Namratha Shirodhkar : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అందరికి తెలుసు.. సూపర్ స్టార్ కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు. తండ్రికి తగ్గకుండా సినిమాల్లో సత్తాను చాటుకున్నాడు. ఆయన భార్య నమ్రత భర్త అడుగు జాడల్లోనే నడుస్తుంది. భర్తే ప్రాణంగా బ్రతుకుంది.. అయితే ఈ మధ్య ఆమె ఒంటరిగా ఉంటుంది. అదేంటి? ఏదైనా గొడవలా? అసలు ఏం జరుగుతుంది..? సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నిజమేనా? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
మహేష్ బాబు భార్య నమ్రత శిరో్ద్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో బాలీవుడ్ లో బిజీగా ఉంది. అక్కడ క్రేజీ హీరోయిన్ అయిన ఈమె తెలుగులో రెండు సినిమాలు చేసింది. అందులో వంశీ మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే ఆ సినిమా సమయంలోనే మహేశ్ బాబుతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి ఇక్కడే సెటిల్ అయిపోయి అందరితో మంచి సంబంధాలను కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ కు సంబంధించిన ఏదైనా కార్యక్రమం జరిగినా అక్కడ నమ్రత పాల్గొనడం కనిపిస్తుంటుంది.. అయితే ప్రస్తుతం ఆమె ఒంటరిగా ఫంక్షన్స్ కు వెళ్తుంది. అదేంటి భార్య భర్తలు ఇద్దరు కలిసే కదా వెళ్తారు. ఇప్పుడేమో ఒక్కటే వెళ్తుంది. అదేంటి అనే సందేహాలు అందరికి రావడంతో సోషల్ మీడియాలో రకరకాల పూకార్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య దూరం పెరగడానికి కారణం ఓ డైరెక్టర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఆ డైరెక్టర్ పై ప్రిన్స్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు..
Also Read : ఏంటి కీర్తి ఇది నిజమేనా?.. పెళ్లి అవ్వగానే ఇలా చేస్తావనుకోలేదు…!
అసలు విషయానికొస్తే.. వీరిద్దరికీ ఎడబాటు రావడానికి కారణం ముమ్మాటికీ డైరెక్టర్ రాజమౌళినే కారణం అని ఓ వార్త వినిపిస్తుంది. ఎందుకంటే రాజమౌళి మహేశ్ తో ఓ భారీ బడ్జెట్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగు హైదరాబాదులో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతుంది. దాంతో మహేష్ ఆ షుటింగులో బిజీగా ఉన్నారు. రాజమౌళి సినిమా తీస్తున్నాడంటే అందరికీ తెలిసిందే.. ఏ హీరో అయినా తనకు కొన్నాళ్ల పాటు బందీగా ఉండాల్సిందే.. ఎన్నేళ్లు పట్టినా కమిట్ అయితే లాక్ అయ్యినట్లే.. గతంలో చాలా మంది హీరోలు ఈ విషయం పై మాట్లాడారు.. ఫన్నీ మీమ్స్ కూడా పేలాయి.. మహేష్ లో ప్రొఫైల్‌ను మెయింటైన్ చేస్తారు. ఆయన తరఫున నమ్రత దాన్ని బ్యాలెన్స్ చేస్తూ అందరితో కలిసి సంతోషంగా సమయం గడుపుతు చేస్తూ మంచి పబ్లిక్ రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తుంది. ప్రస్తుతం రాజమౌళి షూటింగ్ లో బిజీగా ఉండడంతో బయట కార్యక్రమాలకు రాలేడు.. దాంతో నమ్రత ఈ బాధ్యతను తీసుకుంది. ఆయన తరపున అన్ని ఫంక్షన్లకు ఆమె హాజరువుతుంది.. ఇక ఈ మూవీ షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. మరి వచ్చే ఏడాది థియేటర్లలోకి తీసుకొని వస్తామని జక్కన్న అన్నాడు కానీ ఇంకాస్త ఆలస్యం అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు..