E-Paper
Advertisement

OTT Movie : భర్త చావుకి రివేంజ్ తీర్చుకునే భార్య… ట్విస్ట్ లతో అదరగొట్టే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : భర్త చావుకి రివేంజ్ తీర్చుకునే భార్య… ట్విస్ట్ లతో అదరగొట్టే క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రైమ్ స్టోరీలు, వెబ్ సిరీస్ లను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన ఇటువంటి సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునే క్రైమ్ థ్రిల్లర్ మూవీ తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఇందులో రజిని తన భర్తని చంపిన వాళ్లపై రివేంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. చివరివరకు ఈ మూవీ ట్విస్ట్ లతో కుర్చీలకి కట్టిపడేస్తుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే..

ఆహా (aha) లో

Advertisement

ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘రెజీనా’ (Regina). 2023 లో వచ్చిన ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి  రెజీనా డొమిన్ దర్శకత్వం వహించారు. డి. సిల్వా, ఎల్లో బేర్ ప్రొడక్షన్ బ్యానర్‌పై సతీష్ నాయర్ ఈ మూవీని నిర్మించారు. ఇందులో సునైనా టైటిల్ రోల్‌లో నటించగా, అనంత్, బావ చెల్లదురై, గజరాజ్, సాయి ధీనా, రీతు మంత్ర, నివాస్ అధితన్, వివేక్ ప్రసన్న మరియు అజీష్ జోస్ సహాయక పాత్రల్లో నటించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

రజిని పోలీస్ స్టేషన్ కి వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తుంది. తన భర్తని చంపిన వాళ్లను పట్టుకునే క్రమంలో స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే పోలీసులు ఆమెకు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుంటారు. రజిని ఎలాగైనా నిందితులను శిక్షించాలనుకుంటుంది. రజిని భర్త బ్యాంకు లో ఎంప్లాయ్ గా పనిచేస్తుంటాడు. ఒకరోజు బ్యాంకు రాబరికి వచ్చిన దొంగలు రజిని భర్తను దారుణంగా కొడతారు. ఆ దాడిలో రజిని భర్త తీవ్రంగా గాయపడతాడు. హాస్పిటల్ కి తీసుకు వెళ్లేలోగానే అతను తీవ్ర గాయాలతో చనిపోతాడు. చిన్నప్పుడే తండ్రిని కూడా ఇలాగే పోగొట్టుకుని ఉంటుంది రజిని. ఇప్పుడు భర్త కూడా పోవడంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. చాలా రోజులు ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోతుంది. ఆ తర్వాత భర్త చావుకి కారణమైన వాళ్ల పై పగ తీర్చుకోవాలనుకుంటుంది.

ఈ క్రమంలోనే దోపిడీ చేసిన గ్యాంగ్లో ఒకన్ని కలుస్తుంది. అతని భార్యని కిడ్నాప్ చేసి, మిగతా వాళ్ళని చంపడానికి అతని హెల్ప్ తీసుకుంటుంది. ఆ తర్వాత వీళ్ళందరికీ పెద్ద డాన్ ఒకడు ఉంటాడు. వాన్ని చంపడానికి కూడా హీరోయిన్ వెళ్తుంది. అయితే అతన్ని చంపడం కస్టమని చెప్పినా వినకుండా వెళ్తుంది. ఆ విషయం గ్యాంగ్ స్టర్ పసిగడుతాడు. చివరికి  హీరోయిన్ ఆ గ్యాంగ్ స్టర్ ని చంపుతుందా? పోలీసులు హీరోయిన్ ను అరెస్ట్ చేస్తారా? భర్త చావుకి కారణమైన వాళ్లపై ప్రతీకారం తీర్చుకుంటుందా ? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘రెజీనా’ (Regina) అనే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×