Sankranthiki Vasthunam : సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సంక్రాంతి వస్తున్నాం’. థియేటర్లలో రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ మూవీ ఓటీటీతో పాటు టీవీలో కూడా ఒకేసారి ప్రసారమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టీవీలో కూడా దుమ్ము రేపే టిఆర్పి రేటింగ్ ను రాబట్టిందనే అప్డేట్ వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ సినిమా క్రియేట్ చేసిన టిఆర్పి రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. మరి హయ్యెస్ట్ టీఆర్పీ రాబట్టిన పవన్ కళ్యాణ్ సినిమా ఏంటి? ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీకి ఎంత టిఆర్పి రేటింగ్ వచ్చింది? అనే వివరాల్లోకి వెళ్తే…
దుమ్మురేపే టీఆర్పీ రేటింగ్
విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో వచ్చిన మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి వచ్చింది. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ కాబట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా డిజిటల్ అండ్ సాటిలైట్ రైట్స్ ని జీ గ్రూప్ సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలోనే మార్చి 1 న జీ తెలుగు ఛానల్ లో సాయంత్రం 6 గంటలకు ఈ మూవీని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేశారు. అదే టైంలో ఓటీటీలో కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ టీవీ స్ట్రీమింగ్ కు సంబంధించి ప్రత్యేకంగా ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ టీఆర్పి రేటింగ్ పరంగా దుమ్మురేపింది. ఈ మూవీకి ఏకంగా 15.92 టిఆర్పి రేటింగ్ వచ్చినట్టు సమాచారం. గత ఐదేళ్లలో జీ తెలుగులో హయ్యెస్ట్ రేటింగ్ రాబట్టిన రెండవ సినిమా ఇదే కావడం విశేషం. ఫస్ట్ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మూవీ ఉంది.
పవన్ రికార్డును బ్రేక్ చేయలేకపోయిన వెంకీ మామ
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీకి తాజాగా 15.92 రేటింగ్ రావడం మంచి విశేషం అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఓటిటిలోకి అడుగు పెడుతున్నాయి. చివరగా టెలివిజన్ ప్రీమియర్ అవుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో టీవీలలో స్టార్ హీరోలో సినిమాలకు సైతం పెద్దగా ఆదరణ దక్కట్లేదు. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీని ఒకేసారి టెలివిజన్ తో పాటు ఓటీటీలో కూడా టెలికాస్ట్ చేయడం కలిసి వచ్చిందని చెప్పాలి. కానీ టిఆర్పి రేటింగ్ పరంగా పవన్ మూవీనే టాప్ లో ఉంది. జీ తెలుగులో ప్రసారమైన సినిమాలలో ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) హయ్యెస్ట్ టిఆర్పి రేటింగ్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఈ మూవీకి 19.12 టిఆర్పి రేటింగ్ వచ్చింది. మరి పవన్ మూవీ టిఆర్పి రేటింగ్ ను ఏ హీరో బ్రేక్ చేస్తాడు అనేది చూడాలి.