నుంచే వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు . అలాంటి విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు మాత్రం సొంత నియోజకవర్గంలో లేకుండా పోయింది. గుడివాడ అమర్నాథ్ రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. దివంగత నేత, మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు వారసుడుగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన గుడివాడ అమర్నాథ్ కు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఎక్కడ నుంచి పోటీ చేయాలో అర్థంకాని పరిస్థితి.


పెందుర్తి నుంచి రాజకీయం చేసిన అమర్‌నాథ్ తండ్రి, తాత

అమర్‌నాథ్ తండ్రి, తాత ఇద్దరూ పెందుర్తి నియోజకవర్గం నుంచే రాజకీయం చేశారు. అక్కడ నుండే బరిలో నిలిచి, గెలిచి సత్తా చాటారు. గుడివాడ గురునాథరావు వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అమర్నాథ్ మాత్రం ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పార్టీ ఎక్కడ టికెట్ ఇస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. గుడివాడ కార్పొరేటర్ స్థాయి నుండి మంత్రిగా ఎదిగిన గుడివాడ అమర్‌నాథ్.. కాంగ్రెస్‌తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తర్వాత టీడీపీలో చేరి ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. అమర్నాథ్ తండ్రి పెందుర్తి నియోజకవర్గం నుండి గెలిచి మంత్రి అయినా ఆ నియోజకవర్గంలో గుడివాడ అమర్నాథ్ పాగా వేయలేకపోయారు.

టీడీపీలో గాజువాక కార్పొరేటర్‌‌‌గా గెలిచిన అమర్ నాథ్

2014కి ముందు కాంగ్రెస్ పార్టీలో నుంచి టీడీపీలో జాయిన్ అయిన గుడివాడ అమర్నాథ్ గాజువాక నుంచి కార్పొరేటర్ గా గెలిచారు. తర్వాత 2014లో వైసీపీలో జాయిన్ అయి గాజువాక టికెట్ ఆశించారు … గాజువాకలో తిప్పల నాగిరెడ్డికి జగన్ అవకాశం ఇవ్వడం, గుడివాడ అమర్నాథ్ ని అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలో దించడంతో పక్క నియోజకవర్గాల్లోకి వలస వెళ్లాల్సి వచ్చింది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైన గుడివాడ అమర్నాథ్ 2019 ఎన్నికల్లో అదే అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

పవన్‌ను తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన అమర్‌నాథ్

గెలిచి మంత్రి అయిన తర్వాత అమర్‌నాథ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసి సొంత సామాజికవర్గానికి దూరమయ్యారు. అయితే ఆ నోటీ దూకుడే ఆయన్ని జగన్‌కు సన్నిహితుడ్ని చేసింది . 2024 ఎన్నికల్లో మళ్లీ అనకాపల్లి నియోజకవర్గ నుండి బరిలోకి దిగడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అవినీతి ఆరోపణలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండరు అనే పేరు, నాన్ లోకల్ అనే ముద్ర పడడం, రాజకీయ వర్గ పోరు, సొంత వర్గంలో నెగిటివ్ ఉండడంతో గుడివాడ అమర్నాథ్‌కు అప్పటి సీఎం జగన్ అనకాపల్లి టికెట్ లేకుండా చేశారు. దాంతో దిక్కులు చూస్తున్న ఆయన్ని చివరి నిముషంలో జగన్ గాజువాక బరిలో నిలిపారు.

తిరిగి గాజువాక నుంచే పోటీ చేయాలని భావించిన అమర్‌నాథ్

మొన్నటి ఎన్నికల్లో గుడివాడ అమర్‌నాథ్ గాజువాక నుంచి రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ల తేడాతో ఓటమి మూటగట్టుకున్నారు. అంతవరకు బానే ఉన్నా ఎన్నికల తర్వాత గుడివాడ అమర్నాథ్‌ గాజువాకలోనే పాగా వేయాలని చూశారు. అయితే సారి కూడా ఆయనకు చుక్కెదురైంది ..గాజువాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఫ్యామిలీదే అని కన్ఫామ్ చేసినజగన్ గాజువాక వైసీపీ ఇన్చార్జిగా నాగిరెడ్డి కుమారుడు తిప్పల దేవన్ రెడ్డిని నియమించారు. ఈ సారి గుడివాడ అమర్నాథ్ ను చోడవరం నియోజకవర్గానికి ఇన్చార్జిగా పంపించారు.

అవంతి రాజీనామాతో భీమిలీ వైపు చూసిన అమర్‌నాథ్

ఇప్పటి నుండే 2028 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు వస్తాయని.. అప్పుడు విజయం సాధించి ముప్పై ఏళ్లు రాష్ట్రాన్ని ఏలుతానని కలలు కంటున్న జగన్.. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాలకు ఇన్చార్జిలను మారుస్తూ కొత్త కొత్త వారిని తెరపైకి తెస్తున్నారు. గాజువాక నియోజకవర్గం నుండి అవకాశం లేదని తేలడంతో గుడివాడ అమర్నాథ్ భీమిలి నియోజకవర్గం మీద మోజు పడ్డారు. భీమిలి మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేయడంతో 2029 ఎన్నికల్లో భీమిలి నుండి బరిలోకి దిగొచ్చని భావించారు. అయితే జగన్ భీమిలి నియోజకవర్గం ఇన్చార్జిగా బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావును నియమించి గుడివాడ అమర్నాథ్ కు ట్విస్ట్ ఇచ్చారు.

Also Read: కదిరి ఎక్స్‌పైర్ అయినట్లేనా? బాబూరావు దారెటు

భీమిలీలో మీటింగులు పెట్టి హడావుడి చేసిన గుడివాడ

గాజువాక నియోజకవర్గం చేజారిపోయిన వెంటనే భీమిలి నియోజకవర్గం ఖాళీ అవడంతో.. అమర్‌నాథ్ అక్కడ మీటింగులు పెడుతూ సొంత వర్గాన్ని తయారు చేసుకోవడానికి పాట్లు పడ్డారు. అయితే చోడవరం నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించడంతో చేసేది లేక తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడకి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ తమాషా ఏంటంటే 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న ఆయన ఓటేసేది గాజువాక నియోజకవర్గంలో.. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయినా సొంత జిల్లాలో అమర్నాథ్ కు నియోజకవర్గం లేకపోవడం మాత్రం వింతగా కనిపిస్తుంది.

అమర్ నాథ్‌కు సహకరించని కరణం ధర్మశ్రీ క్యాడర్

విశాఖ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి నాయకులు ఉండటంతో.. అమర్‌నాథ్ అనకాపల్లి జిల్లాలోని చోడవరం షిఫ్ట్ అవ్వక తప్ప లేదు. చోడవరం నియోజకవర్గం దూరం, భారం అని గుడివాడ అమర్నాథ్ అనుచరులు అప్పుడే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దానికి తోడు నాన్ లోకల్ ఇష్యూ కచ్చితంగా వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికే అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఇన్చార్జిగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ క్యాడర్ గుడివాడ అమర్నాథ్ కు సహకరించే పరిస్థితి లేదంట.. ఇవన్నీ సహచరుల దగ్గర చెప్పుకుంటూ గుడివాడ అమర్నాథ్ మధన పడుతున్నారంట. మరి జగన్ చోడవరం సెగ్మెంట్‌ని అయినా అమర్‌నాథ్‌కు పర్మనెంట్ చేస్తారో? లేదో చూడాలి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×